నాన్న ఎన్టీఆర్ మమ్మల్ని క్రమశిక్షణతో పెంచారు.. తెలుగువారి పౌరుషం చూపాలి..
నందమూరి కుటుంబంలో పుట్టడం నా అదృష్టం.. నాన్న ఎన్టీఆర్ మమ్మల్ని క్రమశిక్షణతో పెంచారని తెలిపారు టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి.. చంద్రగిరి నియోజకవర్గం, అగరాలలో ‘ నిజం గెలవాలి ‘ బహిరంగ సభలో మాట్లాడిన ఆమె.. ఇది వరకు గ్రామంలో కుటుంబంతో సంతోషంగా గడిపిన క్షణాలు గుర్తుకు వచ్చి నా గుండె పిండేసిందన్నారు. మొదటిసారి ఇలా పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతున్నాను.. నిజం గెలవాలి.. అనే ఈ పోరాటం నా ఒక్కరిది కాదు.. మన అందరిది అన్నారు. మన బిడ్డలు, మన భావితరాల కోసం ఈ పోరాటం.. అసలు ఇక్కడ పరిపాలన ఉందా..? అని ప్రశ్నించారు. చంపడం, కేసులు, రేప్ లు, గంజాయి, భయపెట్టడం.. ఇవే రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. అభివృద్ధి ఎక్కడ..? అని నిలదీశారు. రాష్ట్రంలో అరాచకం జరుగుతోంది.. బ్రిటీష్ వారితో పోరాడినట్లుగా ఉంది.. తెలుగు వారి పౌరుషం చూపాలి అంటూ పిలుపునిచ్చారు. చంద్రబాబును కాదు.. రాష్ట్రాన్ని, న్యాయాన్ని నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు భువనేశ్వరి.. నందమూరి కుటుంబంలో పుట్టడం నా అదృష్టం.. నాన్న ఎన్టీఆర్ మమల్ని క్రమశిక్షణతో పెంచారు.. ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు మూడు వేల మంది అనాథ పిల్లలకు చదువు చెప్పించాం.. అనేక అపద సమయాల్లో పేదలను ఆదుకున్నాం అని గుర్తుచేశారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు ప్రజల కోసమే ఆలోచించారు. హైటెక్ సిటీ కట్టేటప్పుడు ఆయనను చూసి నవ్వారన్నారు. చంద్రబాబు తప్పులను మొదట నేనే ఎత్తి చూపే దాన్ని.. కానీ, ఆయన ఒక విజన్ తో ఆలోచించేవారన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా జైలులో ఆయన్ను నిర్బంధించారంటూ భావోద్వేగానికి గురయ్యారు. స్కిల్ స్కాం లో ఎలాంటి ఆధారాలు లేవు.. అనేక కొత్త కేసులు పెడుతున్నారు. ఎందులోనూ ఆధారాలు లేవన్నారు.
‘నిజం గెలవాలి’ అని కాదు.. నిజం చెప్పాలి తల్లి.. భువనేశ్వరికి మంత్రి కౌంటర్
నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి చేస్తున్న యాత్రకు కౌంటర్ ఇచ్చారు మంత్రి జోగి రమేష్.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. భువనేశ్వరి నిజం గెలవాలి అని కాదు.. నిజం చెప్పాలి తల్లి అని సూచించారు.. చంద్రబాబు అసలు స్వరూపం పై భువనేశ్వరి నిజం చెప్పాలి.. 2 ఎకరాల నుంచి రెండు వేల కోట్లకు చంద్రబాబు ఎలా ఎదిగాడో భువనేశ్వరి చెప్పాలి.. దోచుకున్న సొమ్ము, దాచుకున్న సంగతులు అన్నీ భువనేశ్వరి నిజం చెప్పాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.. ఇక, ఈ రోజుకు అయినా నిజం గెలిచింది కనుకే చంద్రబాబు జైల్లో ఉన్నాడన్న ఆయన.. భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర కాదు పాపపు పరిహార యాత్ర చేస్తే బాగుండేదన్నారు.. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచినప్పటి నుంచి చేసిన పాపాలకు పరిహారం చేసే విధంగా యాత్ర చేయాల్సిందన్నారు. మరోవైపు టీడీపీ-జనసేన పొత్తులపై మరింత ఘాటుగా స్పందించారు జోగి రమేష్.. పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యభిచారి అని పేర్కొన్న ఆయన.. బీజేపీతో సంసారం చేస్తున్నాను అంటాడు.. టీడీపీతో పొత్తు అంటాడు అని దుయ్యబట్టారు.. పవన్ కల్యాణ్.. చంద్రబాబుకు అమ్ముడు పోయాడు అని ఆరోపించారు. తన అభిమానులను కూడా అమ్మేస్తున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇక, రేపటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టనున్న బస్సు యాత్రపై మాట్లాడుతూ.. బస్సు యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన రానుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు మంత్రి జోగి రమేష్.
