రెండు సార్లు గెలిచా.. కానీ 2 తరాలకు అవసరమైన అభివృద్ధి చేసా
కామారెడ్డి జిల్లా రామా రెడ్డి మండలం అన్నారం లో మాజీ మంత్రి షబ్బీర్ అలీ పర్యటించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ సమక్షంలో భారీగా కాంగ్రెస్ లో చేరారు గ్రామస్థులు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. తాను 2 సార్లు గెలిచా.. కానీ 2 తరాలకు అవసరమైమ అభివృద్ధి చేసానన్నారు. షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశానని ఆయన వ్యాఖ్యానించారు. 15 ఏళ్ళల్లో కామారెడ్డి అభివృద్ధి వెనుకబడిందని, పార్టీలు జంప్ లు చేసే నాయకులు దున్నపోతులుగా ఆయన అభివర్ణించారు. మిగులు రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని, బీఆర్ఎస్ నేతలు గుడిలను కూడా మింగేస్తున్నారని ఆయన ఆరోపించారు.
భారత్లో ఆ కఠినమైన విధానం ఉంది
అవినీతికి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి జీ-20 దేశాల సమిష్టి కృషి తోడ్పడుతుందనీ ప్రధాని మోడీ తెలిపారు. అంతేకాకుండా.. అవినీతికి వ్యతిరేకంగా జీరో టాలరెన్స్ అనే కఠినమైన విధానం ఇండియాలో ఉందని జీ-20 సమావేశంలో ప్రధాని తెలిపారు. వర్చువల్ ప్రసంగంలో ప్రధాని మాట్లాడుతూ.. అవినీతి నిర్మూలన, పారదర్శక పాలనను పెంపొందించడంలో భారత్ కు బలమైన నిబద్ధత ఉందని పునరుద్ఘాటించారు. పారదర్శకమైన-జవాబుదారీ పర్యావరణ వ్యవస్థను సృష్టించడానికి భారతదేశం సాంకేతికత-ఇ-గవర్నెన్స్ ను ఉపయోగించుకుంటోందని తెలిపారు. అంతేకాకుండా.. ప్రధాని ప్రారంభోపన్యాసంలో కవి, నోబెల్ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రేరణాత్మక సందేశాన్ని ప్రస్తావించారు. అవినీతి వల్ల సమాజంలోని అట్టడుగు వర్గాలపై దాని అసమాన ప్రభావాన్ని ఎత్తిచూపారు. వనరుల కేటాయింపు, మార్కెట్ సమతౌల్యం, కీలకమైన ప్రజాసేవల క్షీణతపై దృష్టి సారించినట్టు ప్రధాని మోడీ తెలిపారు.
తిరుమల నడక మార్గంలో హై అలర్ట్ జోన్..
తిరుమలలో అలిపిరి నడక మార్గంలో చిరుత దాడిలో మృతి చెందిన బాలిక ఘటనపై తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తమైంది. ఈ క్రమంలో తిరుమల నడక మార్గంలో హై అలర్ట్ జోన్‌ను ప్రకటించింది. భక్తులకు భద్రతా సిబ్బంది పర్యవేక్షణను టీటీడీ తప్పనిసరి చేసింది. అయితే, తిరమలకు వచ్చే భక్తుల భద్రతపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. నడక మార్గంలో 7వ మైలు నుంచి నరసింహస్వామి ఆలయం వరకు హై అలర్ట్ జోన్ గా ప్రకటించింది. అక్కడ 100 మంది భక్తుల గుంపుని మాత్రమే అనుమాతించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు.
