Site icon NTV Telugu

Secunderabad: శభాష్ ట్రాఫిక్ పోలీస్.. రోడ్డుపై ఉన్న భారీ వృక్షానికి ప్రాణప్రతిష్ట..

Trafic

Trafic

సాధారణంగా రోడ్లు వేసేటప్పుడు, పెద్ద పెద్ద భవంతులు నిర్మించే సమయంలో చెట్లు అడ్డుగా ఉంటే ఏం చేస్తారు? దాన్ని నరికి పక్కన పారేస్తారు. ఇదే సులభమైన పని కదా.. కానీ.. సికింద్రాబాద్ మారేడ్పల్లిలో మాత్రం ట్రాఫిక్ పోలీసులు చెట్టుకు ప్రాణప్రతిష్ట చేశారు. రోడ్డుపై ఉన్న భారీ వృక్షాన్ని వేళ్ళతో సహా పెకిలించి, మరోచోట నాటారు. భారీ క్రేన్ల సహాయంతో చెట్టును తరలించారు ట్రాఫిక్ పోలీసులు. ఈ వినూత్న ప్రయత్నం సఫలీకృతం కావడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. దీంతో ప్రకృతిపై పోలీసులకు ఉన్న మక్కువకు జనాలు శభాష్ అంటున్నారు. ఆ ట్రాఫిక్ పోలీసులను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

READ MORE: Murder: మగపిల్లాడి కోసం రెండో పెళ్లి.. ఆమెకూ ఆడ పిల్లలే పుట్టడంతో భార్యను చంపిన భర్త!

చెట్లను నరకొద్దు సారూ…
చెట్లను తీసేయకుండా ప్రభుత్వానికి అనేక ప్రత్యమ్నాయాలు ఉన్నాయి. కానీ, వాటిని నరకడం సులభం, చవకైన పరిష్కారం కావడంతో అభివృద్ధిలో భాగంగా భారీ చెట్లను తొలగిస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని చెట్లు నాటుతున్నా… స్థానిక మొక్కల రకాలను నాటకపోవడంతో అవి భారీ చెట్లతో సరితూగలేవు. ప్రస్తుతం నాటుతున్న చెట్లు వేగంగా పెరుగుతాయే తప్ప భారీ చెట్లకు సమానం కావు. పర్యావరణ హితంగా ఉంటామని చెప్పుకుంటున్న ప్రభుత్వం అభివృద్ధి పేరుతో చెట్లను నరికేందుకు అనుమతి ఇవ్వకుండా.. వాటికి తిరిగి పురర్జీవం పోసి పర్యావరణాన్ని పరిరక్షించే దిశగా కృషి చేయాలి.

READ MORE: Gautam Gambhir: ‘ఐ కిల్‌ యూ’.. టీమిండియా కోచ్ గౌతమ్‌ గంభీర్‌కు బెదిరింపులు!

Exit mobile version