ఏందిరా ఇది..? తాళి కట్టే సమయానికి బాత్రూమ్లో దూరిన పెళ్లికొడుకు.. ఎంతకూ రాడే..!
విశాఖపట్నంలోని గోపాలపట్నంలో జరిగిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గోపాలపట్నంకు చెందిన సంతోష్‌కి విశాఖకు చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయమైంది.. ముహూర్తం ప్రకారం.. ఈ రోజు ఉదయం 11 గంటలకు వివాహం జరగాల్సి ఉంది.. కానీ, పెళ్లి కూతురుకు తాళికట్టే సమయానికి బాత్రూమ్లోకి దూరాడు పెళ్లి కొడుకు.. ఒకటో.. రెండో ఆపుకోలేక బాత్రూమ్కి పరుగులు పెట్టాడేమో అనుకుంటే పొరపాటే.. బాత్రూమ్ దూరి గడియపెట్టుకున్న పెళ్లి కొడుకు ఎంతకూ బయటకు రాలేదు.. దీంతో పెళ్లి ఆగిపోయింది.. ఇక, పెళ్లి నిలిచిపోవడంతో గోపాలపట్నం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు పెళ్లి కూతురు బంధువులు… పెళ్లి కుమారుడు సంతోష్‌తో పాటు.. వధువును కూడా స్టేషన్‌కు పిలిచిన ఈ వ్యవహారంపై ఆరా తీశారు.. అయితే, గత వారం రోజులుగా పెళ్లికొడుకుతో పెళ్లికూతురు ఫోన్లో మాట్లాడలేదట.. అందుకే అలిగి.. పెళ్లి చేసుకోవడానికే నిరాకరించాడని సమాచారం.. కానీ, రింగులు మార్చుకొని, కట్నకానుకలు తీసుకున్న తర్వాత ఇలా నాకు ఇష్టం లేదని ముఖం చాటేసిన పెళ్లి కొడుకుపై అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఈ వ్యవహారం కాస్తా సోషల్ మీడియాకు ఎక్కింది.. ఫోన్ మాట్లాడకపోతే పెళ్లి ఆపేయడం ఏంటి.. బాత్రూమ్లో దూరండం ఏంటిరా అయ్యా? అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
28న శ్రీశైలం ఆలయం మూసివేత..
ఈ నెల 28వ తేదీన శ్రీశైలం మల్లన్న ఆలయం మూత పడనుంది.. పాక్షిక చంద్రగ్రహణం కారణంగా.. 28వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి మరుసటి రోజు 29వ తేదీన ఉదయం 5 వరకు ఆలయ ద్వారాలు మూసివేయనున్నారు ఆలయ సిబ్బంది.. 28న మధ్యాహ్నం 3.30 గంటల వరకు మాత్రమే భక్తులకు దర్శనానికి అనుమతించనున్నారు.. శ్రీశైలం ప్రధానాలయంతో పాటు.. పరిసర ప్రాంతాల్లోని ఆలయాలు కూడా మూసివేయనున్నట్టు ఆలయ అధికారులు చెబుతున్నారు.. అయితే, 29వ తేదీన ఉదయం 5 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి ఆలయ శుద్ధి, సంప్రోక్షణ పూర్తి చేసిన తర్వాత దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు.. అంటే ఉదయం 29న ఉదయం 7 గంటల తర్వాత శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతించనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. ఇక, చంద్రగ్రహణం సందర్భంగా.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలతో పాటు.. చిన్న ఆలయాలను కూడా 28వ తేదీన సాయంత్రం నుంచి మూసివేయనున్నారు.. అయితే, ఈ ఆలయం ఏ సమయంలో మూసివేస్తారు అనేదానిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.
