NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

సీఎం రేవంత్ రెడ్డి మూలాలు ఆర్ఎస్ఎస్‌లో ఉన్నాయి

నిజామాబాద్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మూలాలు ఆర్ఎస్ఎస్ లో ఉన్నాయని, అందుకే మైనారిటీల పట్ల ముఖ్యమంత్రి వివక్ష చూపుతున్నట్లున్నారన్నారు. గాంధీల కుటుంబాన్ని చూసి మైనారిటీలు కాంగ్రెస్ కు ఓట్లు వేశారని, కానీ ఇప్పుడు మైనారిటీల నమ్మకాన్ని వమ్ము చేస్తున్న కాంగ్రెస్ అని ఆమె వ్యాఖ్యానించారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో ఒక్క మతకల్లోలం కూడా జరగలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అనేక మతకల్లోలాలు జరిగాయన్నారు ఎమ్మెల్సీ కవిత అన్నారు. మతకల్లోలాలను నిరోధించడానికి సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.? అని ఆమె ప్రశ్నించారు.

సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక సర్వే చాలా పకడ్బందీగా చేయాలి

కీలక సంక్షేమ పథకాలు జనవరి 26 నుండి అమలు కాబోతున్నాయని ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇంచార్జ్‌ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లబ్ధిదారుల ఎంపిక సర్వే చాలా పకడ్బందీగా చేయాలన్నారు. వ్యవసాయ యోగ్యం కానీ భూములకు ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వదని, అనర్హులకు ఏ ఒక్క సంక్షేమ పథకం చేరకూడాదన్నారు. వచ్చే వారం రోజులు ఉద్యోగులు చేసే సర్వే అధికారులకు, ప్రభుత్వానికి కీలకమని, గత ప్రభుత్వం అధికారుల ప్రమేయం లేకుండానే లబ్ధిదారుల ఎంపిక జరిగిందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు. గత ప్రభుత్వం తప్పుడు విధానంలో సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేసిందని, పేదలకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రణాళిక బద్దంగా ముందుకు తీసుకుపోతున్నామని, కన్ఫ్యూజన్ లేకుండా చాలా క్లారిటీగా ప్రభుత్వం జీవో లను విడుదల చేసిందన్నారు.

బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి అరెస్ట్..?

బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు దాడి జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఆందోళనకు వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి భువనగిరి వెళ్తుండగా, ఘట్కేసర్ వద్ద పోలీసులు జగదీష్ రెడ్డిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, జగదీష్ రెడ్డికి మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది.

ఇంటింటికీ గ్యాస్ పంపిణీ ప్రారంభించిన సీఎం చంద్రబాబు..

తిరుచానూరులో కొత్తగా ఏర్పాటు చేసిన ఇంటింటికి పైప్ లైన్ ద్వారా గ్యాస్ పంపిణీని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. శరవణ అనే ఇంటి యాజమాని ఇంటిలో ప్రారంభించారు. అంతేకాకుండా.. సీఎం చంద్రబాబు స్వయంగా టీ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం మొత్తం ఎనర్జీ, పెట్రోలియం రంగంలో అనూహ్యమైన మార్పులు వస్తున్నాయన్నారు. గతంలో గ్యాస్ ఉచితంగా అందించిన ఘనత టీడీపీదేనన్నారు. ఇప్పుడు దీపం-2 పథకం కింద మూడు సిలెండర్లను ఉచితంగా ఇస్తున్నామని చంద్రబాబు తెలిపారు. సురక్షితమైన గ్యాస్ నేరుగా పైన్ లైన్ ద్వారా ఇంటికి రావడాన్ని చూస్తున్నామని చెప్పారు. ఇది చాలా మంచి పరిణామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కర్నాటక, ఏపీ, తమిళనాడు, తెలంగాణలో 8 శాతం వాట AG&G సంస్థ కలిగి ఉందని అన్నారు. 80 లక్షల మందికి సురక్షితమైన గ్యాస్ అందిస్తున్నారని సీఎం వెల్లడించారు.

