NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

ప్రమాదాల నివారణకు ఫ్లైఓవర్లు క్లోజ్ చేస్తున్నాం.. డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు కొనసాగుతాయి!

న్యూ ఇయ‌ర్ వేడుక‌ల‌ నేపథ్యంలో ప్రమాదాల నివారణకు ఫ్లైఓవర్లు క్లోజ్ చేస్తున్నాం అని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఓఆర్ఆర్‌పై ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే వాహనాలు, హెవీ వెహికిల్స్‌ను అనుమతిస్తామని చెప్పారు. డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు కొనసాగుతాయని, పట్టుపడిన వారిపై కఠిన చర్యలు తప్పని రాచకొండ సీపీ హెచ్చరించారు. న్యూఇయర్‌ వేడుకల నేపథ్యంలో నగరంలోని మూడు కమిషనరేట్‌ పరిధిలో పోలీసులు ఆంక్షలు విధించారు. డిసెంబరు 31 రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఫ్లైఓవర్లను మూసివేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

రాచకొండ సీపీ సుధీర్ బాబు మాట్లాడుతూ… ‘ప్రమాదాల నివారణకు ఫ్లైఓవర్లు క్లోజ్ చేస్తున్నాం. 129 ఫాంహౌస్‌లు, 6 పబ్‌లు, 180 వరకు హోటల్స్ అండ్ రిసార్ట్స్ ఉన్నాయి. ఇప్పటికే వారికి అవసరమైన హెచ్చరికలు జారీ చేశాము. మహిళలకు అగౌరవం జరగకుండా చూడాలంటూ ఈవెంట్ నిర్వాహకులకు చెప్పాము. షీటీమ్స్ ఉంటాయి. మాజీ ప్రధాని మన్మోహన్ చనిపోయారు. సంతాపం దినాలు ఉన్నాయి కాబట్టి మా డిపార్ట్మెంట్ తరుపున ఎలాంటి కేక్ కటింగ్స్ ఉండవు. ఈ రోజు కొన్ని చిన్నచిన్న కేసుల్లో గంజాయి, పాపిస్ట్రా డ్రగ్ పట్టుకున్నాం. ఓఆర్‌ఆర్‌పై భారీ వాహనాలు, ఎయిర్‌పోర్టుకు వెళ్లే వాహనాలను మాత్రమే అనుమతిస్తాము’ అని తెలిపారు.

ప్రతి ఏడాది ఫీజు పెంచుకోవాలనుకోవడం సమంజసం కాదు: విద్యా కమిషన్ ఛైర్మన్

ప్రైవేట్ విద్యా సంస్థలను ఈ ప్రభుత్వం నియంత్రిస్తుందని విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళీ అన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రతి ఏడాది ఫీజు పెంచుకోవాలనుకోవడం సమంజసం కాదన్నారు. ఫీజుల నియంత్రణ కోసం చట్టం తీసుకురావాలని, ప్రభుత్వానికి తాము సిఫార్సు చేస్తున్నామని తెలిపారు. పిర్యాదులు స్వీకరణ పరిష్కారం కోసం అధికారాలతో కూడిన ఒక ప్రత్యెక వ్యవస్థ ఉండాలన్నారు. మాతృ భాష నేర్చుకోవాలి కానీ.. మాతృ భాషలోనే బోధన అంటే కరెక్ట్ కాదని ఆకునూరి మురళీ పేర్కొన్నారు.

‘ప్రైవేట్ విద్యా సంస్థలను ఈ ప్రభుత్వం నియంత్రిస్తుంది. ఫీజుల నియంత్రణ కోసం చట్టం తీసుకురావాలి. ఈ విషయమై ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్నాం. ప్రైవేట్ విద్యా సంస్థలను స్ట్రీమ్ లైన్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారు. ప్రైవేట్ స్కూల్స్ అసంబద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఒక స్కూల్లో అప్లికేషన్ ఫీజు రూ.4,500గా ఉంది. స్కూల్స్ సేల్స్ యాక్టివిటీ నుండి పూర్తిగా బయటకు రావాలి. ప్రభుత్వం ఆ వైపున చర్యలు తీసుకుంటుంది. పిర్యాదులు స్వీకరణ పరిష్కారం కోసం అధికారాలతో కూడిన ఒక ప్రత్యేక వ్యవస్థ ఉండాలి’ అని విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళీ అన్నారు.