ఓట్ల తొలగింపుపై ఈసీ సీరియస్.. ఎమ్మెల్యే ఫిర్యాదుతో అధికారులపై చర్యలు
పర్చూరు నియోజకవర్గంలో ఓట్ల తొలగింపుపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యింది.. నలుగురు పోలీస్ అధికారులపై చర్యలు తీసుకుంది.. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఫిర్యాదుతో విచారణ జరిపిన ఎన్నికల కమిషన్.. బాపట్ల ఎస్పీ నివేదికతో చర్యలకు పూనుకుంది.. ఓట్ల తొలగింపులో ప్రమేయం ఉందని నిరూపితం కావడంతో.. మార్టూరు సీఐ, పర్చూరు, మార్టూరు, యద్దనపూడి ఎస్సైలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు సీఈవో ముకేశ్ కుమార్ మీనా.. ఓట్ల తొలగింపులో ప్రమేయం ఉన్న బీఎల్ఓలు, మహిళా పోలీసులపైనా చర్యలకు ఆదేశాలు జారీ చేశారు.. ఆగస్టు నెలలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఎమ్మెల్యే సాంబశివరావు ఫిర్యాదు చేశారు.. ఇప్పుడు అధికారులపై తీసుకున్న చర్యలను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు సీఈవో మీనా..
ఈ సంవత్సరం మాకు దీపావళి లేదు.. ఆయన ఓడిన రోజే దీపావళి..
ఈ సంవత్సరం మాకు దీపావళి లేదు.. వైఎస్ జగన్ ఓడిన రోజే మాకు దీపావళి అని వ్యాఖ్యానించారు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న.. టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మాజీమంత్రి కొడాలి నానితో పాటు.. సీఎం జగన్‌పై మండిపడ్డారు.. జగన్ జైల్లో ఉన్నప్పుడు విజయమ్మ, షర్మిల ప్రచారం చేశారంటే.. వైఎస్ జగన్ అసమర్థుడని కొడాలి నాని చెప్తారా? అని దుయ్యబట్టారు.. కొడాలి నాని దృష్టిలో వైఎస్ జగన్ పనికిరాని వాడు.. ఇప్పటికైనా తన మనసులో మాటని కొడాలి నాని బయట పెట్టాడన్న ఆయన.. తనని అర్థాంతరంగా మంత్రి పదవి నుంచి తప్పించారనే బాధ కొడాలి నానికి ఉంది.. అందుకే జగన్ పనికిమాలిన వాడంటున్నాడని విమర్శించారు. ఇక, కొడాలి నానికి ఎన్టీఆర్ దేవుడు అయినప్పుడు.. ఆయన కుమార్తె భువనేశ్వరి దేవత కాదా..? అని ప్రశ్నించారు బుద్దా వెంకన్న.. లాయర్ల కోసం చంద్రబాబు రూ. 35 కోట్లు ఖర్చు పెట్టారంటున్న కొడాలి నాని.. వైఎస్ జగన్ 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు రూ. 4000 కోట్లు ఖర్చు పెట్టారా? అని నిలదీశారు.. భర్తకు జరిగిన అన్యాయంపై ప్రజల్లోకి వస్తే భువనమ్మ (నారా భువనేశ్వరి)ను చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వణికి పోతున్నారన్నారు.. మరోవైపు నారా లోకేష్-పవన్ కల్యాణ్ కలయికతో వైసీపీకి అభ్యర్థులు కరువయ్యారని పేర్కొన్నారు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేవాళ్లంతా జగన్ రెడ్డి అనుచరులే అంటూ సంచలన ఆరోపణలు చేశారు.. ఇక, ఈ సంవత్సరం మాకు దీపావళి లేదు. జగన్ ఓడిన రోజే అసలైన దీపావళి అని వ్యాఖ్యానించారు బుద్దా వెంకన్న.
