పురపాలక, పట్టణాభివృద్ధిపై సీఎం జగన్ సమీక్ష.. కీలక ఆదేశాలు
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సమీక్ష నిర్వహించారు సీఎం వైఎస్ జగన్.. విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, కర్నూలు, కడప, తిరుపతి, గుంటూరు సహా వివిధ కార్పొరేషన్లలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, చేపట్టనున్న ప్రాజెక్టులపై సమగ్రంగా చర్చించారు.. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. వర్షాకాలం ముగిసి, పనుల సీజన్ మళ్లీ మొదలైనందున నగరాలు, పట్టణాల్లో రోడ్లపై దృష్టిపెట్టాలని అధికారుల ఆదేశించారు. నగరాల్లో ఇప్పటికే కొనసాగుతున్న పనులను వీలైనంత త్వరగా పూర్తిచేయాలన్న సీఎం. ఒక డ్రైవ్ కింద తీసుకుని రోడ్లపై దృష్టి పెట్టాలన్నారు. నీటి సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలని సూచించారు. సముద్రతీరం వెంబడి వస్తున్న పరిశ్రమలు సముద్రపు నీటినే డీ శాలినేషన్ చేసి.. వినియోగించేలా చూడాలన్న ముఖ్యమంత్రి. దీనివల్ల చాలావరకు తాగునీటిని ఆదా చేయగలుగుతామన్నారు.
జేసీ ఫ్యామిలీపై కేతిరెడ్డి ఫైర్.. వారికి మతి లేదు పాపం..!
జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి ఫ్యామిలీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. పాపం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి ఆరోగ్యం బాగోలేదు.. మతి లేదు పాపం ఆయనకు అంటూ ఎద్దేవా చేశారు. ఇక, తాడిపత్రి మున్సిపాలిటీ అభివృద్ధికి అనునిత్యం అడ్డుపడుతుంది జేసీ దివాకర్ రెడ్డి తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డేనని ఆరోపించారు.. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు, కాలేజ్ కాంపౌండ్ కు.. ఇలా ప్రతి దానికి అడ్డం పడుతున్నారని మండిపడ్డారు. HLC కాలువకు నీళ్లు వస్తున్నా.. మళ్లీ పోయి ఎస్ఈని అడుగుతున్నారు. రోజుకు 250 క్యూసెక్కుల నీరు వెళ్తున్నాయి. నిన్న పెద్ద వడగూరు కూడా నీరు వెళ్తున్నాయని వెల్లడించారు. మరోవైపు.. నారా భువనేశ్వరి.. చంద్రబాబు చేసిన పాపాలకు ప్రాయచ్చితం కోసం యాత్రలు చేస్తున్నారని సెటైర్లు వేశారు ఎమ్మెల్యే కేతిరెడ్డి.. మేం కూడా నిజం గెలవాలి అని కొరుకుంటున్నామన్న ఆయన.. చంద్రబాబు జైలుకు వెళ్తాడు అని ముందే తెలుసు.. అందుకే చెక్కులపై ముందే సంతకాలు చేసి భువనేశ్వరి ద్వారా వాటిని పంచుతున్నారని విమర్శలు గుప్పించారు.. ఇక, జేసీ దివాకర్ రెడ్డి ఒక పనికిమాలిన వ్యక్తి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. జేసీ ఫ్యామిలీ 30 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉండి నీళ్లు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. కాగా, జేసీ ఫ్యామిలీ.. కేతిరెడ్డి ఫ్యామిలీ మధ్య నిత్యం ఏదో ఓ రూపంలో ఘర్షణ వాతావరణం ఉంటుందనే విమర్శలు ఉన్న విషయం విదితమే.
