NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

సౌత్ కొరియా తీరం వద్ద కూలిన అమెరికా యుద్ధ విమానం..

ద‌క్షిణ కొరియా తీరంలో అమెరికా యుద్ధ విమానం ఎఫ్‌-16 కూలింది. అయితే ఈ ప్రమాదం నుంచి ఆ విమాన పైలెట్ సేఫ్ గా బ‌య‌ట‌ ప‌డ్డారు. కేవ‌లం నెలన్నర సమయంలో కొరియా తీరంలో ఎఫ్‌-16 యుద్ధ విమానం కూల‌డం ఇది సెకండ్ టైమ్. గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో కూడా ఓ యుద్ధ విమానం కూడా ఇక్కడే కూలిపోయింది. 8వ ఫైట‌ర్ వింగ్‌కు చెందిన ఎఫ్‌-16 ఫైటింగ్ ఫాల్కన్ గాలిలో ఉన్నప్పుడు ఎమర్జెన్సీకి లోనైంది.. ఆ తర్వాత ఆ విమానం సముద్రంలో కూలినట్లు అమెరికా వైమానిక దళం ఓ ప్రకటనలో వెల్లడించింది.

ప్రజల్లో చైతన్యం రావాలి.. ప్రత్యేక హోదా కోసం పోరాడాలి..

ప్రజలలో చైతన్యం రావాలి.. ఏపీకి ప్రత్యేక హోదా విషయం పోరాడాలి అని పిలుపునిచ్చారు జై భారత్‌ పార్టీ నేత, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాణ.. శ్రీకాకుళంలో ఆయన మాట్లాడుతూ.. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్ పాస్ కాకుండా చూడాలి‌.. బడ్జెట్‌ను స్తంభింపజేస్తే కేంద్రం ఆలోచిస్తుందన్నారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా సాధించేందుకు అనేక అవకాశాలు వచ్చాయి.. 2019 నుంచి ప్రతిసారీ రాష్ర్టానికి చెందిన ఉభయపార్టీలు.. ఎన్టీఏకు మద్దతు పలికారు. అడకముందే మద్దతు తెలుపుతున్నారు. ప్రత్యేక హాదాపై టీడీపీ, వైసీపీకి చిత్తశుద్ది లేదని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదు.. ముగించిన హామీగా పేర్కొన్నారు. హోదా వద్దు ప్యాకేజీనే ముద్దు అని టీడీపీ, జనసేన నేతలు మాట్లాడారని దుయ్యబట్టారు.

భగవంతుడు కూడా నిన్ను క్షమించడు.. ఎక్కడ పోటీ చేసినా నీకు డిపాజిట్ కూడా రాదు..!

ఏపీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి.. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్తు రాజుపాలెంలో నిర్వహించిన వైయస్సార్ ఆసరా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో చేరి షర్మిల చేస్తున్న ద్రోహానికి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి ఆత్మ ఘోషిస్తుందన్నారు. తన కన్న తండ్రి పై కేసులు నమోదు చేసి.. అన్నను 16 నెలలు జైలుకు పంపిన పార్టీతో షర్మిల చేతులు కలపడం సిగ్గుచేటని మండిపడ్డారు. నీ అన్నని ఓడించాలని.. నీవు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపావు.. భగవంతుడు కూడా నిన్ను క్షమించడని వ్యాఖ్యానించారు. షర్మిలమ్మ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాదని జోస్యం చెప్పారు. అంతేకాదు.. నువ్వు ఎక్కడ పోటీ చేసినా నీకు కూడా డిపాజిట్ కూడా రాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల చేసిన దుర్మార్గానికి స్వర్గంలో ఉన్న రాజశేఖర్ రెడ్డి కూడా కంటతడి పెట్టుకుంటాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, పదేళ్లు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఐదేళ్లు నూతన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని దుయ్యబట్టారు కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి.

మాల్దాలో రాహుల్ గాంధీ కారుపై దాడి..

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడ్ న్యాయ్ యాత్ర బిహార్ రాష్ట్రం నుంచి ఇటీవలే పశ్చిమ్ బెంగాల్‌లోకి అడుగు పెట్టింది. షెడ్యూల్‌లో ప్రకారం ఇవాళ మధ్యాహ్నం మాల్దాకు చేరకున్న జోడో యాత్రలో భద్రతా లోపం కొట్టొచ్చినట్లుగా కనిపించింది. అయితే, ర్యాలీ సందర్భంగా కొందరు దుండగులు రాహుల్ గాంధీ కారుపై వెనక నుంచి దాడికి తెగబడ్డారు. ఈ క్రమంలో అక్కడున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా భయాందోళనకు గురి అయ్యారు. ఇక, రాహుల్ గాంధీ వ్యక్తిగత సిబ్బంది తేరుకునే లోపే ఈ దాడి జరిగిందని స్థానికులు తెలిపారు.

ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు ఊహించుకుంటున్నారు.. నేను పార్టీ మారను..

ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు ఊహించుకుని రాసుకుంటున్నారు. నేను పార్టీ మారుతున్నానని చేస్తున్న ప్రచారం అవాస్తవం అని కొట్టిపారేశారు మాజీ మంత్రి, వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌రెడ్డి.. అసలు నేను ఏ మీడియాతో మాట్లాడలేదన్నారాయన.. ఒంగోలులో 25 వేల మంది పేదలకు పట్టాలు పంపిణీ చేయాలనేది నా ఆశ అన్నారు.. ఎంపీ సీటు విషయంలో అన్ని నియోజకవర్గాల అభ్యర్థులకు బాగుంటుందనే మాగుంట శ్రీనివాసుల రెడ్డి కోసం ప్రయత్నం చేశా.. మిగతా నియోజకవర్గాల ఇంఛార్జీలు, ఎమ్మెల్యేలు పట్టీపట్టనట్లున్నారు.. అధిష్టానం దృష్టిలో నేను ఒక్కడినే ప్రశ్నించినట్లవుతోంది.. నేను అందరి శ్రేయస్సు కోసం అడుగుతున్నా.. మిగతావాళ్లకు పట్టనప్పుడు నాకు మాత్రం ఎందుకు..? అని ప్రశ్నించారు. తాను అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.