మేడిగడ్డ ఆనకట్ట డిజైన్‌లో ఎలాంటి లోపాలు లేవు.. కానీ!
మేడిగడ్డ ఆనకట్ట డిజైన్‌లో ఎలాంటి లోపాలు లేవని తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ పేర్కొన్నారు. డిజైన్ లోపం ఉంటే మూడు సీజన్లు ఎలా తట్టుకుంటుందని ఆయన ప్రశ్నించారు. ఏడో బ్లాక్‌లో సమస్య వల్ల సెంటర్ పిల్లర్ కుంగిందని అన్నారు. కానీ ఫౌండేషన్ కింద ఇసుక కదలిక వల్ల సమస్య వచ్చిందని అనుకుంటున్నామని అనుమానం వ్యక్తం చేశారు. కేంద్ర బృందం అన్ని వివరాలు తెలుసుకున్నారని, ఇంకా అదనపు సమాచారం అడిగారని ఆయన వెల్లడించారు. వరద ఉద్ధృతి తగ్గాక పునర్నిర్మాణ పనులు చేపడతామన్నారు. నీటిని మళ్లించి వేసవి వరకు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. కాపర్ డ్యామ్‌లో వరద తగ్గుముఖం పట్టిన తర్వాత నవంబర్ నెలాఖరులోగా సమగ్ర పరిశీలన జరుపుతామని ఈఎన్సీ మురళీధర్ తెలిపారు.
బీజేపీ కేసీఆర్‌ను తట్టుకోలేక కాంగ్రెస్‌తో చేతులు కలిపింది..
సంగారెడ్డి గడ్డపై ఈ సారి గులాబీ జెండా ఎగరేస్తామని మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన వ్యాఖ్యానించారు. జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ఎన్ని గ్రామాల్లో తిరిగారని ఆయన ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు ప్రసంగించారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నారని.. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ చేరికతో బీజేపీ, కాంగ్రెస్ స్నేహ బంధం బట్టబయలు అయ్యిందన్నారు. కోమటిరెడ్డి అన్నదమ్ములు ఇద్దరు ఏ పార్టీలో ఉన్న ఒకరికి ఒకరి గెలుపు కోసం పని చేస్తారని మంత్రి అన్నారు. ఢిల్లీలో రెండు పార్టీల మధ్య స్నేహ బంధం బయటపడిందన్నారు. తెలంగాణలో జరిగిన మూడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు అయ్యిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం పని చేసిందన్నారు. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి ఇద్దరు కలిసి రోజు మాట్లాడుకుంటున్నారని.. బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఇంకా ఎవరిని పంపాలని చూస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు. బీజేపీ పార్టీ కేసీఆర్‌ను తట్టుకోలేక కాంగ్రెస్‌తో చేతులు కలిపిందని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమాన్ని నీరుగార్చడానికి రెండు పార్టీలు ఎన్నో కుట్రలు చేశాయన్నారు. రాహుల్ గాంధీ ఉంటే నరేంద్ర మోడీకి బలం అని బీజేపీ వాళ్ళు అనుకుంటున్నారన్నారు మంత్రి హరీశ్. కేసీఆర్ ఒక వ్యక్తి కాదు తెలంగాణ శక్తి అని ఆయన వ్యాఖ్యానించారు. విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ అయితే విషం చిమ్మే పార్టీలు కాంగ్రెస్, బీజేపీ అంటూ తీవ్రంగా మండిపడ్డారు. అన్నం పెట్టే నాయకుడు కేసీఆర్.. సున్నం పెట్టే పార్టీ ప్రతిపక్షాలు అంటూ వ్యాఖ్యాంచారు. పొరపాటున కాంగ్రెస్‌కి ఓటేస్తే 60 ఏళ్ల కిందికి తెలంగాణ పోతుందన్నారు. మూడో సారి కేసీఆర్‌ను గెలిపించుకోకపోతే రాష్ట్రం ఆగం అవుతుందన్నారు మంత్రి హరీశ్ రావు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ పిచ్చి తుగ్లక్ డిజైన్.. న్యాయ విచారణకు కేసీఆర్ సిద్ధమా?
