Heart Attack: డోన్‌లో విషాదం.. వినాయక ఊరేగింపులో పాల్గొన్న యువకుడు మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వినాయక చవితి వేడుకలు ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరగాల్సి ఉండగా, నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో చోటుచేసుకున్న ఒక విషాద ఘటన అందరినీ కలచివేసింది. పండగ వాతావరణంలో భక్తిశ్రద్ధలతో ఉత్సాహంగా గడపాల్సిన చోట, కుటుంబంలో నవ్వులు నింపాల్సిన యువకుడు ఒక్కసారిగా విగతజీవిగా మారడం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది. వినాయక చవితి వేడుకలు ఇంతటి శోకంతో ముగుస్తాయని ఆ కుటుంబసభ్యులు కలలో కూడా ఊహించి ఉండరు. ఆనందంగా గడపాల్సిన వేడుకలు ఆ కుటుంబానికి తీరని వేదనను మిగిల్చాయి.
డోన్ పట్టణంలో జరిగిన వినాయక చవితి శోభాయాత్రలో స్థానిక యువకుడు గణేష్ గౌడ్ (23) ఉత్సాహంగా, భక్తిభావంతో పాల్గొన్నారు. భక్తులతో కలిసి గణేష్ గౌడ్ డప్పు చప్పుళ్లకు అనుగుణంగా నృత్యం చేస్తూ ఆనందంగా గడిపారు. అందరితో కలిసి సరదాగా గడిపిన కొన్ని గంటలకే అతని ఆరోగ్యం క్షీణించింది. ఊరేగింపు ముగిసిన తర్వాత గణేష్ గౌడ్ ఇంటికి చేరుకున్నారు. ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే ఆయనకు ఛాతిలో తీవ్రమైన నొప్పి రావడంతో పాటు గుండెపోటు సంభవించింది. కుటుంబసభ్యులు తేరుకునే లోపే ఆయన పరిస్థితి విషమించడంతో ఆందోళన చెందారు.
Also Read
- Abhishek Sharma: కోహ్లీ, రోహిత్ కాదు.. ‘అభిషేక్ శర్మను కిడ్నాప్ చేస్తా’.. ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్..
- Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
- Pakistan-Taliban Tensions: పాకిస్తాన్‌కు తాలిబాన్ వార్నింగ్.. ఆఫ్ఘన్‌లోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలే..
- CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గమధ్యంలోనే గణేష్ గౌడ్ తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధృవీకరించారు. 23 ఏళ్ల వయసున్న యువకుడు, క్షణాల వ్యవధిలో గుండెపోటుతో మరణించడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఒక్కగానొక కొడుకు కుటుంబానికి ఆసరాగా ఉండాల్సిన యువకుడు ఇలా అకస్మాత్తుగా మృతి చెందడంతో ఆ ఇంటి తల్లిదండ్రుల రోదనలు అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించాయి. ఈ దారుణ ఘటన డోన్ పట్టణంలో తీవ్ర విషాద ఛాయలను నింపింది. గణేష్ గౌడ్ మృతి వార్త తెలిసిన వెంటనే స్నేహితులు, స్థానికులు, బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చి నివాళులు అర్పించారు. యువతలో పెరుగుతున్న ఆరోగ్య సమస్యలపై ఈ ఘటన మరోసారి ఆందోళన కలిగించింది.
తాజావార్తలు
-
Heart Attack: డోన్‌లో విషాదం.. వినాయక ఊరేగింపులో పాల్గొన్న యువకుడు మృతి..
-
America vs Iran: అమెరికా యుద్ధ నేరాలకు సాక్ష్యాలు.. పిల్లలను కూడా వ*దలలేదు..!
-
Gondhal Oscars 2027: రూ.84 లక్షలే వసూలు చేసిన ‘గోంధల్’.. రూ.3000 కోట్ల ‘ధురంధర్’ను దాటి ఆస్కార్ రేసులోకి ఎలా వెళ్లిందంటే?
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Abhishek Sharma: కోహ్లీ, రోహిత్ కాదు.. ‘అభిషేక్ శర్మను కిడ్నాప్ చేస్తా’.. ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్..
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!