US Credit Card Debt: బిల్లులు ఎగ్గొడుతున్న అమెరికన్లు.. పీకల్లోతు అప్పుల్లో అగ్రరాజ్యం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Credit Card Debt: ప్రపంచాన్ని శాసించే అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పుడు వింత పరిస్థితులు నెలకొన్నాయి. రోజువారీ ఖర్చులకు క్రెడిట్ కార్డులను విచ్చలవిడిగా వాడేసిన అక్కడి ప్రజలు.. ఇప్పుడు ఆ బిల్లులు చెల్లించలేక చేతులెత్తేస్తున్నారు. కొనుగోళ్ల జోరుతో మొదలైన ‘స్వైపింగ్ కల్చర్’ చివరకు తీవ్రమైన చెల్లింపుల ఎగవేతలకు దారితీస్తోంది. గడువు ముగిసినా నెలల తరబడి బకాయిలు చెల్లించకపోవడంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ పీకల్లోతు అప్పుల ఊబిలోకి జారుకుంటోందని తాజాగా విడుదలైన ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపుల్లో అమెరికన్లు భారీగా ఫెయిల్ అవుతున్నారు. న్యూయార్క్ ఫెడ్ తాజా నివేదిక ప్రకారం.. ముఖ్యంగా తక్కువ ఆదాయ వర్గాలు నివసించే ప్రాంతాల్లో ఏకంగా 10.3 శాతం కార్డు బకాయిలు 90 రోజులకు పైగా పెండింగ్‌లో పడిపోయాయి. ధనిక ప్రాంతాలతో పోలిస్తే పేద ప్రాంతాల్లో బిల్లుల డిఫాల్ట్ రేటు రెండింతలకు పైగా పెరగడం గమనార్హం. బిల్లులు కట్టకపోవడంతో అపరాధ రుసుములు, అధిక వడ్డీలు తోడై ప్రజలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నారు. మరోవైపు యువత కూడా ఈ ఎగవేత జాబితాలో ముందుంటోంది. 30 ఏళ్ల లోపు వయసున్న యువతలోనే క్రెడిట్ కార్డు బిల్లులు 90 రోజులకు పైగా చెల్లించకుండా డిఫాల్ట్ అవుతున్న కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. సగటున ఒక్కో కార్డుదారుడిపై సుమారు 6,678 డాలర్ల (దాదాపు రూ.6.28 లక్షలు) బకాయి పేరుకుపోవడంతో, కెరీర్ స్టార్టింగ్‌లోనే యువత అప్పుల వలలో చిక్కుకుంటోంది.
Also Read
- Stock Market: స్టాక్ మార్కెట్లో లాభాలే లాభాలు.. ధైర్యంతో పెట్టుబడి పెట్టిన వారికి వరించిన ధనలక్ష్మి..
- India Unemployment Rate 2026: దేశంలో నిరుద్యోగం తగ్గుముఖం.. 5.1 శాతానికి పడిపోయిన నిరుద్యోగ రేటు!
- EPS Pension Hike: EPS పెన్షనర్లకు గుడ్ న్యూస్.. రూ.3,000 కనీస పెన్షన్‌పై నవంబర్ 19న కీలక నిర్ణయం..!
- Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!
ప్రజల ఎగవేత ధోరణి, పెరిగిన జీవన వ్యయాల ఫలితంగా అమెరికాలో మొత్తం క్రెడిట్ కార్డుల బకాయిలు ఆల్-టైమ్ రికార్డు స్థాయి అయిన 1.29 ట్రిలియన్ డాలర్లకు (దాదాపు రూ.121.3 లక్షల కోట్లు) చేరాయి. ఒక్క మూడో త్రైమాసికంలోనే ఈ బకాయిలు 22 బిలియన్ డాలర్లు పెరిగాయి. ఇక క్రెడిట్ కార్డులతో పాటు హోమ్ లోన్లు, కార్ లోన్లు, విద్యార్థుల రుణాలన్నీ కలిపితే అమెరికన్ కుటుంబాల మొత్తం అప్పు రికార్డు స్థాయిలో 19.1 ట్రిలియన్ డాలర్లకు (సుమారు రూ.1,795.4 లక్షల కోట్లు) చేరింది. కరోనా మహమ్మారి కంటే ముందున్న స్థాయితో పోలిస్తే ఇది ఏకంగా 5 ట్రిలియన్ డాలర్లు ఎక్కువ కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కార్డులతో విలాసాలు చేసిన జనం.. ఇప్పుడు నెలవారీ వడ్డీలు కూడా కట్టలేక దివాళా తీసే దుస్థితికి చేరుకుంటున్నారు.
తాజావార్తలు
-
US Credit Card Debt: బిల్లులు ఎగ్గొడుతున్న అమెరికన్లు.. పీకల్లోతు అప్పుల్లో అగ్రరాజ్యం!
-
TGCSB: మీ మనీ.. మీ క్లిక్.. మీ ఛాయిస్.. హెచ్చరికలు జారీ చేసిన సైబర్ క్రైమ్ బ్యూరో..
-
Babu Mohan: ‘దరిద్రం వెంటపడితే అంతే!’.. ది ప్యారడైజ్ టీమ్‌పై బాబు మోహన్ షాకింగ్ కామెంట్స్
-
Kangana Ranaut: సంజయ్, ఇందిరా, రాజీవ్ గాంధీ మరణాలు.. సోనియాపై కంగనా తీవ్ర వ్యాఖ్యలు..
-
Anirudh – Kavya : అనిరుధ్ సంపాదన.. కావ్య పాకెట్ మనీతో సమానమా?
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!