Site icon NTV Telugu

Ameenpur: దారుణం.. బావను హత్య చేసిన బామ్మర్ది

Murder

Murder

Ameenpur: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో ఘోర ఘటన చోటుచేసుకుంది. కుటుంబికుల మధ్య ఆర్థిక వివాదం ప్రాణహానికి దారితీసింది. ఇటీవలే జేసీబీ కొనుగోలు చేసారు గోపాల్, అతని బామ్మర్ది సురేష్. అయితే గోపాల్ తన స్వార్థ ప్రయోజనాల కోసం బామ్మర్ది సురేష్ ను హత్య చేశాడు. జేసీబీ పూర్తిగా తన సొంతమవుతుందని భావించిన సురేష్, కిరాతకంగా ఈ హత్యకు పాల్పడ్డాడు. సురేష్ తన బావ గోపాల్‌ను నమ్మించి, మద్యం తాగుదామని పిలిచాడు. ఈ క్రమంలో తన స్నేహితుడిని కూడా పిలిపించుకొని, ఇద్దరూ కలిసి పాశవికంగా హత్య చేశారు. అనంతరం నేరాన్ని దాచిపెట్టేందుకు గోపాల్ మృతదేహాన్ని స్మశాన వాటికలో పడేసి పరారయ్యారు.

Read Also: Rama Krishna : తెలుగు చలన చిత్ర సీమకు మరచిపోలేని చీకటి రోజు

ఇక విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని, పోస్టుమార్టం నిమిత్తం పటాన్ చెరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ కేసు గురించి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. హత్యకు గల అసలు కారణాలపై విచారణ కొనసాగుతోంది. పరారైన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కేవలం ఆస్తి కోసం ఇంత క్రూరంగా ప్రవర్తించారన్న ప్రశ్న స్థానికులను కలవరపెడుతోంది. పోలీసుల దర్యాప్తుతో నిజాలు త్వరలో వెలుగులోకి రానున్నాయి.

Exit mobile version