పాక్ తాత్కాలిక ప్రధానిగా అన్వర్ ఉల్ హక్ కాకర్
పాకిస్థాన్ తాత్కాలిక ప్రధాన మంత్రిగా సెనేటర్ అన్వరుల్ హక్ కాకర్ ఎంపికయ్యారు. ఈ మేరకు మాజీ ప్రధాని షెహబాజ్ షరీప్, నేషనల్ అసెంబ్లీలో విపక్ష నేత రాజా రియాజ్‌లు నిర్ణయం తీసుకున్నారు. తాత్కాలిక ప్రధానమంత్రిగా నియమించడానికి శనివారం అంగీకరించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. కాకర్ కొత్త ప్రభుత్వం ఎన్నుకోబడే వరకు ఆర్థిక మరియు రాజకీయ సంక్షోభాల నుండి అణ్వాయుధ దేశాన్ని నడిపించడానికి మంత్రివర్గాన్ని మరియు ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తాడు. నూతన ప్రధాని అన్వర్ ఉల్ హక్.. బలూచిస్థాన్ నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కి భారీగా పెరిగిన రద్దీ
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి భారీగా రద్దీ పెరిగింది. నిత్యం సుమారు 5 వేల మంది స్టూడెంట్స్ విదేశాలకు వెళ్తున్నారు.. స్టూడెంట్స్ కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి పేరెంట్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. విదేశాలలో ఉన్నత చదువుల కోసం వెళ్లే స్టూడెంట్స్ ఈ నెల లోనే ఎక్కువగా వెళ్తుండటం తో రద్దీ పెరిగింది. అయితే.. ఈ సందర్భంగా NTV తో శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. సెండాఫ్ ఇవ్వడానికి ఒక్కో స్టూడెంట్ వెనక 40 నుంచి 50 మంది వస్తున్నారన్నారు.
టీమిండియా కోచ్ రేసులో మరో కొత్త పేరు
టీమిండియా హెడ్ కోచ్ గా రవిశాస్త్రి తప్పుకున్నాక భారత జట్టు పరిస్థితి.. మ్యూజికల్ ఛైయిర్స్‌లా తయారైంది. ఒక్కో సిరీస్‌కి ఒక్కో ప్లేయర్ కెప్టెన్‌గా ఎంపిక అవుతున్నాడు. నవంబర్ 2021 నుంచి ఇప్పటి దాకా టీమ్‌కి 9 మంది కెప్టెన్లు మారారు. త్వరలో హెడ్ కోచ్‌ల సంఖ్య కూడా పెరునుంది. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ రెస్ట్ తీసుకునే సమయంలో తాత్కాలిక హెడ్ కోచ్‌గా ఎన్‌సీఏ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరిస్తున్నాడు. అయితే ఐర్లాండ్ పర్యటనలో జరిగే మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్‌కి సితాంశు కోటక్, హెడ్ కోచ్‌గా వ్యవహరించబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది.
మణిపూర్ మండిపోతుంటే పార్లమెంటులో సమస్య పరిష్కారంపై మాట్లాడారా..?
హైదరాబాద్‌లోని బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరమ్ ఆవిర్భావ సదస్సులో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మణిపూర్ అంశంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఓ పక్క మణిపూర్ వందరోజులుగా మండిపోతుంటే పార్లమెంట్ లో ఎంపీలు ఏం మాట్లాడరని విమర్శించారు. నువ్వా.. నేనా అన్నట్లు రాజకీయం చేశారే తప్ప సమస్య పరిష్కారం గురించి ఒక్కరైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. జోకర్‌ను నాయకుడిని చేస్తే మనం చూసేది ఇలాంటి సర్కస్ మాత్రమే అని ప్రకాష్ రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మౌనంగా ఉంటే శరీరానికి తగిలిన గాయాలు మానిపోతాయి కానీ.. దేశానికి తగిలిన గాయాలు రాచపుండులా మారుతాయన్నారు. ప్రస్తుతం మనం, మన దేశం అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నామని ప్రకాష్ రాజ్ తెలిపారు.
డబుల్ బెడ్ రూం ఇళ్ళపై ఉద్యమం చేపడతాం
తెలంగాణలో 30 శాతం వాటాల ప్రభుత్వం నడుస్తోందని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. శనివారం ఇందిరా పార్క్ ధర్నాలో కిషన్ రెడ్డి ముగింపు స్పీచ్‌లో మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం పోరాటం ఉధృతం చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఇక్కడున్న ప్రభుత్వం నిజాం ఆలోచనలతో నడిచే ప్రభుత్వం.. రాజాకార్ల వారసత్వంతో స్నేహం చేసే ప్రభుత్వమన్నారు. రాజాకార్ల అడుగు జాడల్లో నడిచే పార్టీలతో చేతులు కలిపి ముందుకు వెళ్లే ప్రభుత్వం. కాబట్టి అలాంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఆయన వ్యాఖ్యానించారు. ఫామ్ హౌస్ లో, ప్రగతి భవన్ లో నిద్ర పోతున్నది కేసీఆర్ ప్రభుత్వమని, వరదలు వచ్చినా కేసీఆర్ బయటకు రాడు అంటూ ఆయన విమర్శలు గుప్పించారు.
