బంగారం ప్రియులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?
బులియన్ మార్కెట్లో గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం పెరిగిన పసిడి ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్లో సోమవారం (జులై 31) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,350 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 60,380గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై.. 24 క్యారెట్ల బంగారం ధరపై ఎలాంటి మార్పు లేదు. ఈ పసిడి ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం నమోదైనవి. దేశంలోని పలు రాష్ట్రాల్లో తులం బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,500 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,530గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,650లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,710 వద్ద కొనసాగుతోంది. ముంబై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,350 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.60,380గా కొనసాగుతోంది.
పాపం టిక్‌టాకర్.. అతిగా నీళ్లు తాగింది, ఆసుపత్రిపాలైంది
నీళ్లు బాగా తాగితే ఆరోగ్యంగా ఉంటామని ఆరోగ్య నిపుణులు అంటుంటారు. అలాగని అతిగా తాగితే మాత్రం.. తీవ్ర పరిణామాలు తప్పవు. అందుకు ప్రత్యక్ష సాక్ష్యమే ఈ తాజా ఉదంతం. ఓ ఫిట్నెస్ ఛాలెంజ్‌లో భాగంగా.. 12 రోజుల పాటు నాలుగు లీటర్ల నీళ్లు తాగిన పాపానికి, కెనడాకు చెందిన ఓ టిక్‌టాకర్ ఆసుపత్రిపాలైంది. అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఈ ఛాలెంజ్ పేరు 75 హార్ట్. ఇందులో పాల్గొనేవారు 75 రోజుల పాటు నాలుగు లీటర్ల నీరు తాగాలి. ఆల్కహాల్ లేదా ‘చీట్ మీల్స్’ లేని స్ట్రక్చర్డ్ డైట్‌ని అనుసరించాలి. రోజుకు 45 నిమిషాల పాటు రెండుసార్లు వర్కవుట్ చేయాలి. రోజుకి 10 పేజీల చదవాలి. ఈ మొత్తం ప్రాసెస్‌కి సంబంధించి ఫోటో తీయాలి. ఈ ఛాలెంజ్‌ని మొదట ఆండీ ఫ్రిసెల్లా అనే యూట్యూబర్ ప్రారంభించారు. ఫిట్నెస్కి సంబంధించింది కాబట్టి.. చాలామంది ఈ ఛాలెంజ్‌లో పాల్గొనడం ప్రారంభించారు. వారిలో కెనడాకి చెందిన మిచెల్ ఫెయిర్‌బర్న్ అనే టిక్‌టాకర్ ఒకరు. ఈమె 12 రోజుల పాటు నాలుగు లీటర్ల నీళ్లు తాగడంతో.. అనారోగ్య బారిన పడింది. దీంతో.. ఆసుపత్రిపాలయ్యింది.
ప్రపంచ రికార్డు నెలకొల్పిన డేవిడ్ వార్నర్!
ఆస్ట్రేలియా సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టెస్ట్‌ల్లో అత్యధిక సార్లు 100 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాలు నెలకొల్పిన ఆటగాడిగా నిలిచాడు. వార్నర్ ఇప్పటివరకు 25 సార్లు 100 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాలు నెలకొల్పాడు. యాషెస్ 2023లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో దేవ్ ఈ రికార్డు సాధించాడు. నాలుగో రోజు ఆటలో మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాతో కలిసి తొలి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. వార్నర్, ఖవాజా ఇప్పటికే 135 పరుగులు చేశారు.
జాక్ హబ్స్, గ్రేమ్ స్మిత్, అలిస్టర్ కుక్ల పేరిట సంయుక్తంగా ఉన్న రికార్డును డేవిడ్ వార్నర్ అధిగమించాడు. ఈ ముగ్గురు 24 సార్లు టెస్ట్‌ల్లో అత్యధిక సార్లు 100 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాలు నెలకొల్పారు. ఈ జాబితాలో మైఖేల్ ఆథర్టన్, వీరేంద్ర సెహ్వాగ్ (23) సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. ప్రస్తుత ఆటగాళ్లలో వార్నర్ రికార్డుకు దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు.