గ్రామస్తులతో ముఖాముఖి.. సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు

పల్నాడు జిల్లా పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. యలమందలో లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి నేరుగా పెన్షన్లు అందించారు.. ఆ తర్వాత గ్రామస్తులతో ముఖాముఖి మాట్లాడిన సీఎం చంద్రబాబు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఒకప్పుడు ముఖ్యమంత్రి వస్తున్నారంటే పరదాలు కట్టేవారు.. ఆడంబరాలు చేసేవారు.. చుట్టుపక్కల చెట్లు కొట్టేసేవారు అని ఎద్దేవా చేశారు.. ఒక ప్రజా ప్రతినిధి వస్తున్నారంటే దానికి గుర్తుగా మొక్కలు నాటాలి.. చెట్లు కొట్టకూడదు అని సూచించారు.. నేను ప్రజల ముఖ్యమంత్రిగా.. మీ స్నేహితుడిగా.. మీ ముందుకు వచ్చాను.. ఈ స్థితిగతులు తెలుసుకోవటానికి వచ్చాను.. మీ కష్టాలను బాధను పంచుకోవడానికి వచ్చాను.. అధికారులతో మాట్లాడి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని, మీ మొహాల్లో ఆనందం చూడాలని వచ్చాను.. గత ప్రభుత్వంలో నవ్వటానికి కూడా, స్వేచ్ఛ లేని పరిస్థితి ఉండేది.. ఈ రాష్ట్రంలో ఏ ఇంటిలో కష్టం వచ్చినా ,వాళ్ళింట్లో నేను ఒక ప్రాణ స్నేహితుడిగా మారి వాళ్ళని కాపాడుకుంటాను.. భవిష్యత్తులో ఉపక్కర పరిస్థితులు వస్తే డ్రోన్ లు ఉపయోగించి, మీ ఇళ్ళకే మెడిసిన్స్ పంపించే విధంగా టెక్నాలజీని అభివృద్ధి చేశాం అన్నారు చంద్రబాబు..

ఏపీ హైకోర్టులో మాజీ మంత్రికి ఊరట..

ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి పేర్ని నానికి ఊరట లభించింది. తొందరపాటు చర్యలు వద్దని.. కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు పోలీసులకు ఆదేశం ఇచ్చింది. ఈ క్రమంలో.. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. రేషన్ బియ్యం మాయం కేసులో ఏ6గా పేర్ని నాని ఉన్నారు. దీంతో.. ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పేర్ని నాని లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఈ క్రమంలో.. విచారణ జరిపిన న్యాయస్థానం ఈ ఆదేశాలు ఇచ్చింది.

నల్గొండ ప్రజల దశాబ్దాల కల SLBC

నల్గొండ పార్లమెంట్ పరిధిలోని ఇరిగేషన్ ప్రాజెక్ట్ లపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ.. SLBC ప్రాజెక్ట్ 4 లక్షల ఎకరాలకు నీళ్లిచే ప్రాజెక్ట్ అని, SLBC, బ్రాహ్మణవెళ్ళాంల నాకు ప్రథమ ప్రాధాన్యమన్నారు. అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే కాంట్రాక్టర్లు పనిచేయరని, ⁠కాంట్రాక్టర్ పని చేయకపోతే మంత్రి గారికి చెప్పాలన్నారు మంత్రి కోమటిరెడ్డి. నల్గొండ ప్రజల దశబ్దాల కల SLBC అని ఆయన వ్యాఖ్యానించారు. దయచేసి అధికారులు కంటితుడుపు పనులు చేసే ప్రయత్నం చేయకండని ఆయన సూచించారు. సీరియస్ గా పని చేస్తే అనుకున్న సమయానికి ప్రాజెక్ట్ పూర్తి చేయొచ్చన్నారు. SLBC ఒక వరల్డ్ వండర్.. SLBC పూర్తయితే.. ప్రపంచమంతా వచ్చి చూస్తుందని, చాలా భాద్యత తో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు.

గత ప్రభుత్వం వ్యవస్థ మొత్తాన్ని సర్వనాశనం చేసింది.. నిధులన్నీ మింగేశారు

పల్నాడు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. యలమంద గ్రామంలో లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి నేరుగా పెన్షన్లు అందించారు. ఆ తర్వాత గ్రామస్తులతో ముఖాముఖి మాట్లాడిన సీఎం చంద్రబాబు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం వ్యవస్థ మొత్తాన్ని సర్వనాశనం చేసిందని ఆరోపించారు. కేంద్ర నిధులన్నీ మింగేశారు.. నిధులన్నీ పక్కదారి పట్టించారని తెలిపారు. మోడీ ప్రధాని అయిన తర్వాత ప్రతి ఇంటికి కులాయి ద్వారా నీరు ఇవ్వాలని ఏర్పాటు చేసిన స్కీము నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. ఆ స్కీం నిర్వహణకు డబ్బులు తెచ్చి పక్కదారి మళ్లించారు.. అనేక స్కీంల డబ్బు దారి మళ్ళిందని చంద్రబాబు తెలిపారు. తాను కష్టపడతానని.. సంపద సృష్టిస్తానని.. ఆ సృష్టించిన సంపాదన పేదవారికి అందిస్తానని చెప్పారు.