వైసీపీది ధనబలం, టీడీపీది ప్రజాబలం.. ఈ ప్రభుత్వం పని అయిపోయింది..!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధనబలం, తెలుగుదేశం పార్టీది ప్రజాబలం.. వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వం పని అయిపోతుందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి.. శ్రీకాళహస్తిలో నిజం గెలవాలి కార్యక్రమంలో భువనేశ్వరి ప్రసంగిస్తూ.. ఎన్టీఆర్ తెలుగు ప్రజలకు ఆత్మగౌరవం, చంద్రబాబు ఆత్మవిశ్వాసం తెచ్చారన్నారు.. 49 రోజులుగా చంద్రబాబును జైలులో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు..చంద్రబాబు నాయుడు అవినీతి చేశారని ప్రజలు నమ్మడం లేదన్న ఆమె.. పరిశ్రమలు ఏర్పాటు చేయటం తప్పా..? అమరావతి రాజధాని నిర్మించడం తప్పా…? పోలవరం కట్టడం తప్పా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక, ఏపీ అంటే అరాచకం, అప్పుల రాష్ట్రం అంటూ సంచలన ఆరోపణలు చేశారు. మళ్లీ చంద్రబాబు బయటకు వచ్చి మరింత ఉత్సాహంగా ప్రజల కోసం పనిచేస్తారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.. రాబోయే కురుక్షేత్ర యుద్దంలో టీడీపీ, జనసేన కూటమి విజయం తధ్యం అనే జోస్యం చెప్పారు నారా భువనేశ్వరి.
అర్హత ఉంటే నా బిడ్డను గెలిపించండి.. కాదంటే ఓడించండి..
రాజకీయాల్లోకి వచ్చి పదేళ్లలో అంచెలంచెలుగా ఎదిగి, తండ్రి రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా నడుస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. పైరవీలతో వచ్చిన వాడు కాదు.. ఫైటర్ గా రాజకీయాల్లోకి వచ్చినవాడు వైఎస్ జగన్ అంటూ ప్రశంసలు కురిపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.. తిరుపతిలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. నక్సల్ బరి ఉద్యమ ప్రభావంతో 1972లో ర్యాడికల్ పోరాటంలో ముందున్న వాడిని నేను అని గుర్తుచేసుకున్నారు.. ఎమర్జెన్సీ విధించిన సమయంలో నేను అత్యంత పిన్నవయసులో అరెస్ట్ అయిన వాడ్ని.. దేశం కోసం ఆ రోజు త్యాగం చేశామన్నారు.. ఇక, నా కుమారుడు అభినయ్‌ను అదేవిధంగా పెంచాను అన్నారు.. నా కుమారుడు తాగుబోతు కాదు, భూ కబ్జాదారుడు కాదు, తిరుగుబోతు కాదు.. అని ధైర్యంగా చెప్పగలను అని పేర్కొన్నారు.
ఏపీలో 4,02,21,450 ఓటర్లు.. 13.48 లక్షల ఓట్లు తొలగింపు..
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 4 కోట్లు దాటింది.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ రోజు డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల చేసింది.. ఆ జాబితా ప్రకారం.. ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 4,02,21,450గా ఉంది.. అందులో పురుష ఓటర్లు 1,98,31791కాగా.. మహిళా ఓటర్లు 2,0385,851 మంది ఉన్నారు.. ఇక ఓటుహక్కు కలిగిఉన్న ట్రాన్స్ జెండర్ల సంఖ్య 3,808గా ఉంది.. సర్వీస్ ఓటర్ల సంఖ్య 66,158 కాగా.. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 19,79,775 మంది ఓటర్లు ఉన్నారు.. అత్యల్పంగా అల్లూరి సీతారామారాజు జిల్లాలో 7,40,857 మంది ఓటర్లు ఉన్నట్టు ఎన్నికల కమిషన్ పేర్కొంది.. ఏపీ సీఈవో ఎంకే మీనా మీడియాతో మాట్లాడుతూ.. సీఈసీ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేశాం అన్నారు.. జనవరిలో విడుదల చేసిన ఓటర్ల జాబితా కంటే 2.36 లక్షల మేర ఓటర్లు పెరిగారన్న ఆయన.. డిసెంబర్ 27 వరకు క్లైమ్స్ పరిశీలిస్తారని తెలిపారు. ఇక, వచ్చే ఏడాది జనవరి ఐదో తేదీన తుది ఓటర్ల జాబితా వ్రకటిస్తాం అన్నారు. యువ ఓటర్ల నమోదు తక్కువగా ఉంది.. మరింత ఎక్కువ మంది అర్హులైన యువతను ఓటర్ల జాబితాలో చేర్చేందుకు కృషి చేస్తాం అని వెల్లడించారు.. గత ఓటర్ల జాబితా.. ప్రస్తుత ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల మధ్య కాలంలో మొత్తం 13.48 లక్షల ఓట్లు తొలగించాం. గత ఓటర్ల జాబితా.. ప్రస్తుత ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల మధ్య కాలంలో మొత్తం 15. 84 లక్షల ఓట్లను చేర్చాం తెలిపారు ఏపీ సీఈవో ఎంకే మీనా.
