శ్రీవారి భక్తులకు అలర్ట్.. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు ఇచ్చేది అక్కడే..
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఎల్లుండి తిరుపతిలో జారీచేసే సర్వదర్శన టోకెన్లు రద్దు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం.. ఎల్లుండి మధ్యహ్నం 2 గంటల నుంచి వైకుంఠ ద్వారా దర్శనం టోకెన్లు కేటాయించనుంది టీటీడీ.. తిరుపతిలో 9 కేంద్రాల వద్ద 94 కౌంటర్లు ద్వారా టికెట్లు జారీ చేయనున్నారు అధికారులు.. రోజుకి 42,500 చొప్పున మొత్తం 4.25 లక్షల టికెట్లను వైకుంఠ ద్వారా దర్శనం కోసం కేటాయించింది టీటీడీ.. కాగా, ఈ నెల 23వ తేదీ నుంచి 2024 జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార భక్తులకు దర్శనాలు కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.. ఈ సమయంలో దాదాపు 8 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.. రద్దీ పెరగనున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ.. వైకుంఠ ద్వార దర్శనం కల్పించే ఈ పది రోజుల పాటు సిఫారసు లేఖలపై కేటాయించే దర్శనాలను రద్దు చేశారు.. ఒకవేళ వీఐపీలు.. వారి కుటుంబసభ్యులతో వస్తే మాత్రం దర్శనం టికెట్లు కేటాయించనున్నట్టు ఇప్పటికే స్పష్టం చేసింది టీటీడీ.. ఇక, వైకుంఠ ద్వారా దర్శనాలకు వచ్చే భక్తుల కోసం తిరుపతిలోని 9 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 92 కౌంటర్ల ద్వారా 4,23,500 సర్వదర్శనం టోకెన్ల కేటాయించనున్నారు. ఈ టికెట్లను డిసెంబర్ 22వ తేదీ అంటే ఎల్లుండి మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇవ్వనున్నారు.
మాల, మాదిగలపై పెట్టిన కేసులు ఎత్తివేత.. జీవో జారీ
మాలలు, మాదిగలపై పెట్టిన కేసులను ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వివిధ ఆందోళనల సమయంలో మాల, మాదిగలపై పెట్టిన కేసులను ఉపసంహరిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం.. ఇక, ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు మంత్రులు, ఆ సామాజిక వర్గం నేతలు.. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని కలిసిన ఎస్సీ మంత్రులు, మాల, మాదిగ నాయకులు.. వివిధ సందర్భాల్లో దళితులపై పెట్టిన కేసులను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.. కేసుల ఎత్తివేతకు నిర్ణయం తీసుకున్న సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సీఎంను కలిసన వారిలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, హోం మంత్రి తానేటి వనిత, మంత్రులు మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్, నందిగాం సురేష్ బాబు, జూపూడీ ప్రభాకర్‌రావు తదితర నేతలు ఉన్నారు.
8వ తరగతి విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రేపే సీఎం చేతులమీదుగా ఉచితంగా ట్యాబ్‌లు
ఎనిమిదో తరగతి విద్యార్థులకు శుభవార్త.. రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా వారికి ఉచితంగా ట్యాబ్‌లు పంపిణీ చేసేందుకు సిద్ధం అయ్యింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రేపు సీఎం వైఎస్ జగన్ అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో పర్యటించనున్నారు.. ఈ పర్యటనలో 8వ తరగతి విద్యార్ధులకు ఉచితంగా ట్యాబ్‌లు అందజేసే కార్యక్రమానికి శ్రీకారంట చుట్టనున్నారు.. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు సీఎం జగన్. ఇక, చింతపల్లి పర్యటన కోసం గురువారం ఉదయం 8.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరివెళ్లనున్నారు.. చింతపల్లి మండలం చౌడుపల్లి చేరుకోనున్న ఆయన.. చింతపల్లిలోని గిరిజన సంక్షేమ శాఖ బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్ధులతో మాట్లాడనున్నారు.. అనంతరం ట్యాబ్‌లు పంపిణీ చేయనున్నారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి జగన్.. కాగా, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు పంపిణీ చేయనుంది ఏపీ ప్రభుత్వం.. రాష్ట్రంలోని 4.34 లక్షల మంది 8వ తరగతి విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.. బైజూస్ కంటెంట్ ప్రీ లోడెడ్ ట్యాబ్‌లు అందజేయనున్నారు.. అయితే, ట్యాబ్‌లలో 8వ తరగతి విద్యార్థులతో పాటు 9, 10వ తరగతి విద్యార్థులకు కూడా బైజూస్ కంటెంట్ లోడ్ చేసి ప్రభుత్వం ట్యాబ్‌లు పంపిణీ చేస్తున్న విషయం విదితమే.. ఈ ట్యాబ్ ల కోసం 620 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది వైఎస్ జగన్ సర్కార్.. ఈ ట్యాబ్‌ల విలువ 17,500 రూపాయలు కాగా.. అందులో 15 వేల రూపాయలకు పైగా విలువ చేసే బైజూస్ కంటెంట్‌ను వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్ అందిస్తోంది.