తెలంగాణలో ఆర్భాటంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజి పిల్లర్లు కుంగి పోవడం తీవ్రమయిన అంశమని ఆయన అన్నారు. క్వాలిటీ విషయంలో అనుమానాలు మొదలయ్యాయని ఆయన వెల్లడించారు. ప్రపంచంలో ఇటువంటి ప్రాజెక్ట్ ఎక్కడా లేదని, కేసీఆర్ సూపర్ ఇంజనీర్‌గా అవతారం ఎత్తారన్నారు. మేడిగడ్డ లోపాలతో ప్రాజెక్ట్ పైనే ఎన్నో అనుమానాలు మొదలయ్యాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందని ఆయన ఆరోపించారు. నాసిరకంగా నిర్మించారన్న ఆయన.. కాళేశ్వరం ఫెయిల్యూర్ ప్రాజెక్ట్‌గా మారిందన్నారు. అప్పు చేసిన ప్రాజెక్ట్ ఇలా మారిందని.. వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయని విమర్శించారు. ఇది నేరమన్న కిషన్ రెడ్డి.. పిల్లర్లు కృంగి పోతే జనం చూసి అధికారులకు చెప్పారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి శాసన సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కేసీఆర్ ఇచ్చారని.. ప్రాజెక్ట్ అనుకున్న లక్ష్యాలకు చేరుకోలేదన్నారు. నాలుగేళ్లలో 154 టీఎంసీల నీళ్ళు మాత్రమే లిఫ్ట్ చేశారన్నారు. ప్రాజెక్టులను టూరిజం సెంటర్లుగా చూపెట్టారని.. అదనపు ఇరిగేషన్‌కు ఎక్కడా వాడుకోలేదన్నారు. రైతులకు ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడలేదని ఆరోపించారు. 18లక్షల ఎకరాల టార్గెట్ సాగు అన్నారని.. ప్రజలను మోసం చెయ్యడానికి ఈ ప్రాజెక్ట్‌ను ఉపయోగించారని విమర్శలు గుప్పించారు. అప్పులతో పనికిరాని, చెత్త ప్రాజెక్ట్‌ను కట్టించారని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు.కాళేశ్వరం ప్రాజెక్ట్ పెద్ద బ్లండర్ అని.. కాళేశ్వరం ప్రాజెక్ట్ పిచ్చి తుగ్లక్ డిజైన్ అని కిషన్ రెడ్డి మండిపడ్డారు. పిల్లర్లు కుంగి పోతే, కుట్ర కేసు నమోదు చేశారని.. ఇది దారుణమన్నారు.
ఇజ్రాయిల్‌కి మద్దతుగా రాయబారిని కలిసిన కంగనా రనౌత్..
నటి కంగనా రనౌత్ ఇజ్రాయిల్‌కి మద్దతు తెలిపారు. బుధవారం ఆమె భారత్ లోని ఇజ్రాయిల్ రాయబారి నవోల్ గిలోన్ని కలిశారు. ఇద్దరు పలు విషయాలను చర్చించుకున్నారు. ఈ మీటింగ్ కి సంబంధించిన విషయాలను ఇరువురు తమ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేశారు. ఉగ్రవాదంపై ఇజ్రాయిల్ విజయం సాధింస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘భారత్ లోని ఇజ్రాయెల్ రాయబారి శ్రీ నూర్ గిలోన్ జీతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ రోజు ప్రపంచం మొత్తం, ముఖ్యంగా ఇజ్రాయెల్ మరియు భారతదేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి.నిన్న నేను రాహన దహనం కోసం ఢిల్లీలో ఉన్నాను. నేటి ఆధునిక రావణుడు హమాస్ లాంటి ఉగ్రవాదులు ఏరివేస్తున్న ఇజ్రాయిల్ రాయబారిని కలవాలని నిన్న అనుకున్నాను. చిన్న పిల్లలను, మహిళల్ని టార్గెట్ చేస్తున్న తీరు హృదయవిదారకంగా ఉంది. ఈ టెర్రరిజంపై ఇజ్రాయిల్ యుద్ధంలో విజయం సాధిస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది. తనతో నా అప్ కమింగ్ సినిమా ‘తేజస్’ ఇండియా సెల్ఫ్ రిలయంట్ ఫైటర్ జెట్ తేజస్ గురించి చర్చించాను’’ అని కంగనా రనౌత్ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.
