ఏపీ ప్రభుత్వానికి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ సంచలన లేఖ:
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. లిక్కర్ స్కామ్‌లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇరికించేందకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారని తిరుపతి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేస్తూ.. ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. లిక్కర్ స్కామ్ కేసులో తాము చెప్పినట్టు రాసి సంతకం చేయమని సిట్ అధికారులు తనపై ఒత్తిడి తెచ్చారని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, డీజీపీ హరీష్‌కుమార్ గుప్తాకి రాసిన లేఖలో మదన్ రెడ్డి పేర్కొన్నారు. ఇకపై ఒంటరిగా సిట్ విచారణకు హాజరుకాలేనని స్పష్టం చేశారు.
అనకాపల్లి ల్యాండ్ పూలింగ్ అక్రమాలపై దూకుడు పెంచిన సీఐడీ:
అనకాపల్లి ల్యాండ్ పూలింగ్ అక్రమాల కేసులో సీఐడీ దూకుడు పెంచింది. ఇంటి స్థలాల కోసం గత ప్రభుత్వ హయాంలో డి-ఫారం పట్టా, ఆక్రమిత భూములను సమీకరణపై వచ్చిన ఫిర్యాదులు ఆధారంగా రెవెన్యూ యంత్రాంగాన్ని ప్రశ్నించనుంది. ఇప్పటికే అనకాపల్లి తహసీల్దార్ కార్యాలయం నుంచి ముఖ్య డాక్యుమెంట్లు, రికార్డులను సీఐడీ స్వాధీనం చేసుకుంది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాద్ ఎమ్మెల్యేగా వున్న సమయంలో జరిగిన భూసమీకరణ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని మాజీ ఎమ్మెల్యే పీలాగోవింద్ ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఐడీ విచారణకు ఆదేశించింది. భూ సమీకరణలో కీలకమైన అప్పటి వీఆర్వోలు, తహసీల్దార్ల నుంచి సీఐడీ అధికారులు ఇప్పటికే వివరాలు సేకరించారు. కొనసాగింపుగా రెవెన్యూ సిబ్బందిని విచారించేందుకు ప్రభుత్వ అనుమతి కోరింది. అనకాపల్లి మండలంలోని 11 గ్రామాలలో 1,050 ఎకరాల భూమిని వైసీపీ ప్రభుత్వ హయాంలో సమీకరించారు. అయితే ల్యాండ్ పూలింగ్‌కు ముందే వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని, డీఫారం పట్టా భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసి ప్రభుత్వం నుంచి ఎక్కువ లబ్ధి పొందారనేది కంప్లయింట్ ఉంది.
కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం:
చిత్తూరు జిల్లా కుప్పం పురపాలిక పరిధిలోని నారాయణపురంలో మహిళపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. మహిళను చెట్టుకు కట్టేసి అమానుషంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చిత్తూరు జిల్లా ఎస్పీని ఆదేశించారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా పోలీసులు చూడాలని సూచించారు. బాధిత కుటుంబానికి అండగా ఉండాలని జిల్లా అధికారులకు సీఎం స్పష్టమైన ఆదేశం ఇచ్చారు. నిందితుడిని ఇప్పటికే అరెస్టు చేశామని సీఎం ఎస్పీ తెలిపారు. కుప్పం నియోజకవర్గంలో జరిగిన ఘటనపై జిల్లా ఎస్పీతో సీఎం చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు.
డిఫెన్స్ మద్యం పట్టివేత.. ఎక్స్ ఆర్మీ పర్సన్ అరెస్ట్:
హైదరాబాద్ లో డిఫెన్స్ మద్యం పట్టుబడింది. మల్కాజిగిరిలో 37 బాటిల్లు, మేడ్చల్ లో 24 బాటిల్ల మద్యం సీజ్ చేశారు అధికారులు. ఎక్స్ ఆర్మీ పర్సన్ ను అరెస్ట్ చేశారు. ఎక్స్ ఆర్మీకి చెందినటువంటి ఇద్దరూ వ్యక్తులు రెండు చోట్ల మద్యం అమ్మకాలు జరుపుతున్నారు అనే సమాచారం మేరకు మల్కాజిగిరి ఏఈఎస్ ముకుంద రెడ్డి బృందం రెండు చోట్ల దాడి చేసి 37 డిఫెన్స్ మద్యం బాటిల్లను సీజ్ చేశారు. పట్టుబడినటువంటి టిఫిన్స్ మద్యం బాటిళ్లు కర్ణాటక చెందినవిగా గుర్తించారు. డిఫెన్స్ క్యాంటీన్ లో నెలవారీగా వచ్చే కోటాను కొంతమంది వద్ద బాటిల్లను కొనుగోలు చేసి ఎక్స్ సర్వీస్ మెన్ పురుషోత్తం యాప్రాల్ లో, ముప్పరపు సిద్దయ్య ఆర్మీ పర్సనల్ కౌకూర్ లో అమ్మకాలు జరుపుతుండగా పట్టుకున్నట్లు ఏ ఎస్ బి ముకుంద రెడ్డి తెలిపారు. పట్టుకున్న మద్యం విలువ రూ. 75 వేలుగా ఉంటుందని అంచనా వేశారు. మద్యం బాటిల్స్ పట్టుకున్న వారిలో ఏఈఎస్ ముకుంద రెడ్డితో పాటు సీఐ భరత భూషణ్ డిటిఎఫ్ ఎక్సైజ్ ఎస్సై శ్రీనివాస్ రెడ్డిలు సిబ్బంది ఉన్నారు. మద్యం బాటిల్ పట్టుకున్నటువంటి సిబ్బందిని ఎక్సైజ్ సూపరిండెంట్ నవీన్ అభినందించారు.
