Site icon NTV Telugu

Ganesh Immersion: గణేష్ నిమజ్జనంలో అపశృతి.. ముగ్గురు మృతి

Ganesh Immersion

Ganesh Immersion

Ganesh Immersion: దేశంలో అన్ని పండగల కన్నా గణేష్ చతుర్థిని అందరూ చాలా ఇష్టంగా జరుపుకుంటారు. నవరాత్రుల ప్రారంభం నుంచి నిమజ్జనం వరకు ఎంతో హడావిడిగా ఉంటుంది. ఈ పండుగ వేళ కొన్ని ప్రాంతాల్లో అపశృతి చోటుచేసుకుని.. కొన్ని కుటుంబాలకు తీరని శోకం మిగులుతోంది. తాజాగా కొన్ని ప్రాంతాల్లో అపశృతి చోటుచేసుకుంది. అన్నమయ్య జిల్లా పెద్దమండెం మండలం పాపేపల్లి వినాయక నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. వినాయకుడి నిమజ్జనానికి వెళుతున్న ట్రాక్టర్ బోల్తా పడి ఒకరు మృతి చెందగా.. 10 మంది తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

Read Also: Rashmika Mandanna: రష్మిక’కి ప్రమాదం.. ఏమైందంటే?

కడప జిల్లా చక్రాయపేట మండలంలో విషాదం చోటుచేసుకుంది. నెరసుపల్లె క్రాస్ రోడ్డు వద్ద ట్రాక్టర్ కిందపడి ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆంజనేయపురం గ్రామానికి చెందిన గౌతం అనే యువకుడు మృతి మృతి చెందాడు. వినాయక నిమర్జనం అనంతరం ఇంటికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. యువకుడి మృతితో అతడి కుటుంబాన్ని విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

మరో ఘటన తిరుపతి జిల్లాలో జరిగింది. వాకాడు మండలం తూపులి పాలెంలో వినాయక నిమజ్జనంలో ఆపశృతి చోటుచేసుకుంది. బంగాళాఖాతంలో వినాయకుని నిమజ్జనం చేస్తూ ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన వారు నాయుడుపేటలోని కావమ్మ గుడి సెంటర్‌కు చెందిన మునిరాజా, ఫయాజ్, శ్రీనివాసులుగా స్థానికులు గుర్తించారు. శ్రీనివాసులును మెరైన్ పోలీసులు రక్షించారు. ఈ ఘటనలో ఫయాజ్‌ మృతి చెందగా.. గల్లంతైన మునిరాజా కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Exit mobile version