రైతుబీమా తరహాలోనే కార్మిక బీమా.. లక్ష నుంచి 3 లక్షలకు పెంపు
కార్మికులకు సంబంధించి మంత్రి హరీశ్ రావు కీలక ప్రకటన చేశారు. రైతు భీమా తరహా కార్మిక భీమా పథకాన్ని అమలు చేస్తామని హరీష్ రావు ప్రకటించారు. ఇప్పటికే అమలవుతున్న పథకంలో సాధారణ మరణాలనికి ఇచ్చే భీమా మొత్తాన్ని మూడు లక్షలన్నర లక్షలకు పెంచుతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా వర్కర్ కార్డు రెన్యూవల్ ను పదేళ్లకు పెంచుతామని పేర్కొన్నారు. ప్రతి కార్మికుడు డిజిటల్ కార్డు ఖరీదు బాధ్యత తనదేనన్నారు. 5 లక్షల వరకు ఆరోగ్యశ్రీ వైద్య సేవలను ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. సిద్దిపేటలో జరిగిన భవన నిర్మాణ కార్మికుల బహిరంగ సభలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు ఈ మేరకు ప్రకటన చేశారు. సిద్దపేట పట్టణంలో కర్మక్ భవన్ కోసం హరీష్ రావు ఎకరం భూమిని కేటాయించారు.
అమెరికాలో మరోసారి పేలిక తుపాకీ.. ఇద్దరు మృతి
పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు.. ప్రపంచానికే పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికాను గన్ కల్చర్ వణికిస్తోంది. ఈ విష సంస్కృతి ఆ అగ్రరాజ్యాన్ని లోలోపలే పీక్కు తింటోంది. వరుసగా అక్కడ కాల్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గత ఘటనకు సంబంధించిన నెత్తుటి మరఖలు ఆరకముందే, తుపాకీలు పేలుతున్నాయి. ఇప్పుడు తాజాగా మరోసారి అమెరికాలో తుపాకీ తూటా పేలింది. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా.. ఒకరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన గైనస్విల్లేలోని ఫ్లోరిడా యూనివర్సిటీలో జరిగింది.
ఆదివారం తెల్లవారుజామున 2:40 గంటల సమయంలో.. వెస్ట్ యూనివర్శిటీ అవెన్యూలోని చెకర్స్ & బాడీటెక్ సమీపంలో ఉన్న గైనెస్విల్లే పోలీసులు తుపాకీ కాల్పుల శబ్దం విన్నారు. దీంతో.. వీళ్లు హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లారు. జాజియర్ మైయర్స్ అనే నిందితుడు ఈ కాల్పుల జరిపాడని గుర్తించారు. ముగ్గురు వ్యక్తులపై అతడు కాల్పులు జరపగా.. ఇద్దరు స్పాట్లోనే మరిణించారు. మూడో వ్యక్తి పారిపోయేందుకు ప్రయత్నించగా.. అతనిపై కూడా మైయర్స్ కాల్పులు జరిపాడు. దీంతో అతనికి గాయాలయ్యాయి. సంఘటనా స్థలంలో మైయర్స్ అనుమానంగా కనిపించడంతో.. అతడ్ని ప్రశ్నించారు. మొదట్లో తనకు ఈ సంఘటనతో సంబంధం లేదన్నట్టుగా మైయర్స్ వ్యవహరించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. అతడే ఈ కాల్పులు చేశాడని నిర్ధారించుకొని, అతడ్ని అరెస్ట్ చేశారు.
కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం.. వివిధ అంశాలపై చర్చ
రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు నిర్ణయించింన సంగతి తెలిసిందే. దాదాపు 40 నుంచి 50 అంశాలపై మంత్రివర్గం సమగ్రంగా చర్చించనుంది. ముఖ్యంగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు, తదనంతర పరిణామాలపై సమీక్షించనున్నారు. సాగు పనులు, భారీ వర్షాల వల్ల ఏర్పడిన పరిస్థితులపైనా చర్చించనున్నారు. ప్రత్యామ్నాయ సాగు పద్ధతులపై చర్చించే అవకాశం ఉంది. వాగులు మరియు వంకల వరదల కారణంగా రోడ్లు మరియు రవాణా మార్గాలకు నష్టం అంచనా వేయబడుతుంది.
యుద్ధప్రాతిపదికన రహదారులను పునరుద్ధరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. పాతబస్తీలో త్వరలో మెట్రో రైలు పనులు పూర్తి చేస్తామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు క్యాబినెట్లో మెట్రో రైలు పొడిగింపుపై చర్చించే అవకాశం ఉంది. ఆర్టీసీ ఉద్యోగుల జీతాల పెంపు తదితర అంశాలపై చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. గృహలక్ష్మి పథకం అమలుతో పాటు బీసీ, మైనారిటీ బందుల అమలుపైనా చర్చ జరగనుంది. మరి కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. ఆగస్టు 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన పలు బిల్లులపై కూడా కేబినెట్ చర్చించనుంది.
