గణతంత్ర దినోత్సవం సందర్భంగా రేపు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో గవర్నర్ నిర్వహించే ఎట్ హోమ్ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. దీంతో అధికారులు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రాజ్‌భవన్‌కు ఇరువైపులా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.
Also Read : Sudheer Babu: మహేష్ బావ కోరిక మాములుగా లేదుగా.. రాజమౌళితోనే కావాలంట
ట్రాఫిక్ రద్దీ ఉండే జంక్షన్లు: సోమాజిగూడ, మోనప్ప ఐలాండ్ (రాజీవ్ గాంధీ విగ్రహం), రాజ్‌భవన్ మెట్రో స్టేషన్, వివి విగ్రహం జంక్షన్ (ఖైరతాబాద్). పైన పేర్కొన్న సమయాల్లో రాజ్ భవన్ క్వార్టర్స్ రోడ్ (మెట్రో రెసిడెన్సీ) ఇరువైపులా సాధారణ ట్రాఫిక్ కోసం మూసివేస్తారు. పౌరులందరూ పైన పేర్కొన్న ట్రాఫిక్ సలహాను గమనించి, ట్రాఫిక్ రద్దీ జంక్షన్‌లను నివారించాలని, వారి గమ్యాన్ని చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని అధికారులు అభ్యర్థించారు.
Also Read : Malikapuram Review: మాలికాపురం (మళయాళం డబ్బింగ్)