సత్యహరిచంద్రుడు లెక్క హరీష్ మట్లాడుతున్నారు..
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై చర్చ సాగింది. అధికార, ప్రతిపక్షాల మధ్య హాట్ హాట్ గా చర్చలు జరిగాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మాజీ మంత్రి హరీష్ రావుపై నిప్పులు చెరిగారు. ఇంకా హరీష్ మంత్రి అనుకుంటున్నారు.. మంత్రిలాగా వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం మీద వివరాలు చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. 1.34 లక్షల కోట్లకు టెండర్లు పిలిచారు.. లక్ష కోట్లు ఖర్చు పెట్టినా లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదని సీఎం తెలిపారు. సత్యహరిచంద్రుడు లెక్క హరీష్ మట్లాడుతున్నారని విమర్శించారు. తప్పు ఒప్పుకుని.. క్షమించండి అని అంటే హుందాగా ఉండేదని సీఎం తెలిపారు. తాము కూడపెట్టిన సంపద అడ్డుపెట్టుకుని.. తనకా పెట్టారని సీఎం మండిపడ్డారు. రూ.13 లక్షల 72 కోట్లు గత ప్రభుత్వం ఖర్చు చేసిందని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదు.. దళితులకు మూడు ఎకరాల ఇవ్వలేదు.. రాజీవ్ ఆరోగ్య శ్రీకి నిధులు ఇవ్వలేదని దుయ్యబట్టారు. హాస్టల్ లో వంట చేసే వాళ్లకు కూడా జీతభత్యాలు ఇవ్వలేదని అన్నారు. ఉద్యోగులకు మొదట రోజు జీతాలు వెయ్యలేదు ఎందుకని సీఎం ప్రశ్నించారు. పెన్షన్ ఇచ్చి పెద్ద కొడుకుని అన్నాడు కేసీఆర్.. కానీ వాళ్లకు కూడా నెల నెల పెన్షన్ ఇవ్వలేదని పేర్కొన్నారు. ఓఆర్ఆర్ మేము సృష్టిస్తే.. వీళ్ళు అమ్ముకున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వైన్ షాప్ టెండర్ కూడా నాలుగు నెలల ముందు పిలిచాడని తెలిపారు. వచ్చేటోడు.. నిలబడే పరిస్థితి కూడా లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్తే సిగ్గు పోతుంది అంటున్నారు.. ఊరుకుంటే ప్రాణాలు పోతాయని ముఖ్యమంత్రి తెలిపారు. వెట్టిచాకిరి నిషేదించాం.. బీఆర్ఎస్ వాళ్లకు కూడా స్వేచ్ఛ ఇస్తున్నామని ఈ సందర్భంగా సభలో అన్నారు.
కలవరపెడుతున్న కరోనా కొత్త వేరియంట్.. వైద్యారోగ్య శాఖ మంత్రి వీడియో కాన్ఫరెన్స్
దేశంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా కొత్త వేరియంట్ JN -1 మహమ్మారి కట్టడిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని రాష్ట్రాల వైద్య, ఆరోగ్య శాఖ మంత్రులతో ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో తెలంగాణ వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కొత్త వేరియంట్ JN – 1 మహమ్మారి కట్టడి పై తీసుకుంటున్న ముందస్తు చర్యలను మంత్రి వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి , డైరెక్టర్ ఆఫ్ హెల్త్, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా.. ఇండియాలో కొత్త కోవిడ్ వేరియంట్ JN.1 కేసులు 21 నమోదయ్యాయి. ఎక్కువగా గోవాలో 19 కేసులు నమోదవ్వగా.. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో ఒక్కొక్కటి నమోదయ్యాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇటీవల కేరళలో JN.1 వేరియంట్ తొలి కేసు వెలుగులోకి వచ్చింది. ఈ వేరియంట్.. అత్యంత వేగం వ్యాప్తి చెందడంతో పాటు రోగనిరోధక వ్యవస్థను ఎదుర్కొంటోందని నిపుణులు చెబుతున్నారు.
