ఇరాన్లో కిడ్నాపైన ముగ్గురు భారతీయులు క్షేమం.. రక్షించిన టెహ్రాన్ పోలీసులు
ఇరాన్లో తప్పిపోయిన ముగ్గురు భారతీయులు సురక్షితంగానే ఉన్నట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది. ముగ్గురు భారతీయులను టెహ్రాన్ పోలీసులు సురక్షితంగా రక్షించినట్లు చెప్పింది. దీంతో బాధిత కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నారు. పంజాబ్‌కు చెందిన హుషన్‌ప్రీత్ సింగ్ (సంగ్రూర్), జస్పాల్ సింగ్ (ఎస్బీఎస్ నగర్), అమృతపాల్ సింగ్ (హోషియార్పూర్) వాసులు మే 1న ఇరాన్ వెళ్లారు. హోషియార్పూర్ ఏజెంట్ సాయంతో ఇరాన్ వెళ్లారు. ఇరాన్‌లోకి అడుగుపెట్టగానే దుండగులు బంధించి వాళ్లను తాళ్లతో కట్టి.. కుటుంబ సభ్యులకు ఫొటోలు పంపించి రూ.కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. ఇక మే 11 నుంచి అయితే ఎలాంటి సమాచారం లేదు. దీంతో టెహ్రాన్‌లోని భారతీయ రాయబార కార్యాలయాన్ని కుటుంబ సభ్యులు సంప్రదించారు. ఇక ఎంబసీ అధికారులు.. ఇరాన్ ప్రభుత్వానికి సమాచారం అందించారు. భారతీయుల జాడ గుర్తించాలని కోరారు. ఇక ఇరాన్‌కు పంపించిన హోషియార్పూర్ ఏజెంట్ కూడా అదృశ్యమయ్యాడు. ఏదో అయిందని కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతం అయ్యారు.
‘కింగ్డమ్’ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్..!
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’. వరుస డిజాస్టర్ల తర్వాత విజయ్ నుంచి రాబోతున్న ఈ చిత్రం సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అందాల భామ భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్గా నటిస్తుండగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ చిత్రం మే 30నే రిలీజ్ కావాల్సి ఉండగా వివిధ కారణాలతో జులై 4కి వాయిదా పడింది. ఈ విషయాన్ని మేకర్స్ ఇటీవలే అఫిషీయల్‌గా ప్రకటించారు.. అయినప్పటికీ
మైదానంలోనే ఏడ్చేసిన విరాట్ కోహ్లీ.. వీడియో వైరల్!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఎట్టకేలకు ఐపీఎల్ విజేతగా నిలిచింది. తొలి ఎడిషన్ నుంచి కప్ కోసం నిరీక్షించిన ఆర్సీబీ.. 18 ఏళ్లకు ఛాంపియన్ అయింది. మంగళవారం అహ్మదాబాద్‌లో ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో పంజాబ్ కింగ్స్‌పై ఆర్సీబీ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బెంగళూరు 9 వికెట్లకు 190 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (43; 35 బంతుల్లో 3×4) టాప్ స్కోరర్. ఛేదనలో పంజాబ్ 7 వికెట్లకు 184 పరుగులే పరిమితమైంది. శశాంక్ సింగ్ (61 నాటౌట్; 30 బంతుల్లో 3×4, 6×6) పోరాటం వృధా అయింది.
నేడు మోడీ అధ్యక్షతన కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్
ప్రధాని మోడీ అధ్యక్షతన బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఆపరేషన్ సిందూర్ చేపట్టిన తర్వాత తొలిసారి మంత్రివర్గం సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశానికి కేబినెట్ మంత్రులతో పాటు సహాయమంత్రులు, స్వతంత్ర మంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఇదిలా ఉంటే ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి ఏర్పడి త్వరలో ఏడాది పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో కూడా కేబినెట్ ప్రాధాన్యత సంతరించుకుంది.
బంపర్ ఆఫర్ కొట్టేసిన.. ‘నా సామిరంగ’ బ్యూటీ..
స్టార్ హీరో రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాస్ జాతర’. భాను భోగవరపు అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సమ్మర్ కానుకగా విడుదల కానుందట. ఇక దీంతర్వాత రవితేజ డైరెక్టర్ కిషోర్ తిరుమలతో ఓ మూవీ కమిట్ అయ్యారు. అయితే ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించడంతో, ఇప్పుడు మన టాలీవుడ్ దర్శక రచయితలు అదే జోనర్ లో సినిమాలు చేయాలని ట్రై చేస్తున్నారట. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే కథలు రాసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో హీరో రవితేజకు కిషోర్ తిరుమల కూడా ఇలాంటి ఫ్యామిలి స్టోరినే వినిపించాడట..
ఈ విజయం కోసం నా జీవితాన్ని దారపోశా.. చివరి వరకు ఆర్సీబీకే ఆడుతాను!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) టైటిల్ విజయం కోసం తన జీవితాన్ని దారపోశా అని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ఈ రోజు వస్తుందని తాను అస్సలు అనుకోలేదని, చివరి బంతి వేసిన వెంటనే భావోద్వేగానికి గురయ్యానని చెప్పాడు. ఆర్సీబీకి తాను చేయగలిగిందంతా చేశానని, చివరకు ఐపీఎల్ టైటిల్ గెలవడం ఒక అద్భుతమైన అనుభూతి అని పేర్కొన్నాడు. ఈ విజయం జట్టుతో పాటు అభిమానులందరి అని విరాట్ స్పష్టం చేశాడు. మంగళవారం అహ్మదాబాద్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్లో ఆర్సీబీ 6 పరుగుల తేడాతో గెలుపొంది టైటిల్ కైవసం చేసుకుంది.