సినిమాలకు బ్రేక్ ప్రకటించిన బాలీవుడ్ స్టార్ హీరో.. కారణం అదేనా..?
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ తాజాగా అభిమానులకు షాకింగ్ న్యూస్ తెలిపారు.. సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకుంటున్నట్లు ప్రకటించారు.అయితే ఆయన కేవలం ఆరు నెలలు మాత్రమే బ్రేక్ తీసుకోనున్నట్టు తెలిపారు. రణ్‌బీర్ బ్రేక్ తీసుకోవడానికి కారణం తన కూతురు రాహా అని తెలుస్తుంది.. హీరోయిన్ అలియాభట్, రణ్‌బీర్ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గతేడాది ఏప్రిల్‌లో వీరి వివాహం జరిగింది. వీరికి నవంబర్ 6న పాప రాహా జన్మించింది. ఆ చిన్నారి జన్మించి ఏడాది కావస్తుందడంతో తనతో ఆడుకోవడానికి టైమ్ దొరకడం లేదట. తన బిజీ షెడ్యూల్ కారణంగా పాపతో టైమ్ స్పెండ్ చేయాలకపోతున్నారట రణ్‌బీర్. అందుకే సినిమాలకు బ్రేక్ తీసుకుంటున్నట్టు ప్రకటించారు. తాజాగా ఆయన మాట్లాడుతూ, చాలా రోజులుగా నా కూతురు రాహాతో టైమ్ స్పెండ్ చేయాలనుకుంటున్నా, కానీ అస్సలు కుదరడం లేదు, సినిమాలకు సంబంధించిన బిజీ షెడ్యూల్ కారణంగా తనతో సమయం గడపలేకపోయాను. అందుకే ఇప్పుడు ఆరు నెలలు రాహాతోనే ఉండాలనుకుంటున్నా. `యానిమల్` చిత్రం తర్వాత మరో సినిమాకి సైన్ చేయలేదు. రాహా ఇప్పుడిప్పుడే అన్నింటిని గుర్తిస్తుంది. మాకు ప్రేమని పంచుతుంది. మాట్లాడానికి కూడా ప్రయత్నిస్తుంది. ఈ అందమైన, మధురమైన క్షణాలను నేను ఆస్వాదించాలనుకుంటున్నా. అందుకే ఆరు నెలలు పూర్తిగా తనతోనే స్పెండ్ చేస్తాను` అని తెలిపారు. ప్రస్తుతం రణ్ బీర్ కపూర్.. `యానిమల్` చిత్రంలో నటిస్తున్నారు. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రం డిసెంబర్ 1న గ్రాండ్ గా విడుదల కాబోతుంది. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇప్పటికే విడుదలై ఎంతగానో ఆకట్టుకుంది.ఈ సినిమాలో రణ్ బీర్ రగ్గడ్ లుక్ లో ఎంతో వైలెంట్ క్యారెక్టర్ లో నటించారు. అలాగే హీరో హీరోయిన్ ల పై రొమాంటిక్ సీన్స్ కూడా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా స్పెషల్ గా తెరకెక్కించారు…
ఓటీటీ లోకి వచ్చేసిన మాస్టర్ పీస్ వెబ్ సిరీస్..