కట్నం కోసం భార్య ముక్కు కొరికిన భర్త..
ఉత్తర్ ప్రదేశ్‌లో ఓ వ్యక్తి భార్యను కట్నం కోసం గత కొంత కాలంగా వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల కట్నం తీసుకురావాలని భార్య ముక్కును కొరికి తీవ్రంగా గాయపడిచారు. మహేష్ పూర్‌కి చెందిన అజ్మీ(22) తన భర్త కుటుంబానికి చెందిన ఆరుగురిపై సీబీ గంజ్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేసింది. అజ్మీ తన భర్త నజీమ్, బావ సాబీర్, కుటుంబ సభ్యులు రిహాన్, రుఖ్సర్, మాజిద్ హుస్సేన్, సయూద్ అహ్మద్‌లపై వరకట్న వేధింపుల కేసును నమోదు చేసింది. అజ్మీకి, నజీమ్‌తో ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. వీరికి ప్రస్తుతం 5 నెలల బాబు ఉన్నాడు. పెళ్లి తర్వాత అత్తింటి వారు అజ్మీని వేధించడం మొదలుపెట్టారు. తమకు అదనపు కట్నం తీసుకురావాలని మానసికంగా, శారీరకంగా వేధించారు. తన భర్త తనను చాలాసార్లు కొట్టాడని, ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడని, అయితే చాలా సందర్భాల్లో పంచాయతీల్లో రాజీ కుదురిందని బాధిత మహిళ అజ్మీ వెల్లడించారు. అయితే వరకట్నంపై తన భర్త హింసిస్తున్నాడని ఆరోపించింది. డిసెంబర్ 15న తన అత్తమామలు తనను కొట్టారని, ఆమె భర్త నజీమ్ ముక్కు కొరికి గాయపరిచాడని అజ్మీ ఆరోపించింది. ఈ కేసుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని బరేలీ నగర ఏఎస్పీ రాహుల్ భాటీ తెలిపారు.
“ఇండియా కూటమి సమావేశంలో సమోసాలు కూడా లేవు”.. కాంగ్రెస్‌పై ఎంపీ విమర్శలు..
జేడీయూ ఎంపీ సునీల్ కుమార్ పింటూ కాంగ్రెస్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి సమోసాలు ఏర్పాటు చేయడానికి కూడా డబ్బులు లేవని అన్నారు. ఢిల్లీ వేదికగా నిన్న కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఇండియా కూటమి సమావేశం జరిగింది. అయితే ఇంతకముందు కూటమి సమావేశాల్లో టీ, సమోసాలు ఉండేవని, అయితే నాలుగో సమావేశంలో మాత్రం టీ, బిస్కట్లకే పరిమితమైందని పింటూ అన్నారు. ‘‘నిన్నటి సమావేశంలో అనేక పార్టీల పెద్ద నాయకులు ఇండియా కూటమి సమావేశానికి వచ్చారు. అయితే దీనిపై ఎలాంటి చర్చ జరగలేదు. నిన్నటి సమావేశం టీ బిస్కెట్లకే పరిమితమైంది. ఎందుకంటే తమకు నిధుల కొరత ఉందని, రూ. 138, రూ. 1380, లేదా 13,800 విరాళాలు ఇవ్వాలని కాంగ్రెస్ ఇటీవల కోరింది. విరాళాలు ఇంకా రాలేదు. కాబట్టి నిన్నటి సమావేశంలో సమోసా లేకుండా కేవలం టీ, బిస్కెట్లతోనే ముగించింది. ఎటువంటి సమస్యపై ఎలాంటి చర్చ లేకుండా ముగిసింది’’ అని సునీల్ కుమార్ పింటు చెప్పారు. ప్రతిపక్షాలు ఇండియా కూటమి నాల్గో సమావేశం అసంపూర్తిగా మిగిలిపోయిందని అన్నారు. జేడీయూ ఎంపీ వ్యాఖ్యలపై బీజేపీ నేత అమిత్ మాలవీయా స్పందించారు. ‘‘ ఇండియా కూటమి సమావేశంలో సమోసా లేకపోవడంతో నితీష్ కుమార్ ఎంపీలు నిరాశకు గురయ్యారు. ఎలాంటి తీవ్రమైన అంశం చర్చకురాలేదని చెప్పారు. కూటమి ప్రధాని అభ్యర్థిగా నితీష్ కుమార్ ని ప్రకటించే వారు ఇలాంటి ఫిర్యాదులు కొనసాగుతూనే ఉంటాయి’’ అని అన్నారు.