ట్రంప్ షాక్.. స్టీల్, అల్యూమినియంపై 50 శాతం సుంకాలు పెంపు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి షాకిచ్చారు. దేశాలతో చర్చలు జరుగుతుండగానే వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. స్టీల్, అల్యూమినియంపై సుంకాలను 50 శాతానికి పెంచుతూ ట్రంప్ సంతకం చేశారు. పెంచిన సంకాలు నేటి నుంచే అమల్లోకి రానున్నట్లు వైట్‌హౌస్ ప్రకటించింది. గతంలో సుంకాలను పెంచిన ట్రంప్.. ఆయా దేశాల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గారు. తాజాగా స్టీల్, అల్యూమినియంపై 25 శాతం నుంచి 50 శాతానికి సుంకాలను పెంచుతూ ట్రంప్ సంతకం చేశారు. దీంతో మరోసారి అమెరికా వాణిజ్య యుద్ధానికి తెర లేపింది. ఆయా దేశాలతో చర్చలు జరుగుతుండగానే ఊహించని విధంగా ట్రంప్ సుంకాలను పెంచేశారు.
ఐపీఎల్ కప్‌తో కోహ్లీ.. రచ్చ మాములుగా లేదుగా!
ఐపీఎల్ 2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అవతరించింది. మంగళవారం అహ్మదాబాద్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆర్సీబీ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫైనల్లో ముందుగా ఆర్సీబీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. అనంతరం పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసి రన్నరప్‌గా నిలిచింది. చివరి ఓవర్ నుంచే ఆర్సీబీ గెలుపు సంబరాలు మొదలయ్యాయి. ఆర్సీబీ, విరాట్ కోహ్లీ నామస్మరణతో నరేంద్ర మోడీ స్టేడియం మొత్తం దద్దరిల్లింది. ఆర్సీబీ అభిమానులతో స్టేడియం అత్తా రెడ్ హార్ట్ అయింది.
ట్రంప్ సర్కార్‌పై మస్క్ వ్యతిరేక గళం.. ట్యాక్స్ బిల్లుపై విమర్శలు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్-ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు తలెత్తినట్లుగా తెలుస్తోంది. తాజాగా ట్రంప్ సర్కార్‌పై మస్క్ నిరసన గళం విప్పారు. ఇటీవల ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన ట్యాక్స్ బిల్లుకు వ్యతిరేకంగా మస్క్ వ్యతిరేక గళం విప్పారు. ఇది చెడ్డ బిల్లు అని.. దీని కారణంగా అమెరికన్లపై అధిక భారం పడుతుందని విమర్శించారు. ట్రంప్ సర్కార్ తీసుకొచ్చిన బిల్లును మస్క్ వ్యతిరేకిస్తూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ‘‘నన్ను క్షమించండి. నేను ఇంతకంటే భరించలేను. ఇది అత్యంత దారుణమైనది. కాంగ్రెస్‌లో తీసుకొచ్చిన బిల్లు చాలా చెడ్డది. అది తప్పు అని మీకు తెలుసు. అయినా ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారంటే అది మీకే అవమానం’’ అని రాసుకొచ్చారు. అమెరికా ద్రవ్యలోటు 2.5 బిలియన్ డాలర్లకు చేరుతుందని.. ఇలాగే కొనసాగితే అమెరికా దివాళా తీయడం ఖాయమనే మస్క్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇలాంటి కథలో నటించడం నా అదృష్టం..
టాలీవుడ్లో అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రీతూ వర్మ. రీసెంట్ గా ‘మజాకా’ మూవీతో మంచి హిట్ అందుకున్న ఈ అమ్మడు ప్రజంట్ ‘దేవిక అండ్ దానీ’ అనే వెబ్ సిరీస్‌తో రాబోతుంది. ఇది ఆమె నటించిన తొలి వెబ్ సిరీస్. దర్శకుడు బి.కిశోర్ రూపొందించగా, సుధాకర్ చాగంటి నిర్మాతగా వ్యవహరించారు. సూర్య వశిష్ట, శివ కందుకూరి, సుబ్బరాజు తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ వెజిసిరీస్, ఈ నెల 6న ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్ స్టార్ లో విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా మీడియా సమావేశం అయ్యారు మూవీ టీం.. ఈ సందర్భంగా రీతూ వర్మ మాట్లాడుతూ.. ‘ఇలాంటి కాన్సెప్ట్‌తో సిరీస్ చేయాలని నేనెప్పటి నుంచో అనుకుంటున్నా. ఈ క్రమంలోనే ‘దేవిక అండ్ డానీ’ లాంటి నిజాయితీతో కూడిన కథ నా దగ్గరకు వచ్చింది. ఇందులో నటించడం నా అదృష్టంగా భావిస్తున్నా. దర్శకుడు కిశోర్ దీన్ని అద్భుతంగా తెరకెక్కించారు. సాధారణంగా ఊర్లో ఉండే అమ్మాయిల్ని.. ఈ పని చేయి, ఆ పని చేయకని ఆంక్షలు పెడుతుంటారు. అలాంటి వాళ్ళు బయటకు వెళ్తే ఎలా మారతారనే విషయాన్ని ఈ సిరీస్‌ల్లో చక్కగా చూపించారు. చాలా మంది అమ్మాయిలను చుట్టు పక్కల ఉండేవాళ్లు.. నువ్వు ఏం చేయలేవు. సాధించలేవు అని నిరుత్సాహ పరుస్తున్నారు. అలాంటి అమ్మాయిలకు ఈ ‘దేవిక అండ్ దానీ’ వెబ్‌సిరీస్ ఓ నమ్మకాన్ని ఇస్తుంది’ అని రీతూ తెలిపింది.