NTV Telugu Site icon

Atal Setu: అట‌ల్ సేతుపై ఆటో.. నెటిజెన్ల ఫ‌న్నీ రియాక్షన్స్..

Auto

Auto

మహారాష్ట్రలోని ముంబైలో ఇటీవ‌ల భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సముద్రంపై నిర్మించిన అట‌ల్ సేతు బ్రిడ్జ్‌ను ప్రారంభించారు. అయితే, ముంబైలోని సెవ్రి నుంచి రాయ్‌గ‌డ్ జిల్లాలోని న‌వ సేవా వ‌ర‌కు ఆ బ్రిడ్జ్ కనెక్టవిటీ కలిగి ఉంది. ఇక, శనివారం నుంచి ఈ బ్రిడ్జ్ ప్రయాణికుల అందుబాటులోకి వచ్చింది. ఇక, ఈ బ్రిడ్జ్‌పై వాహ‌న‌దారులు రూల్స్ ఉల్లంఘించి ప్రవేశిస్తున్నారు.

Read Also: Komatireddy: ఆ ప్రాజెక్టు కు జైపాల్ రెడ్డి పేరు పెడతాం..? రేవంత్ రెడ్డితో చర్చిస్తామన్న కోమటిరెడ్డి

అయితే, ముంబై ట్రాఫిక్ పోలీసులు విధించిన ఆంక్షలను ఓ ఆటో డ్రైవర్ బ్రేక్ చేశాడు. 21.8 కిలో మీటర్ల దూరం ఉన్న ఈ బ్రిడ్జ్ పై ఓ ఆటో ప్రయాణం చేస్తూ కనిపించింది. నిజానికి మూడు చక్రాల వెహికిల్స్ కు ఈ బ్రిడ్జ్ మీదకు అనుమతి లేదు.. కానీ ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్‌పై ఆటో తిరుగుతున్నట్లు ఓ వ్యక్తి ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది.. కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో అనేక మంది నెటిజెన్లు ఆ ఆటోను చూసి షాక్ అవుతున్నారు. ఆ ఆటో డ్రైవ‌ర్‌పై తగిన చర్యలు తీసుకోవాలని కొందరు కోరుతుంటే.. చిర్లే, ఉల్వేలో టోల్ బూత్ ఉంటుంది.. ఇక ముంబై వైపుకు అయితే సోబో దగ్గర టోల్ గేట్ ఉంటుంది.. అక్కడ నుంచి ఆటోల‌కు అనుమ‌తి ఉండ‌ద‌ు.. మరీ ఈ ఆటో ఎలా వ‌చ్చింద‌ని మరో వ్యక్తి కామెంట్ చేశాడు.

Read Also: MP Vijay Sai Reddy: సీఎం జగన్‌కు అంబేద్కర్‌పై ఉన్న అభిమానంతో విగ్రహ నిర్మాణం.. 19న ప్రారంభోత్సవం

ఇక, ఆ ఆటోవాలా క‌నీసం ఓ ఫోటో కోసం కూడా ఆగ‌లేద‌ని మ‌రో నెటిజన్ ట్వీట్ చేశాడు. కొత్త బ్రిడ్జ్‌ను ఆటో సేతు అంటూ మ‌రో యూజ‌ర్ వ్యాఖ్యనించాడు. ఆటో వెనుక ఎఫ్ఐఆర్ మిలేంగే అని రాసి అత‌ను హెచ్చరికలు జారీ చేసినట్లు మ‌రో యూజ‌ర్ పేర్కొన్నారు. మొత్తానికి ఆ ఆటోవాలాకు చెలాన్ వేయ్యాలని కొంద‌రు నెటిజన్స్ కోరారు. మొత్తానికి అటల్ సేతు బ్రిడ్జ్ మీదకు ఈ ఆటోను ఎవరు అనుమతించారు అనే దానిపై పోలీసులు విచారణ చేస్తు్న్నారు.