చంద్రబాబు భద్రతపై జైళ్ల శాఖ డీఐజీ కీలక వ్యాఖ్యలు..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలులో తన భద్రత, ఆరోగ్యంపై ఏసీబీ కోర్టు జడ్జికి లేఖ రాయడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది.. దీనిపై టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. వైసీపీ నేతులు మాత్రం బెయిల్ కోసం చంద్రబాబు ఆడే కొత్త డ్రామా ఇది అంటూ కౌంటర్ ఇస్తున్నారు.. అయితే, చంద్రబాబు భద్రతపై జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబుకి 24 గంటలు మొదటి నుంచి సెక్యూరిటీ ఏర్పాటు చేశాం అన్నారు.. అదనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని.. కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు వాచ్ చేస్తున్నాం అన్నారు. మావోయిస్టు పార్టీ లెటర్ వచ్చిందని చెప్తున్నారు.. దీనిపై విచారణ చేశాం… అది ఫేక్ లెటర్ అని తేలిందన్నారు జైళ్ల శాఖ డీఐజీ.. చంద్రబాబుకు సంబంధించిన బెదిరింపు లెటర్ ఫేక్ అని విచారణలో తేలిందని క్లారిటీ ఇచ్చారు.. ఇక, జైలు నుంచి చంద్రబాబు లెటర్ బయటకు వెళ్లిని లెటర్ కు జైలు అధికారులకు అటెస్టేషన్ చేయలేదన్నారు. చంద్రబాబు కుడి కంటి ఆపరేషన్ సంబంధించి రాజమండ్రి జీజీహెచ్ వైద్యులను సంప్రదించాం.. వారు పరీక్షలు నిర్వహించారు.. అమెచ్యూర్ కేటరాక్ట్ ఉన్నట్టు గుర్తించారని తెలిపారు. కొంత సమయం తర్వాత చేయవచ్చని వైద్యులు సూచించారని వివరించారు. చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి మేం ఎటువంటి తప్పుడు రిపోర్టు బయటికి ఇవ్వటం లేదని స్పష్టం చేశారు.. పూర్తి వివరాలు కోర్టుకు పంపుతున్నాం.. జైల్లో భద్రతకు సంబంధించి స్నేహ బ్యారేక్ లో చంద్రబాబును ఏ రూమ్ లో ఉంచామన్న విషయం బయటకు వెల్లడించడంలేదు.. కానీ, జైల్లో చంద్రబాబును ఫోటో తీసిన వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసాశాం… విచారం చేస్తున్నాం.. చంద్రబాబు భద్రతకు సంబంధించి ఎటువంటి అనుమానాలు అవసరం లేదన్నారు. చంద్రబాబు తనకు గతంలో ఉన్న ఎలర్జీల గురించి వైద్యులకు చెప్పారు.. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులకి రెండు లెటర్లు రాశాం.. చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి వ్యక్తిగత వైద్యున్ని సంప్రదించి ఎటువంటి చికిత్స అవసరమవుతుందో సజెషన్స్ ఇవ్వమని భువనేశ్వరికి కూడా తెలియజేశాం.. ఇదే విషయాన్ని కోర్టు కూడా తెలిపాం అని వెల్లడించారు జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్.
హమాస్, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ మెంబర్స్‌పై అమెరికా ఆంక్షలు..