ఉప్పల్ లో భారత్ పెట్రోల్ పంపు ఘరానా మోసం:
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల వాహన యజమానులకు ఆందోళన కలిగిస్తుంది. మరోవైపు పెట్రోల్ పంపులు మోసాలకు పాల్పడుతుండడంతో వాహనదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. మీటర్ ను రీ సెట్ చేయకపోవడం, ఎలక్ట్రానిక్ చిప్ లు పెట్టి మోసం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లోని ఉప్పల్ లో ఘరానా మోసం వెలుగుచూసింది. భారత్ పెట్రోల్ పంపులో మోసం జరుగుతున్నట్లు వాహనదారులు తెలిపారు. మెహిఫిల్ రెస్టారెంట్ ఎదురుగా ఉన్న భారత్ పెట్రోల్ పంపులో జరుగుతున్న మోసాన్ని బయటపెట్టారు. బాటిల్ లో పెట్రోల్ కొట్టించగా పెట్రోల్ పంపు దందా బయటపడింది. యాజమాన్యం మిషన్ లో సెట్టింగ్ పెట్టి పెట్రోల్ తక్కువ పోస్తున్నట్లు వెల్లడైంది. ఇందేటి అని కస్టమర్లు ప్రశ్నించగా పొంతన లేని సమాధానంతో యాజమాన్యం బుకాయిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 100 రూపాయల పెట్రోల్ ను బాటిల్ లో కొట్టించగా తక్కువ వచ్చింది. ఇదేంటి అని అడగగా 100 రూపాయలకు అంతే వస్తుందని నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నట్లు వాహనదారులు ఆరోపించారు. అధికారులు భారత్ పెట్రోల్ పంపుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వీడిన మోడల్ మర్డర్ మిస్టరీ.. చంపిందెవరంటే:
హర్యానాలో హత్యకు గురైన మోడల్ శీతల్ చౌదరి కేసు మిస్టరీ వీడింది. పోలీసులు మర్డర్ కేసును కొలిక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె ప్రియుడు సునీల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపారు. శీతల్‌ను చంపి.. మృతదేహంతో ఉన్న కారును కాలువలో పడేసి రోడ్డు ప్రమాదానికి చిత్రీకరించాలని నిందితుడు భావించాడని పోలీసులు తెలిపారు. శీతల్ చౌదరి.. హర్యానాలో మ్యూజిక్ ఇండస్ట్రీలో ఆల్బమ్స్‌తో పాపులారిటీ సంపాదించుకుంది. ఆమెకు వివాహమై ఐదు నెలల బిడ్డ ఉంది. అయితే గతంలో సునీల్‌కు చెందిన హోటల్‌లో శీతల్ పని చేసేది. వారిద్దరి మధ్య ఆరు సంవత్సరాలుగా స్నేహం ఉంది. సునీల్‌కి పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే భర్తను వదిలేసి తనను పెళ్లి చేసుకోవాలని శీతల్‌ను ఒత్తిడి తెస్తున్నాడు. అయితే సునీల్ వివాహితుడని పెళ్లి ప్రతిపాదనను ఆమె తిరస్కరించింది. దీన్ని సునీల్ మనసులో పెట్టుకున్నాడు.
రన్నింగ్ బైక్ పై లవర్స్ రొమాన్స్.. రూ.53,500 ఫైన్:
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ రకమైన సంఘటన అయినా క్షణాల్లో వైరల్ గా మారి ప్రపంచాన్ని చుట్టేస్తోంది. తాజాగా ఈ తరహా వీడియో ఒకటి నెట్టింటా హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఏ వీడియో ఏంటి స్టోరీ అనుకుంటున్నారా? తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై లవర్స్ బైక్ పై వెళ్తూ రొమాన్స్ లో మునిగి తేలారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ప్రయాణికుడు ఈ తతంగాన్నంత వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అది వైరల్ గా మారి నోయిడా ట్రాఫిక్ పోలీసుల వద్దకు చేరింది. ఇంకేముంది.. చట్టపరంగా పోలీసులు చేయాల్సిన పని చేశారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆ బైక్ నంబర్ ఆధారంగా రూ.53,500 ఫైన్ విధించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.
