Site icon NTV Telugu

TPCC Mahesh Goud : బీఆర్‌ఎస్‌ నేతలకు టీపీసీసీ చీఫ్ సవాల్‌.. అభివృద్ధిపై మేము చర్చకు సిద్ధం

Maheshkumar

Maheshkumar

TPCC Mahesh Goud : మూసీ పునరుజ్జీవం చేసి తీరుతామని వెల్లడించారు టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌. ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లా డీసీసీ అధ్యక్షుల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్‌ కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. ఈనెల 19న సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై సమీక్ష సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. బీఆర్ఎస్ కు నూకలు చెల్లినాయని, అందుకే ఆపార్టీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ పదేళ్ల అభివృద్ధి, మేము ఏడాదిలో చేసిన అభివృద్ధిపై మేము చర్చకు సిద్ధమని ఆయన బీఆర్‌ఎస్‌ నేతలకు సవాల్‌ విసిరారు. మూసీ పునరుజ్జీవం చేసి తీరుతామని ఆయన ఉద్ఘాటించారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై విజయోత్సవాలు జరుపుతున్నామని ఆయన వెల్లడించారు. మహిళలకు, అన్ని వర్గాల ప్రజలకు ఏం చేశామో వరంగల్ విజయోత్సవ సభలో వెల్లడిస్తామని మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు.

Pushpa 2 The Rule: రేయ్ ఏంట్రా మీరు ఇలా ఉన్నారు.. గన్నులతో వెల్కమ్ ఏంటి?

Exit mobile version