నేడు విజయవాడకు పవన్ కల్యాణ్
నేడు విజయవాడకు పవన్ కల్యాణ్ రానున్నారు. ఈ సందర్భంగా.. పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు పవన్. మూడో విడత వారాహి యాత్ర రూట్ మ్యాప్, తేదీ ఖరారుపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. మూడో విడత యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో చేపట్టాలా..? లేదా ఉత్తరాంధ్రలో చేపట్టాలా..? అనే అంశంపై పవన్ చర్చించనున్నారు. మూడో తేదీ లేదా ఐదో తేదీన మూడో విడత వారాహి యాత్రపై చేపట్టే అవకాశం ఉంది. అయితే.. ఇదిలా ఉంటే.. ఉమ్మడి గోదావరి జిల్లాలు టార్గెట్ గా పవన్ తన యాత్ర ప్రారంభించారు. గోదావరి జిల్లాలను వైసీపీ నుంచి విముక్తి కలిగించాలంటూ తన పర్యటన కొనసాగించారు.
తెలంగాణకు వాతావరణశాఖ హెచ్చరిక.. నేడు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం..
గత వారం వర్షాలు రాష్ట్ర ప్రజలను అతలాకుతలం చేశాయి. పగలు రాత్రి అని తేడా లేకుండా వానలు దంచికొట్టడంతో డ్యామ్ లు, చెరువులు, నదులు ఏరులై పారాయి. దీంతో ఇళ్లలోకి నీరు చేరడం, పలు గ్రామాలను నీట మునిగి పోయాయి. పొలాల్లో నీరు చేరడంతో భారీగా పంట నష్టం వాటిల్లింది. అయితే రెండు రోజులుగా వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. దీంతో ప్రజలు కాస్తంత ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇప్పుడు మళ్లీ వర్షాలు పడే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించడంతో రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిన్న సాయంత్రం కూడా పలుచోట్ల తేలికపాటి వర్షం కురిసింది. అయితే ఈరోజు, రేపు కూడా రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరంలో అల్పపీడనం ఏర్పడగా.. రాష్ట్రంలో పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. దీంతో పాటు నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రేపు ఆదిలాబాద్, మహబూబాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, ములుగు, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ ప్రకటించారు. 2 నుంచి 6వ తేదీ వరకు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేశారు. ఈరోజు హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, సాయంత్రం జల్లులు కురుస్తాయని వెల్లడించారు.
దయనీయ స్థితిలో మోరంచపల్లి వాసులు.. ఆపన్న హస్తం కోసం ఎదరుచూపు
మోరంచ వాగు ఉధృతికి మునిగిపోయిన మోరంచపల్లి ప్రజల పరిస్థితి దయనీయంగా ఉంది. గురువారం తెల్లవారుజామున వాగు నీరు ముంచెత్తడంతో ప్రాణాలు అరచేత పెట్టుకుని చెట్టుకొకరు.. పుట్టకొకరుగా పరుగులు పెట్టిన ప్రజలు వెనక్కి తిరిగి వచ్చి చూసుకునేసరికి ఇళ్లన్నీ వట్టిపోయాయి. ఊరిని ముంచిన వాగు శాంతించి వెనక్కి తగ్గినా.. వరద ఉధృతికి సరుకులన్నీ ఏటో కొట్టుకుపోయి ఇళ్లన్నీ నీళ్లు, బురదతో నిండి దయనీయ స్థితిలో ఉన్నారు. వరుద ఉధృతికి కొట్టుకొనిపోయిన తీరుతో నిత్యావసర సరుకులు, కూరగాయలు, బియ్యం ఏవీ లేవిప్పుడు. వరద నీటికి ఇళ్లన్నీ బురదమయం అయ్యాయి.. నిత్యావసరాలు. వాగులో కొట్టుకుపోనయి ఇంట్లో ఉన్న వస్తువులన్ని పాడైనయి వరద ఉధృతికి సర్వం కోల్పోయి నిరాశ్రయులైన మోరాంచపల్లి వాసులకు ప్రభుత్వం నుంచి తక్షణ సాయం అందలేదు. స్వచ్ఛంద సంస్థలే వారికి అండగా నిలుస్తున్నాయి.