తీవ్ర విషాదం.. పిల్లలతో సహా తల్లి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం

చిత్తూరు జిల్లాలో పండగ వేళ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పిల్లలతో సహా తల్లి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. తల్లి కరిష్మా (27) పరిస్థితి విషమంగా ఉంది. ఆత్మహత్యకు పాల్పడిన వీరు.. సదుం మసీదు వీధిలో నివాసముంటున్నారు. అయితే.. ఈ ఘటనకు గల కారణం కుటుంబ కలహాలేనని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు.. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

పేదోడి కలలు నెరవేర్చాలని ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది

హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇంచార్జ్‌ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాలపై కలెక్టర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు కొండా సురేఖ, సీతక్క… వరంగల్, మహబూబాబాద్ ఎంపీ లు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ..కలెక్టర్లు…కార్పొరేషన్ చైర్మన్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఏడాది పాలన సమయంలో… ఎన్నికల సమయంలో… ఇచ్చిన మేరకు… అభివృద్ధి… సంక్షేమ పథకాలు రెండు కళ్లలాంటివన్నారు. పేదోడి కలలు నెరవేర్చాలని…ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని, 75వ గణతంత్ర వేడుకల సమయంలో… 26జనవరిన అమలు చేయబోతుందన్నారు మంత్రి పొంగులేటి. గత ప్రభుత్వం 10వేలు ఇస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా… 12వేలు ఇస్తామని ఆయన వెల్లడించారు. పంటలకు బోనస్… వ్యవసాయానికి యోగ్యమైన భూములకు రైతు భరోసా.. ప్రభుత్వం కు కావాల్సిన అభివృద్ధి కోసం… రోడ్లు కోసం సేకరించిన భూముల.. కొండలు, గుట్టలు… పుట్టలకు రైతు బంధు ఇచ్చిందన్నారు.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ రిజర్వాయర్‌లో విద్యార్థుల అంతిమయాత్రలో రాజ్యసభ సభ్యులు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె. లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ దుర్ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ముషీరాబాద్‌లోని బోలక్ పూర్ డివిజన్ ఇందిరానగర్‌కు చెందిన అన్నదమ్ములు గ్యార ధనుశ్‌, గ్యార లోహిత్‌ ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం హృదయాన్ని కలిచివేసిందని ఆయన అన్నారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈరోజు ధనుశ్, లోహిత్ అంతిమయాత్రలో డాక్టర్ కె. లక్ష్మణ్ పాల్గొని, ఈ కష్టసమయంలో బాధిత కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేశారు. పుత్రశోఖంలో ఉన్న తల్లిదండ్రులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయం అందించాలని డాక్టర్ కె. లక్ష్మణ్ విజ్ఞప్తి చేశారు.

కూటమి ఆరు నెలల పాలనలో అభివృద్ధిపై డిప్యూటీ సీఎం ట్వీట్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఇప్పటికే రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం, పారిశ్రామిక వాడలు సహా అనేక ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులుగా వస్తున్నాయని.. ఇటీవల విశాఖపట్నం వేదికగా రూ.2.08 లక్షల కోట్ల పనులకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారని ట్వీట్ చేశారు పవన్..

కూటమి ఆరు నెలల పాలనపై పవన్ కల్యాణ్ స్పందించారు. హనీమూన్ పీరియడ్ ముగిసిందని ఇప్పటికే పవన్ ప్రకటించారు. తాజాగా ఈ ఆరు నెలల కాలంలో జరిగిన కార్యక్రమాలకు సంబంధించి పవన్ కీలక అంశాలు ట్వీట్ చేసారు. అమరావతి నిర్మాణానికి సంబంధించిన వివిధ పనులకు సైతం చంద్రబాబు సర్కార్ టెండర్లు ఆహ్వానించిందన్నారు. ఇక పోలవరం ప్రాజెక్టు పనులు సైతం ఊపందుకున్నాయి. కాగా, గత ఐదేళ్లపాటు వైసీపీ హయాంలో ఏపీ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండిపోయిందన్న సంగతి అందరికీ తెలిసిందే అన్నారు పవన్.

నాలుగు సంవత్సరాల తర్వాత రైతులకు నిజమైన సంక్రాంతి వచ్చింది..

గుంటూరు జిల్లా తెనాలి మండలం పెద‌రావూరులో సంక్రాంతి సంబరాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. వ్యవ‌సాయ క్షేత్రంలో భోగిమంటలను వెలిగించారు. అనంతరం.. భోగి వేడుక‌ల్లో పాల్గొన్నారు. మహిళలు, నాయకులు, కార్యకర్తలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగు సంవత్సరాల తర్వాత రైతులకు నిజమైన సంక్రాంతి వచ్చిందని అన్నారు. సంక్రాంతి పండుగ ప్రజ‌లంద‌రి జీవితాల్లో వెలుగులు నింపాల‌ని.. సంక్రాంతి అంటేనే మ‌న తెలుగింటి పండుగ అని.. ప్రతి ప‌ల్లెలో మ‌న సంస్కృతి ప్రతి బింబించే విధంగా పండుగ‌ను ఘ‌నంగా జ‌రుపుకుంటామ‌ని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

Show comments