రాబర్ట్ వాద్రాకు మరోసారి ఈడీ సమన్లు:
వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాకు మరోసారి ఈడీ సమన్లు జారీ చేసింది. యూకేకు చెందిన ఆయుధాల వ్యాపారి సంజయ్ భండారీతో సంబంధం ఉన్న మనీలాండరింగ్ కేసులో ఈడీ సమన్లు జారీ చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ కింద వాంగ్మూలం నమోదు చేయడానికి బుధవారం ఈడీ ప్రధాన కార్యాలయానికి రావల్సిందిగా ఈడీ నోటీసులో పేర్కొంది. ఈనెల 10న విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే ఈ నెలాఖరులో విదేశీ పర్యటనకు ముందుగానీ.. తర్వాత గానీ హాజరవుతానని వాద్రా తెలిపారు. తన కుమార్తె గ్రాడ్యుయేషన్ వేడుకలో పాల్గొనడానికి విదేశాలకు వెళ్తున్నట్లు ఈడీకి తెలియజేశారు. ఇంకా ఎమర్జెన్సీగా హాజరు కావాలంటే వర్చువల్‌గా హాజరవుతారని న్యాయవాది సమాచారం అందించారు. మొత్తానికి ఆయా కారణాలు చెప్పి తప్పించుకున్నారు. తాజాగా మరోసారి అధికారులు నోటీసులు ఇచ్చారు. బుధవారం విచారణకు హాజరవుతారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.
ఇజ్రాయెల్ భీకర దాడులు.. ఖమేనీ అత్యంత సన్నిహితుడు మృతి:
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పరిస్థితులు మరింత ఉధృతంగా మారాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. తాజా దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి అత్యంత సన్నిహితుడు.. ఇరాన్ టాప్ కమాండర్ అలీ షాద్మానీ ప్రాణాలు వదిలారు. షాద్మానీ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ , ఇరానియన్ సాయుధ దళాలు రెండింటికీ నాయకత్వం వహించాడని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. మంగళవారం రాత్రి ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడిలో షాద్మానీ చనిపోయినట్లుగా ఐడీఎఫ్ తెలిపింది. ఇతడు ఖమేనీకి అత్యంత సన్నిహితుడిగా పేర్కొంది. ఇక షాద్మానీ మరణవార్తపై ఇంకా ఇరాన్ స్పందించలేదు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.
ఉక్రెయిన్‌పై రష్యా దాడి.. 14 మంది మృతి:
ఓ వైపు ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు జరుగుతుండగా.. ఇంకోవైపు రష్యా-ఉక్రెయిన్ మధ్య కూడా వార్ ఉధృతం అవుతోంది. తాజాగా కీవ్‌పై రష్యా క్షిపణి దాడులకు పాల్పడింది. బహుళ అంతస్థుపై డ్రోన్‌ను ప్రయోగించగా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. 40 మందికి పైగా తీవ్రగాయాలు పాలయ్యారు. కీవ్‌లో డజన్లకొద్దీ అపార్ట్‌మెంట్లు ధ్వంసమయ్యాయని ఉక్రెయిన్ సైనిక అధికారి తెలిపారు. భవనాల శిథిలాల కింద అనేకమంది ప్రజలు చిక్కుకున్నారని.. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఘటనా స్థలాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఈ దాడిలో అమెరికా పౌరుడు కూడా మరణించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. కెనడా జీ7 సదస్సులో పాల్గొన్నారు.
