Toyota Fortuner: నాలుగేళ్ల తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు వచ్చారు. డిసెంబర్ 4న సాయంత్రం ఆయన ఢిల్లీలో ల్యాండ్ అవ్వడంతోనే భారత ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా రిసీవ్ చేసుకునేందుకు వెళ్లారు. పుతిన్‌కు భారత్ తరుపున అపూర్వ స్వాగతం పలికారు. పాలం ఎయిర్‌పోర్టు నుంచి ఇరువురు నేతలు కలిసి ఒకే కారులో ప్రధాని నివాసానికి వెళ్లారు. అయితే, మోడీ-పుతిన్ ఇద్దరూ తెల్లటి “టయోటా ఫార్చ్యూనర్” కారులో ప్రయాణించడం ఇప్పుడు అందర్ని ఆశ్చర్యపరుస్తోంది.
టయోటా ఫార్చ్యూనర్ కారును ఉపయోగించడం వెనక ఏదైనా చర్య ఉందా అని చాలా మంది అనుమానిస్తున్నారు. జపనీస్ బ్రాండ్ అయిన టయోటాను ఉపయోగించడం వెనక భారత వ్యూహం దాగి ఉన్నట్లు పలువురు భావిస్తున్నారు. పుతిన్, మోడీ ప్రయాణించిన కారు. ఫార్చ్యూనర్ సిగ్మా 4 (MT) మహారాష్ట్ర నంబర్ ప్లేట్‌ను కలిగి ఉంది. అయితే, ఆసక్తికరంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా రష్యా రక్షణ మంత్రి ఆండ్రీ బెలోసోవ్‌తో కలిసి జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచడానికి వెళ్ళినప్పుడు కూడా తెల్లటి ఫార్చ్యూనర్ కారును ఉపయోగించం విశేషం.
Read Also: CM Revanth Reddy: నర్సంపేటపై వరాల జల్లు.. రూ.532.24 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఫార్చ్యూనర్ వాడటం వెనక అనేక సిద్ధాంతాలు:
ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారత్, రష్యాలు యూరప్, అమెరికా నుంచి విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. వెస్ట్రన్ కంట్రీస్‌కు ఓ మెసేజ్ పంపించడానికి జపానీస్ కంపెనీ అయిన టయోటాను ఎంచుకున్నట్లు భావిస్తున్నారు. ఈ ఫార్చ్యూనర్లు కూడా భారత్‌లోనే తయారు అవుతున్నాయి.
ప్రస్తుతం, ప్రధాని మోడీ అధికార వాహనాల్లో రేంజ్ రోవల్, మెర్సిడెస్-మేబాచ్ S650 గార్డ్ ఉన్నాయి. అయినా కూడా మోడీ ప్రభుత్వం ఫార్చ్యూనర్కే ప్రాధాన్యత ఇచ్చింది. టాటా మోటార్స్ యాజమాన్యంలో రేంజ్ రోవర్ ఉన్నప్పటికీ, ఇది ఇప్పటికీ యూకేలోనే తయారు చేయబడుతోంది. మరోవైపు, మెర్సిడెస్ బెంజ్ జర్మనీకి చెందిన కంపెనీ. ఉక్రెయిన్ యుద్ధానికి మరికొన్ని రోజులు గడిస్తే నాలుగేళ్లు అవుతాయి. ఈ నేపథ్యంలో యూకే, జర్మనీలు ఆయుధాలు, ఆర్థిక సాయాన్ని ఉక్రెయిన్‌కు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫార్చ్యూనర్ వాడినట్లు తెలుస్తోంది.
పాలం విమానాశ్రయం నుంచి ప్రధాని మోడీ, పుతిన్ ఏదైనా యూరోపియన్ బ్రాండెడ్ కారులో ప్రయాణిస్తే అది ఓ రకంగా చెడుగా కనిపించే వీలుండేది. వీరిద్దరూ ఫార్చ్యూనర్‌లో వెళ్తుంటే ప్రధాని మోడీ రేంజ్ రోవర్, పుతిన్ ఆరస్ సెనాట్లు ఫార్చ్యూనర్ కారును ఫాలో అయ్యాయి. అయితే, ఫార్చ్యూనర్ కారు ముఖ్యంగా సీటింగ్ కాన్ఫిగరేషన్ కోసం ఉపయోగించినట్లు కొన్ని వర్గాలు చెబుతున్నాయి. ప్రధాని రేంజ్ రోవర్ కారులో మూడో వరసల లేదు. ఇది ఇద్దరు నేతలతో పాటు ఇంటర్ప్రెటర్లను ఉంచడానికి అనువుగా లేదు. పుతిన్, మోడీ మాటల్ని ట్రాన్స్‌లేట్ చేసే ఇంటర్ ప్రెటర్లు వీరిద్దరి కన్నా ముందే కారులో కూర్చున్నారని, రెండు దేశాల భద్రతా బృందాలు ఈ కారును ఎంపిక చేసినట్లు చెబుతున్నారు.