NTV Telugu Site icon

Revanth Reddy: కేసీఆర్, కేటీఆర్‌కు రేవంత్ సవాల్‌.. దమ్ముంటే వాళ్లకు సీట్లివ్వండి..

Tpcc Chief Revanth Reddy Challenge To Cm Kcr And Ktr

Tpcc Chief Revanth Reddy Challenge To Cm Kcr And Ktr

Revanth Reddy: గద్దర్ కాంగ్రెస్ నుండి పోటీ చేస్తారు అనే చర్చ పార్టీలో జరగలేదని.. ఏదైనా అధిష్ఠానమే ఫైనల్‌ చేస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన కీలక విషయాలు వెల్లడించారు. పార్టీలోకి ఎవరైనా రావచ్చని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. జర్నలిస్టులు వచ్చినా స్వాగతిస్తామని.. టికెట్ మాత్రం గ్యారంటీ ఇవ్వలేమన్నారు. రాజగోపాల్ రెడ్డి ఏం కండిషన్ పెట్టారో తెలియదని.. అధిష్ఠానం చెప్తే ఆలోచన చేస్తామన్నారు.

ఈ నేపథ్యంలో కేసీఆర్, కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి ఓ సవాల్ విసిరారు. సభలు పెట్టిన చోట వీళ్లే మా అభ్యర్థులు అని ఎందుకు చెప్పడం లేదని రేవంత్ ప్రశ్నించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇస్తాం అని దమ్ముంటే ప్రకటన చేయాలంటూ సవాల్ విసిరారు. నీళ్లు..నిధులు..నియామకాల స్లోగన్ కాస్తా ఇప్పుడు.. లీకులు.. లిఫ్టులు.. లిక్కర్‌గా మారిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరు సీఎం అనేదాంట్లో బీఆర్‌ఎస్ వాళ్లకే స్పష్టత లేదన్నారు. స్పీకర్ పోచారం… కేటీఆర్ సీఎం అవుతారు అన్నారని.. కేటీఆర్.. మరోసారి కేసీఆర్ సీఎం అవుతారు అంటున్నారని రేవంత్ చెప్పుకొచ్చారు. వాళ్లకే క్లారిటీ లేకుండా.. కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరూ అని కేటీఆర్ అడుగుతున్నారని రేవంత్ ఎద్దేవా చేశారు.

Read Also: Bandi Sanjay: బీఆర్‌ఎస్‌ ఖేల్ ఖతం.. తెలంగాణ రాష్ట్రంలో కాషాయ రాజ్యం వస్తుంది..

కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని ప్రకటన చేస్తే బీఆర్‌ఎస్ దుకాణం బంద్ చేసుకుంటుందా అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు. తనకు ఓఆర్‌ఆర్‌ ఇష్యూపై ఇచ్చిన లీగల్ నోటీసుకు రేపు రిప్లై ఇస్తున్నానని రేవంత్ పేర్కొన్నారు.

Show comments