NTV Telugu Site icon

Revanth Reddy Protest: రోడ్డెక్కిన సీఎం.. కాంగ్రెస్ భారీ ర్యాలీ

Cm Revanth

Cm Revanth

Revanth Reddy Protest: టిపీసీసీ ఆధ్వర్యంలో బుధవారం (డిసెంబర్ 18, 2024) “చలో రాజ్‌భవన్” కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఏఐసీసీ పిలుపు మేరకు అదానీ ఆర్థిక అవకతవకలు, నేరారోపణలు, అవినీతి, మోసం, మనీ లాండరింగ్ వంటి అంశాలతో పాటు మణిపూర్ అల్లర్లు, విధ్వంసాలపై మోదీ సర్కార్ వైఖరిని వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చింది ఏఐసీసీ. దేశవ్యాప్తంగా ఏఐసీసీ పిలుపు మేరకు పీసీసీ చలో రాజ్‌భవన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.

Also Read: Today Gold Rates: బంగారు ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు

ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నేతృత్వంలో నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం నుంచి రాజ్‌భవన్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ ర్యాలీని విజయవంతం చేయడంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆయన రోడ్డుపై బైఠాయించి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మోడీ, అదానీ జోడీ.. దేశ ప్రజలారా ఇకనైన కళ్లు తెరవండి అని ఉన్న ప్లకార్డును సీఎం రేవంత్ రెడ్డి పట్టుకొని తన నిరసనను తెలిపారు.

Show comments