బస్సులో ప్రయాణించిన వీధి కుక్క.. ఆకట్టుకుంటున్న వీడియో
బెంగళూరు బస్సులో ఆసక్తకిర సంఘటన చోటుచేసుకుంది. ఒక వీధి కుక్క బస్సులో ప్రయాణించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. ప్రియాణికులకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండ కొంతదూరం వరకు జాయ్ రైడ్ చేసిన ఆ కుక్కను చూసి నెటిజన్లు తెగ ముచ్చటపడుతున్నారు. వావ్ ఈ కుక్క ఎంత బాగుందో అంటూ జంతుప్రేమికులు మురిసిపోతున్నారు. కాగా మారతహళ్లి నుంచి ఇందిరానగర్‌కు వెళ్తున్న బీఎంటీసీ బస్సులోకి అనుకొకుండ ఒక కుక్క ఎక్కింది. మొదట దాన్ని చూసి ఆందోళన పడ్డారు. అయితే అది ఎవరిని ఏం అనకుండ సైలెంట్‌గా బస్సులో కూర్చోవడంతో ప్రయాణికలు కాస్తా ఊరట చెందారు. అంతేకాదు ఆ కుక్క ప్రయాణికుతో స్నేహపూర్వకంగా వ్యవహరించడంతో కొందరు దానితో ఆడుతూ ప్రేమ కురిపించారు. ఇదంత బస్సులో ఉన్న తమ కెమెరాలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అందుకే బెంగళూరు అంటే ఇష్టం అంటూ ఓ నెటిజన్ కామెంట్స్ చేయగా.. బెంగళూరు వాసులు జంతు ప్రేమికులని చెప్పడానికి ఇదే నిదర్శనం అని కొనియాడుతున్నారు.
సలార్ vs డుంకీ వివాదం.. స్పందించిన పీవీఆర్ సీఈవో
ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ డుంకీ సినిమా ఒకరోజు వ్యవధితో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. షారుక్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో ఈ డుంకీ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాని డిసెంబర్ 21వ తేదీ రిలీజ్ చేస్తున్నారు. అదే సమయంలో ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ సినిమాని ఒక రోజు గ్యాప్ తో 22వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. అయితే షారుక్ ఖాన్ తో పోలిస్తే ప్రభాస్ కి నార్త్ లో మార్కెట్ పెద్దగా లేదు. ఈ నేపథ్యంలో పూర్తిగా సలార్ సినిమాను డామినేట్ చేసేందుకు ఒక నిర్ణయం తీసుకుని నేషనల్ థియేటర్ చైన్లను బ్లాక్ చేసే పనిలో పడింది డుంకీ టీం. ఆయా సంస్థల ఆధ్వర్యంలో నడిచే సింగిల్ స్క్రీన్స్‌లో పూర్తిగా డుంకీ సినిమా ఆడే లాగా వారి మీద ప్రజర్ తీసుకొచ్చారు.. ఈ క్రమంలో సౌత్ మొత్తం మీద పివిఆర్ ఐనాక్స్ అదేవిధంగా మిరాజ్ సంస్థలకు చెందిన థియేటర్లలో సలార్ ఆడించేది లేదంటూ మేకర్స్ ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో పివిఆర్ సంస్థ సీఈవో చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సాధారణంగా నిర్మాతలకు తమకు మధ్య ఉన్న మేటర్ బయటకు రానివ్వకుండా చూసుకుంటాం కానీ ఈ విషయంలో అసలు తమ ఉద్దేశం ఏంటో బయటకు చెప్పాలని అనిపిస్తుందని ఆయన రాసుకొచ్చారు. సోషల్ మీడియాలో మీడియాలో పివిఆర్ ఐనాక్స్ సంస్థ ఈ రెండు సినిమాల విషయంలో వ్యాపారం సరిగా చేయడం లేదని, తప్పుడు ఉద్దేశంతో ముందుకు వెళుతుందనే వార్తలు చూశానని చెప్పుకొచ్చారు. అయితే తమకు అందరూ నిర్మాతలు ఒక్కటేనని ఒకరి మీద ఎక్కువ ప్రేమ ఉండడం లాంటివి ఏమీ ఉండవని చెప్పుకొచ్చారు. రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతున్న సమయంలో కొన్ని కమర్షియల్ విషయాలలో అన్ని అనుకున్నవి అనుకున్నట్టుగా జరగవు, అయితే ఇదేమీ మొదటిసారి కాదు అలా అని చివరి సారి కూడా కాదు త్వరలోనే ఈ అంశం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది, ఈలోపు మీరు అనవసరంగా కొత్త కొత్త స్టోరీలు పుట్టించవద్దు అంటూ ఆయన రాసుకొచ్చాడు
దేవర టీజర్ రిలీజ్ అయ్యేది అప్పుడేనా.. ?
ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యువసుధ ఆర్ట్స్ మరియు నందమూరి ఆర్ట్స్ బ్యానర్స్ పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. సైఫ్ ఆలీఖాన్ విలన్ గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క లీక్ కూడా లేకుండా చాలా పకడ్బందీగా షూటింగ్ చేస్తున్నారు మేకర్స్. ఇక ఎప్పుడెప్పుడు ఈ సినిమా నుంచి అప్డేట్ వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇంకోపక్క అప్డేట్ ఇవ్వమని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ట్రెండ్ కూడా చేస్తున్నారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. దేవర టీజర్ అప్డేట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. టీజర్ అంటే.. టీజర్ అని చెప్పలేం కానీ, సినిమా రేంజ్, క్వాలిటీ, జానర్ పరిచయం చేసే గ్లింప్స్ అని చెప్పుకొస్తున్నారు. అసలు శివ కొరటాల ఈ గ్లింప్స్ తోనే ప్రభంజనం సృష్టించబోతున్నాడని అంటున్నారు. ఎన్టీఆర్ ను ఫ్యాన్స్ ఎలా అయితే చూడాలనుకున్నారో .. అలానే దేవర కనిపించబోతున్నాడట. ఇక ఈ గ్లింప్స్ కొత్త సంవత్సరం గిఫ్ట్ గా ఉండబోతుందని తెలుస్తోంది. జనవరి 1 నుంచి సంక్రాంతి లోపు ఎప్పుడైనా ఈ గ్లింప్స్ ను రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పండగే అని చెప్పాలి. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ అవుతుంది. ఏప్రిల్ 5 న మొదటి భాగం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో ఎన్టీఆర్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.
బిగ్ బాస్ పరువు తీసిన ఏకైక మొనగాడు.. ?
బిగ్ బాస్.. రియాలిటీ షోగా బాలీవుడ్ లో మొదలై.. ఇప్పుడు అన్ని భాషల్లో విజయవంతంగా కొనసాగుతోంది. ఇక తెలుగులో ఈ షోకు ఎంత మంచి పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 1 మొదలయ్యింది. ఆ తరువాత నాని సెకండ్ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించగా.. మూడోవ సీజన్ నుంచి ఏడవ సీజన్ వరకు అక్కినేని నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరించాడు. ఇండస్ట్రీలో కొనసాగుతున్న సెలబ్రిటీలను.. ఒక ఇంటిలో ఉంచి వారి మధ్య గొడవలు పెట్టి.. గేమ్స్ పెట్టి.. వారిలో ఎవరు టైటిల్ విన్నరో ప్రేక్షకుల నిర్ణయానికి వదిలేస్తారు. ఇక ఇందుకోసం సదురు సెలబ్రిటీలు చాలా గట్టిగానే అందుకుంటున్నారు కూడా.. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. గత ఆరు సీజన్స్ లో జరగనవన్నీ ఈ ఏడవ సీజన్ లో జరిగాయి. బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా ఫుల్టా అని అనడంతోనే ఈ సీజన్ పై ఆసక్తి నెలకొంది. మొదటి నుంచి కూడా ఈ సీజన్ లో ఎన్నో కొత్త విషయాలు జరిగాయి. అవన్నీ పక్కన పెడితే.. రైతుబిడ్డగా ఇంట్లోకి వెళ్లిన పల్లవి ప్రశాంత్ విన్నర్ గా తిరిగి రావడం అభిమానులకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఒక కామన్ మ్యాన్ లా లోపలి వెళ్లి.. ఎంతో కష్టపడి విన్నర్ గా నిలిచాడు. ఇక బయటికి వస్తే.. అతనిని ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది రైతుబిడ్డలు బాగుపడతారు అనుకున్నారు. కానీ, ఈ రైతు బిడ్డ బయటకి రావడంతోనే నిజ స్వరూపం చూపించాడు. అమర్ దీప్ కారుపై దాడి, పోలీసులతో గొడవ.. స్టూడియో బయట జరిగిన ఘర్షణల్లో కంటెస్టెంట్స్ కార్లతో పాటు ఆర్టీసీ బస్సుల అద్దాలు కూడా పగులకొట్టారు. ఇక దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయమై పల్లవి ప్రశాంత్ స్పందించాడు. అవేమి తనకు తెలియదు అని చెప్పుకొచ్చాడు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు కొద్దిసేపటి క్రితమే ప్రశాంత్ ను అరెస్ట్ చేశారు.