ఇరాన్ లోని హమాస్ అధికారి, ఇరాన్ లోని రివల్యూషనరీ గార్డ్ సభ్యులతో సహా ఇటీవల ఇజ్రాయిల్ పై దాడికి తెగబడిన పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్‌పై అమెరికా రెండో రౌండ్ ఆంక్షలు విధించింది. హమాస్ ఇన్వెస్టిమెంట్ ఫోర్ట్‌ఫోలియోలోని ఆదనపు ఆస్తులను లక్ష్యంగా చేసుకుని, హమాస్ అనుబంధ కంపెనీలపై ఆంక్షల ఎగవేతను సులభతరం చేసే వ్యక్తులపై ఆంక్షలు విధించినట్లు యూఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇరాన్ హమాస్ తో పాటు లెబనాన్ లోని హిజ్బుల్లా మిలిటెంట్లకు సాయం చేస్తుందని ఇజ్రాయిల్, అమెరికా ఆరోపిస్తున్నాయి. హమాస్, పాలస్తీన ఇస్లామిక్ జిహార్ గ్రూపులకు అక్రమ ఇరానియన్ నిధులకు మధ్యవర్తిగా పనిచేసిన గాజాలోని ఓ సంస్థను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు యూఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ తెలిపింది. హమాస్ ఆర్థిక కార్యకలాపాలు, నిధుల ప్రవాహాలను అడ్డుకోవడంతో పాటు హమాస్ వంటి ఉగ్రవాద సంస్థల బలాన్ని తగ్గించేందుకు వెనకాబోమని డిప్యూటీ ట్రెజరీ సెక్రటరీ వాలీ అడెయెమో అన్నారు.
డిసెంబర్లో లెజెండ్ క్రికెట్ లీగ్.. విశాఖలో ఆడనున్న దిగ్గజ క్రికెటర్లు
డిసెంబర్లో లెజెండ్ క్రికెట్ లీగ్ విశాఖలో జరగబోతుందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గోపినాథ్ రెడ్డి వెల్లడించారు. క్రిస్ గేల్, గంబీర్, షేన్ వాట్సన్.. ఇలా 15 నుంచి 20 మంది దిగ్గజ క్రికెటర్లు విశాఖలో మ్యాచ్‌లు ఆడబోతున్నారని ఆయన తెలిపారు. దులీప్ ట్రోఫీలో ఒక స్టేట్ నుంచి నలుగురు ప్లేయర్లు ఆడిన ఘనత ఆంధ్రకే దక్కుతుందన్నారు. హనుమ విహారి, కేయస్ భరత్, రిక్కీ భువి, శశికాంత్ ఆడారని గోపినాథ్ రెడ్డి చెప్పారు. ఐపీఎల్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి ముగ్గురు ప్లేయర్లను సెలెక్ట్ చేశారని పేర్కొన్నారు. వారికి టెస్ట్ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారని అన్నారు. ఆంధ్ర నుంచి ఆడేవారికి మంచి అవకాశాలు ఇచ్చేందుకు బీసీసీఐ కూడా ముందుకు వచ్చిందన్నారు. ఫిబ్రవరి 2న ఇంగ్లాండ్‌తో టెస్ట్ మ్యాచ్ విశాఖలో జరగబోతుందని ఆయన వెల్లడించారు. ఇన్ని టోర్నీలు నిర్వహిస్తున్నాం అంటే మా స్టాఫ్ కృషి చాలా ఉందన్నారు. ఉమెన్ టీ20 లీగ్ చేసిన ఫస్ట్ స్టేట్ ఆంధ్రప్రదేశే అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇన్ని మ్యాచ్‌లు విశాఖ తీసుకొని రావడానికి చాలా కష్టపడ్డామన్నారు. ఈ మ్యాచెస్ చూసేందుకు విద్యార్థులకు ఫ్రీగా పాసులు ఇవ్వబోతున్నామని చెప్పారు. సెలెబ్రెటీ క్రికెట్ లీగ్ మళ్ళీ విశాఖలో జరగబోతుందని.. టీ20 మ్యాచ్ కోసం బీచ్ రోడ్డులో స్క్రీన్స్ పెడుతున్నామన్నారు. దేశంలో ఉన్న అన్ని స్టేడియాల కంటే విశాఖ స్టేడియంలో రేట్లు తక్కువ అని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గోపినాథ్ రెడ్డి స్పష్టం చేశారు. బీసీసీఐ ఇచ్చిన పేటీఎంకే టికెట్స్ విక్రయాలు ఇస్తున్నామన్నారు. నిజమైన క్రికెట్ అభిమానులకు టికెట్స్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. గతంలో టికెట్స్ లోకల్ వాళ్లకు ఇవ్వడంలో సక్సెస్ అయ్యామని.. 7 వేల కొత్త చైర్స్ వేస్తున్నామని ఆయన తెలిపారు.
