డిసెంబర్ 5న రిలీజ్ అయిన మోస్ట్ అవైటేడ్ మూవీ పుష్ప 2. అత్యంత వేగంగా రూ. 1000, 1500, 1700 కోట్ల గ్రాస్ రాబట్టిన సినిమాగా పుష్ప2 సరికొత్త రికార్డ్ సృష్టించింది. వరల్డ్ వైడ్ గా ఇప్పటివరకు రూ. 1800 కోట్ల మార్క్ టచ్ చేసి బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ చేసింది పుష్ప2. అయితే ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్స్‌లో ఒక్క బాలీవుడ్ నుంచే దాదాపుగా సగం వరకు రావడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పటి వరకు బాలీవుడ్ బడా స్టార్స్ షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్‌కు సైతం ఈ రేంజ్ వసూళ్లు సాధ్యం కాలేదు.
Also Read : Pushpa 2 : పుష్ప -2 రికార్డ్స్ బద్దలు కొట్టే హీరో ఎవరంటే..?
ఇప్పటికీ నార్త్ బెల్ట్‌లో సాలిడ్ ఆక్యుపెన్సీతో దూసుకెళ్తోన్న పుష్ప 2. తాజాగా రూ. 806 కోట్ల మార్క్ ను టచ్ చేసి ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. కేవలం 31 రోజుల్లోనే ఈ రేంజ్ కలెక్షన్స్ సాధించి హిందీ బాక్సఫీస్ వద్ద నంబర్ -1 సినిమాగా చరిత్ర సృష్టించింది. దాంతో పాటు ఎనిమిది వందల కోట్లు అందుకున్న ఫస్ట్ ఎవర్ హిందీ సినిమాగా సెన్సేషన్ క్రియేట్ చేసింది పుష్ప -2. బాలీవుడ్ లో పుష్ప రాజ్ క్రేజ్ ఇప్పట్లో ఆగేలా లేదు. ఇటీవల రిలీజ్ అయిన సినిమాలు కూడా పుష్ప -2 ముందు కనీసం నిలబడలేకపోయాయి. వరుణ్ ధావన్ నటించిన బేబీ జాన్ ఓ మోస్తరు టాక్ తెచ్చుకున్నకూడా పుష్ప -2 ప్రభంజనం ముందు తట్టుకోలేక డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పట్లో పెద్ద సినిమాలు ఏవి లేకపోవడం కలెక్షన్స్ స్టడీగా ఉండడం లాంగ్ రన్ లో వెయ్యికోట్ల మార్క్ అందుకుంటుందని ట్రేడ్ అంచనా వేస్తుంది.