సూర్య ‘రెట్రో’ వెబ్ సిరీస్‌గా రానుందా:
సూర్య నటించిన తాజా చిత్రం ‘రెట్రో’ (Retro), దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించిన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామా. థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఎన్నో అంచనాలతో విడుదలైనప్పటి ఆశలని అడియాశలయ్యాయి. వింటేజ్ సూర్యని చూస్తాం అని అభిమానులు చాలా హోప్స్ పెట్టుకున్నప్పటికీ చివరికి నిరాశే మిగిలింది. అయితే ప్రజంట్ ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్నప్పటికి, తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ సినిమాను మరో ఫార్మాట్‌లో విడుదల చేసే ఆలోచనలో దర్శకుడు ఉన్నట్లు వెల్లడించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కార్తీక్ మాట్లాడుతూ.. ‘రెట్రో’ ఎక్స్టెండెడ్ వెర్షన్ కోసం ఓటీటీ ప్లాట్‌ఫారాలతో చర్చలు జరుగుతున్నాయి. నాలుగు నెలల తర్వాత దీన్ని వెబ్ సిరీస్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నా. ఇందులో కేవలం తొలగించిన సన్నివేశాలు మాత్రమే కాకుండా, బలమైన భావోద్వేగాలతో కూడిన అంశాలు కూడా ఉంటాయి. ప్రతి ఎపిసోడ్‌ను సుమారు 40 నిమిషాల నిడివితో ప్లాన్ చేస్తున్నాం. హాస్యం, ప్రేమ, యాక్షన్ ఇలా ఒక్కో ఎపిసోడ్‌లో ఒక్కో ఎలిమెంట్‌ను హైలైట్ చేయాలనుకుంటున్నా’ అని చెప్పారు. సినిమా మొత్తం 2 గంటల 48 నిమిషాల రన్‌టైమ్‌తో విడుదలై కొంతమంది ప్రేక్షకుల నుంచి నిడివిపై విమర్శలు ఎదుర్కొంది. అదే ఇప్పుడు ఈ ఎక్స్టెండెడ్ వెర్షన్ సిరీస్ రూపంలో వస్తే మరింత ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అవకాశం ఉందని ఇలా ప్లాన్ చేసి ఉంటారు.
‘రాజాసాబ్’ టీజర్.. రికార్డ్ మిలియన్ వ్యూస్:
రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ సినిమా రాజాసాబ్. మారుతీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రభాస్ కెరీస్ లో తొలిసారి హార్రర్ రొమాంటిక్ కామెడీ మూవీ చేస్తున్నాడు. అందులోను ప్రభాస్ రెండు విభిన్నమైన లుక్స్ లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే రివీల్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ గా రాజాసాబ్ టీజర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. ఎప్పటినుండో ఈ సినిమా టీజర్ కోసం ఎదురు చుసిన ఫ్యాన్స్ ఆకలి తీర్చాడు మారుతీ. వింటేజ్ ప్రభాస్ ను మరోసారి చూపించదు. నిన్న విడుదలైన ఈ సినిమా టీజర్ అద్భుతమైన స్పందనతో పాటు రికార్డ్ మిలియన్ వ్యూస్ రాబడుతోంది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన 24 గంటల్లో రాజా సాబ్ ట్రైలర్ 59 మిలియన్ వ్యూస్ రాబట్టి యు ట్యూబ్ ట్రెండింగ్ లో నంబర్ 1 లో దూసుకెళ్తుంది. రికారు మిలియన్ వ్యూస్ రాబట్టడంతో రెబల్ స్టార్ మరోసారి తన సత్తా ఏమిటో చూపించాడని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నఈ సినిమా ఈ ఏడాది డిసెంబరు 5న థియేటర్లలోకి సందడి చేయనుంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ లతో రెబల్ స్టార్ రొమాన్స్ చేయబోతున్నాడు. ఈ ముగ్గురు భామలతో కలిసి ప్రభాస్ చేయబోయే మాస్ సాంగ్ సినిమాకే హైలెట్ గా నిలవబోతుందట. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ పై పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.
జీవిని చూసి మ్యూజిక్ డైరెక్టర్లు నేర్చుకోవాలి:
సౌత్ స్టార్ హీరోలకు ఫస్ట్ ఛాయిస్‌గా మారాడు అనిరుధ్. కోలీవుడ్, టాలీవుడ్‌లో అతడికి పీక్స్ డిమాండ్ ఉంది. ఒకప్పుడు దేవీ శ్రీ ప్రసాద్ ఆ ప్లేసులో ఉండేవాడు. కానీ కొన్ని రోజులుగా ఆన్ టైంకి మ్యూజిక్ ఇవ్వట్లేదన్న కాంట్రవర్సీలను ఎదుర్కొంటున్నాడు. పుష్ప టూ రీసెంట్లీ కుబేర వరకు కూడా చివరి నిమిషం వరకు సాంగ్స్ ఇవ్వకుండా ఫిల్మ్ మేకర్లను ఇబ్బందికి గురి చేస్తున్నాడన్న గుసగుసలు గట్టిగానే వినిపిస్తున్నాయి. తమన్‌కున్న కమిట్మెంట్స్ వేరే లెవల్ బాలయ్య టూ పవన్ కళ్యాణ్ వయా ప్రభాస్ చిత్రాలు అతడి ఖాతాలో ఉన్నాయి. దీంతో నెక్ట్స్ ఛాయిస్‌గా జీవీవైపు చూస్తోంది ఫిల్మీ వుడ్. చెప్పాలంటే దేవీనే జీవీ వైపు ఫిల్మ్ మేకర్లు చూసేలా చేస్తున్నాడని టాక్.