న్యూ ఇయర్‌ వినోదం.. కారాదు విషాదం..

టీజీఆర్‌టీసీ ఎండీ, సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. కొత్త సంవత్సరాన్ని శుభప్రదంగా, సురక్షితంగా ప్రారంభించేందుకు, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆయన చేసిన ఆహ్వానం ప్రజల్లో చైతన్యాన్ని పెంచే విధంగా ఉంది.

“కొత్త సంవత్సరం వేడుకలను మీ కుటుంబ సభ్యులతో మీ ఇళ్లలోనే జరుపుకోండి. ప్రమాదాల నుంచి దూరంగా, సంతోషకరంగా ఉండండి. గతంలో కొత్త సంవత్సరం వేడుకల పేరుతో జరిగిన విషాదాలను గుర్తుంచుకుని, అలాంటి దుస్థితులను పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి,” అని సజ్జనార్ స్పష్టంగా తెలియజేశారు.

విశేషంగా, మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాలను ప్రస్తావిస్తూ, “మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల ప్రాణనష్టానికి కారణం అవుతుందనే విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మీరే కాదు, ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం కలిగించే ఆచరణ ఇది. కనుక, న్యూ ఇయర్ వేడుకలలో బాధ్యతగా వ్యవహరించండి” అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తాం

నల్గొండ లోకసభ స్థానం పరిధిలోని నీటిపారుదల ప్రాజెక్టులపై జలసౌధలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ఇంజినీర్లు పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు. 2024 లో అందరికీ మంచి చేశాము.. 2025లో కూడా అలానే చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. ఆరు గ్యారెంటీలు అమలు చేశామని, స్వతంత్ర భారతదేశంలో కులగనన చేయడం మొదటి సారి అని ఆయన అన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని పేర్కొన్నారు. నీటిపారుదల శాఖ, పౌరసరఫరాల శాఖలో పూర్తి పారదర్శకత విధానాలను అమలు చేస్తున్నామని, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించేలా ప్రణాళికలను అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులకు పదోన్నతులు..

ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులకు పదోన్నతులు లభించాయి. సీనియర్ ఐఏఎస్ అధికారులు సురేష్ కుమార్, సాల్మన్ ఆరోక్య రాజ్‌లకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2000 బ్యాచ్‌కి చెందిన ఈ ఇద్దరు అధికారులకు ముఖ్య కార్యదర్శి హోదా కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పన శాఖ ముఖ్య కార్యదర్శిగా సురేష్ కుమార్ ను రీడిజిగ్నెట్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం డిప్యూటేషన్ పై సాల్మన్ ఆరోక్య రాజ్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నారు.

హైకోర్టులో ఫార్ములా కేసు సంబంధించిన ప్రశ్నలు ఇవే..

కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఏసీబీ తరుఫున AG సుదర్శన్‌ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. ఫార్ములా ఈ రేసింగ్‌ కేసులో కేటీఆర్‌ తరుఫున సుప్రీంకోర్టు సీనియర్‌ లాయర్‌ సిద్ధార్థ్‌ దవే వాదనలు వినిపించారు. కేటీఆర్ పైన నమోదైన సెక్షన్లు అతనికి వర్తించవు లాయర్‌ సిద్ధార్థ్‌ దవే కోర్టుకు తెలిపారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కోసం బదిలీ అయిన డబ్బు FEO కు చేరింది.. 55 కోట్ల బదిలీ లో ఎక్కడా అవినీతి జరగలేదని, ఎలక్షన్ కోడ్ కు ముందే ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ అగ్రిమెంట్ జరిగిందని.. దీనికి ఎన్నికల నిబంధనలు వర్తించవు
కేటీఆర్‌ తరుపు లాయర్‌ కోర్టుకు తెలిపారు. పాలసీ నిర్ణయాలకు మాత్రమే ఎన్నికల నిబంధనలు వర్తిస్తాయని కోర్టుకు తెలిపారు లాయర్‌. ఈ కేసులో కేటీఆర్ A1 గా చేర్చినప్పుడు FEO ను ఎందుకు నిందితుల జాబితాలో చేర్చలేదని సిద్ధార్థ్‌ దవే ప్రశ్నించారు.

 

Show comments