ఒక్కసారి పెట్టుబడి పెడితే రూ.58950 పింఛన్ పొందవచ్చు..
భారతీయ అతి పెద్ద భీమా కంపెనీ ఎల్ఐసీ తన కస్టమర్లకు అదిరిపోయే లాభాలను అందించే స్కీమ్ లను అందిస్తుంది.. ఎల్ఐసీ అందిస్తున్న స్కీమ్ లలో ఒకటి సరళ్ ప్లాన్ కూడా ఒకటి.. ఈ ప్లాన్ లో డబ్బులను పెట్టుబడి పెడితే అధిక లాభాలను పొందవచ్చు.. ఈ ప్లాన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.. ఈ కొత్త పెన్షన్ స్కీమ్ అంటే సరళ్ పెన్షన్‌తో ముందుకు వచ్చింది. ఇందులో పాలసీదారులు ఒకసారి ప్రీమియం చెల్లించడం ద్వారా జీవితాంతం పెన్షన్ పొందవచ్చు. అయితే ఈ పెన్షన్ పొందడానికి రెండు ఎంపికలు ఉన్నాయి. ఒకటి జీవితాంతం పింఛను పొందేందుకు ఉండగా మరొకటి చివరిగా జీవించి ఉన్న వ్యక్తి మరణించినప్పుడు కొనుగోలు చేసిన ధరలో 100 శాతం లాభాన్ని పొందవచ్చు.. ఈ మొదటి ఆప్షన్లో పాలసీదారు జీవించి ఉన్నంత వరకు యాన్యుటీ చెల్లింపులు బకాయిల్లోనే చేస్తారు. వ్యక్తి మరణించినప్పుడు యాన్యుటీ చెల్లింపులు వెంటనే ఆగిపోతాయి. అలాగే నామినీకి మొత్తం డబ్బులను చెల్లిస్తారు.. అలాగే రెండొవ ఎంపికలో వ్యక్తి లేదా జీవిత భాగస్వామి జీవించి ఉన్నంత వరకు యాన్యుటీ మొత్తం బకాయిల్లో చెల్లిస్తారు. అయితే ఈ జాయింట్ లైఫ్ యాన్యుటీని జీవిత భాగస్వామితో మాత్రమే పూర్తిగా చెల్లిస్తారు.. ఇక ఈ పాలసీని కొనుగోలు చెయ్యాలనుకొనేవారికి వయస్సు 40 ఏళ్లు ఉండాలి.. గరిష్టంగా 80 ఏళ్లు ఉండాలి.. కాగా,సరళ్ పెన్షన్ కింద అందుబాటులో ఉన్న యాన్యుటీని భవిష్యత్తులో నెలవారీ, త్రైమాసికం లేదా వార్షికంగా చెల్లించవచ్చు. ఎల్ఐసి తన పాలసీ డాక్యుమెంట్లో పాలసీ ప్రారంభంలో యాన్యుటీ రేట్లు హామీ ఇస్తాయి.. ఉదాహరణకు 60 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి రూ. 10 లక్షలు పెట్టుబడి పెట్టి, వార్షిక యాన్యుటీ మోడ్‌ను ఎంచుకుంటే అతనికి రూ.58,950 లభిస్తుంది. అయితే ఈ చెల్లింపులు వివిధ షరత్తులకు లోబడి ఉంటాయి.. ఈ పాలసీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఆఫీస్ వెళ్లి కనుక్కోవచ్చు.. లేదా ఆన్ లైన్ లో చూడవచ్చు..