నేను చీఫ్ జస్టిస్‌ను కలిసి వాయిదా వేయమని అడిగా.. త్వరలో అభ్యర్థులు శుభవార్త వింటారు…
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు రెండు నెలలు వాయిదా వేయండి కొత్త సబ్జెక్ట్ ఇప్పుడే వచ్చింది అని కేసీఆర్, కేటీఆర్‌ను అడిగితే వాయిదా వేయలేదని, నేను చీఫ్ జస్టిస్‌ను కలిసి వాయిదా వేయమని అడిగా.. త్వరలో అభ్యర్థులు శుభవార్త వింటారన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్. ఇవాళ కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ.. వాయిదా వేయించే బాధ్యత నాది అని, ఎవరూ కూడా సూసైడ్ చేసుకోకండి అని ఆయన అన్నారు. నేను, నా కోడలు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆంధ్రలో వాయిదా వేయించామని, ఈ ముఖ్యమంత్రులకు బుద్ధి ఉండొద్దా…. కేసీఆర్ కు మతిమరుపు వస్తే కొడుకు చెప్పకూడదా అని ఆయన అన్నారు.
విశాఖపై కేంద్ర ప్రభుత్వం నజర్ పెట్టింది..
జగన్ కోసం, వైసీపీ కోసం ప్రజాస్వామ్యం లేదు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ ఎంపీ కుటుంబాన్ని రౌడీషీటర్లు కిడ్నాప్ చేయడానికి సిరిపురంలో ఉన్న భూముల వ్యవహారమే కారణం అని ఆయన ఆరోపించారు. వైజాగ్ ఎంపీకి సిగ్గు లేదు.. ఓట్లేసిన ప్రజలు గెలిపిస్తే వ్యాపారం చేయలేక పారిపోతాను అంటున్నాడు. ఎంపీ రాజీనామా చేయాలి.. మళ్లీ ఎన్నికలు పెట్టుకుంటాం అని పవన్ అన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ కోర్టులు చుట్టూ తిరగాలిసిందేనని జనసేనాని విమర్శించారు.
చర్చి ఆస్తులు దొబ్బేసి వాస్తు దోషం అంటూ ప్రజలు తిరిగే రోడ్లు మూసేస్తారా? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అధికారులు సిగ్గుపడాలి.. అయిన, సీఎం పేషీల్లోనే ఫైళ్లు మరిపోతుంటే.. జీవీఎంసీలో పైరవీలు జరగడం పెద్ద విషయం కాదు.. 18 వేల పైచిలుకు గజాల భూమిని వైసీపీ నేతలు దోపిడీ చేశారు.. అందుకోసం తప్పుడు జీవోలు సృష్టించారు.. దేవుడి భూములనే వైసీపీ నేతలు కబ్జా పెట్టేశారు అని పవన్ అన్నారు. భూముల దోపిడీ కొనసాగితే ఉత్తరాంధ్ర డంపింగ్ యార్డ్ అవుతుంది అని జనసేన అధినేత ఆరోపించారు.
రేప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్
శనివారం, కర్ణాటక పోలీసులు ఒక మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలతో ప్రముఖ కన్నడ సినీ నిర్మాతను అరెస్టు చేశారు. బాధితురాలిని ప్రముఖ కన్నడ సినీ నిర్మాత రూ.15 లక్షలు ఇవ్వాలని బెదిరించాలని, ఆమె ఇవ్వకపోతే ప్రైవేట్ వీడియోలు బయటపెడతానని హెచ్చరించారని అధికారులు వెల్లడించారు. రేప్ చేసి ప్రాణం తీస్తానంటూ బెదిరించారని చెబుతూ ఓ మహిళ చేసిన ఫిర్యాదు మేరకు నటుడు వీరేంద్రబాబును బెంగళూరులోని కొడిగేహళ్లి పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. వీరేంద్ర స్నేహితుల ప్రమేయం కూడా ఉందన్న అనుమానంతో వారిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. 2021లో మహిళను అపస్మారక స్థితిలోకి తీసుకెళ్లిన వీరేంద్ర ఆమెపై అత్యాచారం చేశాడని, ఆ మొత్తం వీడియో చిత్రీకరించి మహిళను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడని ఆరోపణలు వినిపించాయి.