స్టార్ హీరోయిన్ నిత్యామీనన్ ప్రస్తుతం వరుస వెబ్ సిరీస్ లు చేస్తూ దూసుకుపోతుంది. ఈ భామ నటించిన తాజా వెబ్ సిరీస్ మాస్టర్ పీస్ వెబ్‌సిరీస్ ఓటీటీ లో రిలీజైంది. బుధవారం నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ఈ ఫన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.ఈ మలయాళ వెబ్ సిరీస్ తెలుగు, తమిళం, హిందీ మరియు కన్నడ భాషల్లో అందుబాటు లో ఉన్నట్లు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రకటించింది. ఈ సిరీస్‌కు శ్రీజీత్ ఎన్ దర్శకత్వం వహించాడు. షరాఫుద్దీన్, రెంజి ఫణిక్కర్ మరియు మాల పార్వతి ముఖ్య పాత్ర లను పోషించారు.విభిన్న భావాలు కలిగిన ఓ జంట పెళ్లితో ఒక్కటైన తర్వాత ఏం జరిగిందన్నది వినోదాత్మకంగా ఈ సిరీస్‌లో డైరెక్టర్ శ్రీజీత్ చూపించారు.. ఇందులో రియా అనే పాత్రలో నిత్యామీనన్ నటించింది. నిత్యా తన గత సినిమాలకు, సిరీస్‌లకు భిన్నం గా ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ తో ఈ సిరీస్‌లో కనిపించింది.అంతే కాకుండా మలయాళంలో నిత్యామీనన్ నటించిన ఫస్ట్ వెబ్ సిరీస్ కూడా ఇదే కావడం విశేషం..బ్రీత్ సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన నిత్యామీనన్ తెలుగులో మోడ్రన్ లవ్ ఇన్ హైదరాబాద్ మరియు శ్రీమతి కుమారి వెబ్‌సిరీస్ లలో నటించి మెప్పించింది.శ్రీమతి కుమారి వెబ్‌సిరీస్ ఇటీవల అమెజాన్ ప్రైమ్‌లో విడుదల అయి మంచి ఆదరణ పొందుతుంది.. ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ తీసుకున్న నిత్యామీనన్ వెబ్‌సిరీస్‌లపై బాగా ఫోకస్ చేస్తుంది.. గత ఏడాది ధనుష్ హీరోగా నటించిన తమిళ చిత్రం తిరు చిత్రాంబళం సినిమాలో హీరోయిన్ గా నటించి బిగ్గెస్ట్ హిట్ అందుకున్నది నిత్యామీనన్.ఈ సినిమా దాదాపు 100 కోట్ల కలెక్షన్స్ సాధించింది.నిత్యా మేనన్ గ్లామర్ పాత్రలకు దూరంగా వుంటూ కథా ప్రాధాన్యత వున్న కథకలకు ఓకే చెబుతుంది. చిన్న హీరో అయినా సరే కథ నచ్చితే ఆ సినిమాకు ఓకే చెబుతుంది.
ఖరీదైన కారు కొన్న బుట్టబొమ్మ.. ధర ఎంతో తెలుసా?
స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే గురించి ఎంత చెప్పినా తక్కువ.. వరుస ప్లాపులు పలకరించిన కూడా తగ్గట్లేదు.. వరుస సినిమాల్లో నటిస్తున్నారు.. ప్రస్తుతం బాలీవుడ్‌పై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. షాహిద్ కపూర్‌తో త్వరలోనే ఓ సినిమా చేస్తున్నారు ఈ బుట్టబొమ్మ. ఇటీవల మాల్దీవుల ట్రిప్‌కు వెళ్లి పూజ.. గ్లామర్ ట్రీట్ చేస్తూ చాలా ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఇటీవలే పుట్టిన రోజును జరుపుకున్నారు. కాగా, తాజాగా పూజా హెగ్డే ఓ కొత్త కారును కొనుగోలు చేశారు. దసరా సందర్భంగా లగ్జరీ కారును సొంతం చేసుకున్నారు. రేంజ్ రోవర్‌కు చెందిన లగ్జరీ ఎస్‌యూవీని ఆమె కొత్తగా తీసుకున్నారు.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. రేంజ్ రోవర్ ఎస్వీ ఎస్యూవీ కారును పూజా హెగ్డే కొనుగోలు చేశారు. ముంబైలో కొత్త కారు నుంచి ఆమె దిగుతుండగా.. కెమెరాల కంటికి చిక్కారు. దీంతో కారు ముందు ఆమె కెమెరాలకు పోజులు ఇచ్చారు. దసరా సందర్భంగా సంప్రదాయ దుస్తులను పూజ హెగ్డే ధరించారు. బ్లూ అనార్కలి డ్రెస్ ధరించి అందంగా మెరిశారు బుట్టబొమ్మ.. పూజా కొనుగోలు చేసిన ఈ రేంజ్ రోవర్ ఎస్వీ మోడల్ కారు ధర సుమారు రూ.4కోట్లుగా ఉందని తెలుస్తోంది.