Site icon NTV Telugu

AP News: మరీ ఇంత దారుణమా? బకెట్లో తలలు ముంచేసి ఇద్దరు కుమారులను చంపిన తండ్రి..

Ap News

Ap News

ఏపీలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. కన్న తండ్రి తన కుమారులను దారుణంగా చంపేశాడు. అత్యంత క్రూరంగా హత్య చేశాడు. ఇద్దరు కుమారుల కాళ్లూ చేతులను తాళ్లతో కట్టేసి, నీళ్ల బకెట్లలో తలలు ముంచేశాడు. ఊపిరాడక కొట్టుమిట్టాడుతూ.. ఇద్దరు బాలురు తుది శ్వాస వదిలారు. ఈ ఘటన అనంతరం ఆ తండ్రి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, సొంతిల్లు, మంచి కుటుంబం ఉన్నా, ఈ పోటీ ప్రపంచంలో తన పిల్లలు రాణించలేరని అందుకే చంపేసి తానూ ఆయువు తీసుకుంటున్నట్లు ఆ తండ్రి తన సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు. నిన్న కాకినాడలోని సుబ్బారావునగర్‌లో ఈ ఘటన జరిగింది.

READ MORE: Konda Surekha : వాస్తవాలకు బీఆర్ఎస్ భయపడుతోంది

పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన వానపల్లి చంద్రకిశోర్‌ కాకినాడ జిల్లా వాకలపూడిలోని ఓఎన్‌జీసీ కార్యాలయంలో అసిస్టెంట్‌ ఎకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. నగరంలోని ఓ ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నాడు. అతనికి భార్య తనూజ, ఒకటో తరగతి చదివే జోషిల్‌ (7), యూకేజీ చదివే నిఖిల్‌ (6) పిల్లలున్నారు. వారు సరిగా చదవడం లేదంటూ ఇటీవలే పాఠశాలను మార్పించారు. హోలీ సందర్భంగా చంద్రకిశోర్‌ శుక్రవారం భార్య, పిల్లలను తీసుకుని తమ ఆఫీసులో వేడుకలకు వెళ్లాడు. అక్కడే ఉండాలని పిల్లలకు యూనిఫాం కొలతలు తీయించడానికి టైలర్‌ వద్దకు తీసుకెళ్తున్నానని చెప్పాడు. పది నిమిషాల్లో వస్తాని చెప్పి వెళ్లాడు. సయమం గడుస్తున్నా.. భర్త, పిల్లలు రాకపోవడంతో ఆమె ఫోన్ చేసింది. చంద్రకిశోర్ ఫోన్‌ లిఫ్ట్ చేయలేదు. తనూజ తోటి ఉద్యోగులతో కలిసి ఇంటికి వెళ్లింది.

READ MORE: Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీకి వియత్నాంలో ఏం పని..?’’ విదేశీ పర్యటనల్ని ప్రశ్నించిన బీజేపీ..

తలుపులు బాదినా భర్త డోర్ తీయకపోవడంతో ఆమె కంగారు పడింది. కిటికీలో నుంచి లోపలికి చూసింది. తన భర్త ఫ్యాన్‌కు వేళాడుతూ.. కనిపించాడు. తలుపులు బద్దలు గొట్టి లోపలికి వెళ్లి చూడగా.. ఇద్దురు కుమారుల కాళ్లూ చేతులకు కట్లు ఉన్నాయి. వాళ్ల తలలు నీటితో నిండిన బకెట్లలో ఉన్నాయి. అది చూసిన తల్లి ఒక్కసారిగా గుండెలు పగిలేలా రోదించింది. నిర్జీవస్థితిలో ఉన్న భర్త, పిల్లలను చూసి కన్నీరుమున్నీరుగా విలపించింది. అక్కడ భర్త సూసైడ్‌ నోట్ కనిపించింది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో తన పిల్లలు పోటీ పడలేక పోతున్నారని, వారికి భవిష్యత్తు లేదని, అందుకే ఇద్దరు పిల్లలను చంపి తాను కూడా చనిపోతున్నానని చంద్రకిశోర్‌ సూసైడ్‌ నోటులో రాశాడు. ఆ నోట్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు పోలీసులు. చంద్రకిశోర్‌కి ఎలాంటి సమస్యలు లేవని ఉన్నా.. ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడు కాదని కుటుంబీకులు తెలిపారు.

Exit mobile version