బస్ డ్రైవర్ పై బైకర్ దాడి.. కర్ణాటకలో ఘటన
కర్నాటకలో ఓ బస్సు డ్రైవర్ పై బైకర్ దాడి చేశాడు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. తన బైక్ ను బస్సు ఢీకొట్టిందని ఆ వ్యక్తి తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు డ్రైవర్ పై ద్విచక్రదారుడు దాడికి పాల్పడ్డాడు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు బైకర్ ను అరెస్టు చేశారు. అయితే తన బైక్ ను బస్సు ఢీ కొట్టినందునే.. దాడికి పాల్పడ్డట్టు తెలిపాడు. అయితే బైకర్ బలవంతంగా బస్సులోకి ప్రవేశించి డ్రైవర్‌పై దాడి చేస్తున్న వీడియోను ఓ వ్యక్తి తన ఫోన్ లో వీడియో తీశాడు. దాడికి పాల్పడిన వ్యక్తి షారుఖ్ (30) గా గుర్తించారు. బస్సు డ్రైవర్ పై.. ఆ వ్యక్తి దుర్భాషలాడి బస్సు నుంచి బలవంతంగా బయటకు లాకే ప్రయత్నం చేశాడని పోలీసులు తెలిపారు.
ఈఫిల్ టవర్కు బాంబు బెదిరింపు.. అధికారులు అలర్ట్
ఫ్రాన్స్ లోని ప్రఖ్యాత ఈఫిల్ టవర్ ను పేల్చేందుకు బాంబు అమర్చామని దుండగులు ఫోన్ చేసి బెదిరించారు. దీంతో భద్రతా సిబ్బంది, అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యల్లో భాగంగా.. సందర్శకులందరినీ బయటికి పంపించారు. ఆ తర్వాత అక్కడ పోలీసులు, బాంబు స్క్వాడ్ ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. అంతేకాకుండా పరిసర ప్రాంతాల్లో కూడా తమ ఆధీనంలోకి తీసుకుని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. స్థానిక కాలమాన ప్రకారం శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు టవర్ నుంచి పర్యాటకులను క్లియర్ చేసినట్లుగా అంతర్జాతీయ వార్తా సంస్థలు తెలిపాయి. అయితే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ అద్భుత నిర్మాణాన్ని చూసేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు భారీగా వస్తుంటారు.
ఆల్ టైం రికార్డు బద్దలు కొట్టిన పుష్ప 2
పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో పుష్ప 2 మీద అనౌన్స్ చేయక ముందు నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ క్రమంలో ఈ పుష్ప 2 నుంచి ఎలాంటి అప్డేట్ వస్తున్నా ప్రేక్షకుల నుంచి స్పందన ఒక రేంజ్ లో వస్తోంది. ఇక ఈ క్రమంలోనే పుష్ప 2 ఫస్ట్ లుక్ తోనే సినిమాపై అంచనాలు పెంచేసి రికార్డులు క్రియేట్ చేశాడు అల్లు అర్జున్. బన్నీ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి వేర్ ఈజ్ పుష్ప అంటూ ఒక వీడియోను అలానే ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ రెండు అప్ డేట్లకు సూపర్ రెస్పాన్స్ రాగా సెకండ్ పార్ట్ ఫస్ట్ లుక్ లో గంగమ్మ జాతరలో ఉన్న వ్యక్తిగా కనిపించాడు బన్నీ. ఇక మొదటి భాగం కంటే పూర్తి భిన్నంగా ఈ పార్ట్ 2 ఉంటుందని అంటున్నారు. ముందు భాగంలో పుష్పలో కూలీ నుండి సిండికేట్ వరకు ఎదిగిన విధానం చూపించగా రెండో భాగంలో ఆయన స్మగ్లింగ్ చేసి సంపాదించిన డబ్బుతో పేదలకు ఓ దారి చూపించడం మాత్రమే కాదు పిల్లలకు విద్య, అవసరమైన వాళ్ళకు సహాయం చేయడం చూపించారు. ‘