స్కంద ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది…
ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటించిన హైవోల్టేజ్ యాక్షన్ మూవీ స్కంద ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చేందుకు సిద్ధం అయింది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి అధికారిక ప్రకటన వచ్చేసింది. ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 28వ తేదీన గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ అయిన స్కంద సినిమా అనుకున్న స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది. హీరో రామ్ కు ఈ సినిమా ఆశించిన విజయాన్ని ఇవ్వ లేకపోయింది. ఇప్పుడు స్కంద మూవీ ఓటీటీలోకి రాబోతుంది.. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు డిస్నీ+ హాట్‌స్టార్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే..స్కంద చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చింది . స్కంద మూవీ నవంబర్ 2వ తేదీన డిస్నీ+ హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు రానుంది. ఈ విషయాన్ని డిస్నీ+ హాట్‌స్టార్ నేడు (అక్టోబర్ 27) అధికారికంగా ప్రకటించింది. “యాక్షన్ అడ్వెంచర్‌లోకి తీసుకెళ్లేందుకు స్కంద వచ్చేస్తోంది. నవంబర్ 2వ తేదీ నుంచి ర్యాపో ర్యాంపేజ్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది” అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది డిస్నీ+హాట్‌స్టార్.స్కంద సినిమా అక్టోబర్ 27న డిస్నీ+ హాట్‌స్టార్ ఓటీటీలోకి వస్తుందని ముందుగానే సమాచారం వచ్చింది. అయితే, ఆ ప్లాట్‌ఫామ్ మాత్రం నవంబర్ 2వ తేదీన స్కంద చిత్రాన్ని స్ట్రీమింగ్కు తీసుకురానున్నట్టు తెలిపింది.
డీఓపీ తొలగింపు.. అసలు నిజం చెప్పిన కొత్త డీఓపీ
సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరి మరో హీరోయిన్ గా నటిస్తోంది. గుంటూరు కారం సినిమా మొదలైనప్పటి నుంచి ఏదో ఒక గొడవ బయటకు వస్తూనే ఉంది. మొదట ఈ సినిమా నుంచి పూజా హెగ్డే బయటకు వచ్చేసింది. అయితే పూజా బయటకు రావడానికి కారణం వేరే వేరే కారణాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అయితే అలాంటిదేమి లేదని, పూజాకు డేట్స్ అడ్జెస్ట్ కాలేక సినిమానుంచి వైదొలగిందని, ఆమె తమ ఇంటి పిల్ల అని నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలపడంతో ఈ రూమర్స్ కు చెక్ పడింది. ఇకపూజా తరువాత ఈ సినిమా నుంచి డీఓపీ పీఎస్ వినోద్ బయటికి వచ్చేశాడు. ఇక ఆయన ప్లేస్ లో డీఓపీ మనోజ్ పరమహంస వచ్చి చేరాడు. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో గుంటూరు కారం సినిమాపై ఆసక్తికరమైన వవిషయాలను పంచుకున్నాడు. “నాకు ఒక కంప్లీట్ ఫీలింగ్ వచ్చింది. మహేష్ బాబు అంటే అందరికీ నచ్చిన ఒక కుటుంబంలోని మనిషి. మా ఫ్రెండ్స్ ఎప్పుడూ అడుగుతూ ఉంటారు. మహేష్ తో ఎందుకు సినిమా చెయ్యట్లేదు అని.. నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. మహేష్ గారికి సినిమాటోగ్రఫీ లో తెలియని విషయం లేదు. ఆయనతో సినిమా అంటే ఒక ఛాలెంజ్ లా ఉంటుంది. ఎందుకంటే చిన్న తప్పు చేసినా ఆయన కనిపెట్టేస్తారు. వేరే హీరోల్లా కాకుండా ఆయన అన్ని విషయాల్లో చాలా పర్ఫెక్ట్ గా ఉంటారు. పిక్చర్ పర్ఫెక్ట్ గా ఉండాలనుకుంటారు. ఆయన అన్నీ డిటైల్డ్ గా చూడడం నాకు చాలా ఆసక్తిగా ఉంది. ఆయన ఒక విషయం చెప్పారు అంటే పర్ఫెక్ట్ గా, కథకి సూట్ అయ్యేలా ఉంటది. ఆ పాయింట్స్ తీస్కొని విడమర్చి చెప్పినట్లు చేస్తే అవుట్ ఫుట్ బాగా వస్తుంది. పీఎస్ ఆనంద్ గారికి వేరే కమిట్మెంట్స్ వల్ల వెళ్లాల్సి వస్తే థమన్ నాకు ఫోన్ చేసి పిలిచారు, గుంటూరు కారం చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్, నేను చేయాలి అని చెప్పారు. నాకు వేరే కమిట్మెంట్ ఉంటే, వంశీ గారు మాట్లాడి డేట్స్ అడ్జస్ట్ చేశారు” అని చెప్పుకొచ్చాడు. దీంతో సినిమాపై మరింత హైప్ వచ్చింది. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలంటే వచ్చే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.