ఆసక్తికరంగా హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న సినిమా “ది గోట్ లైఫ్” పోస్టర్..

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న సినిమా “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం). హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ ఫేమస్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ చేతుల మీదుగా “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) బిగినింగ్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు టీమ్. మూవీ బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా ఈ సినిమాను అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించారు. విజువల్ రొమాన్స్ బ్యానర్ “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమాను మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఏప్రిల్ 10న “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.

చంద్రబాబుకు కొడాలి కౌంటర్‌.. ఇప్పుడు చేసేదేమీ లేదు..!

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ఆరోపణలు, విమర్శలు.. నేతల మధ్య మాటల తూటాలు పేల్చుతున్నాయి.. ఇక, తాను తలుపులు తెరిస్తే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఖాళీ అవుతుందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. చంద్రబాబుకు మతిభ్రమించి తమ పార్టీలో జరుగుతోన్న సీట్ల వ్యవహారంపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 2019లోనే ఏపీ ప్రజలు చంద్రబాబు తలుపులు, కిటికీలు పీకి.. హైదరాబాద్‌కు పార్సిల్‌ చేశారని ఎద్దేవా చేశారు..

మేడిపల్లి పీఎస్ ముందు మహిళా కానిస్టేబుల్ ఆందోళన..

రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ ముందు హైదరాబాద్ కమిషనరేట్ కానిస్టేబుల్ నాగమణి ఆందోళనకు దిగింది. తన భర్త వరుణ్ పై ల్యాండ్ తగాదా విషయంలో తప్పుడు ఎంఎల్సీ సర్టిఫికేట్ సృష్టించి రిమాండ్ కు తరలించేందుకు మేడిపల్లి ఎస్ఐ శివకుమార్ ప్రయత్నం చేస్తున్నారని తెలిపింది. ఎస్ఐ శివకుమార్ పై గతంలో సీపీకి, డీసీపీ కంప్లైంట్ చేయడంతో తమపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. తన దగ్గర వీడియో ఆధారాలు ఉన్నాయి.. మా పిటిషన్ ను పరిశీలించకుండానే మాపై తప్పుడు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించేందుకు ఎస్ఐ ట్రై చేస్తున్నారని మహిళా కానిస్టేబుల్ నాగమణి ఆవేదన వ్యక్తం చేసింది.

దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు .. ఆ రాష్ట్రాలకు అలెర్ట్..

భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.. గడిచిన 24 గంటల్లో 133 కోవిడ్ కేసులు పెరిగాయి, అయితే యాక్టివ్ కేసుల సంఖ్య 1,389 గా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది.. ఉదయం 8 గంటలకు నవీకరించబడిన మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, 24 గంటల్లో రెండు మరణాలు – గుజరాత్ మరియు మహారాష్ట్ర నుండి ఒక్కొక్కటి – నివేదించబడ్డాయి.. ఈ రాష్ట్రాల ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు..

డిసెంబరు 5 వరకు రోజువారీ కేసుల సంఖ్య రెండంకెలకు పడిపోయింది, అయితే కొత్త వైవిధ్యం మరియు శీతల వాతావరణ పరిస్థితుల ఆవిర్భావం తర్వాత కేసులు పెరగడం ప్రారంభించాయి.. డిసెంబరు 5 తర్వాత, డిసెంబర్ 31, 2023న గరిష్టంగా 841 కొత్త కేసులు ఒక్క రోజులో నమోదయ్యాయి, ఇది మే 2021లో నమోదైన గరిష్ట కేసుల్లో 0.2 శాతం అని అధికారిక వర్గాలు తెలిపాయి. మొత్తం యాక్టివ్ కేసుల్లో ఎక్కువ శాతం (సుమారు 92 శాతం) హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నాయని వారు తెలిపారు.


కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. వచ్చే వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్

సీఎం జగన్‌ అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్‌ సమావేశం జరిగింది. పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం. వచ్చే నెల 16వ తేదీ నుంచి రెండు వారాల పాటు చేయూత పథకం నాలుగో విడత చెల్లింపులు జరుపుతామని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. 6100 పోస్టులతో మెగా డీఎస్సీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని.. వచ్చే వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందని ఆయన వెల్లడించారు. నిరుద్యోగులకు ఈ కేబినెట్ శుభవార్త అందిస్తుందన్నారు. ఇక టీచర్ పోస్టులేవీ ఖాళీ లేవని.. ఈ మెగా డీఎస్సీ నోటిఫికేషనుతో ఖాళీలన్నీ భర్తీ అయిపోతాయన్నారు.

చిత్తడి నేలలను పరిరక్షించుకోకపోతే భవిష్యత్ తరాలకు ప్రమాదం

జీవ వైవిధ్యానికి ఆలవాలంగా నిలిచే చిత్తడి నేలలను పరిరక్షించుకోకపోతే భవిష్యత్ తరాలు ప్రమాదంలో పడతాయని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. చిత్తడి నేలల పరిరక్షణకు సమర్థవంతమైన కార్యాచరణను అమలుచేయాల్సిన అత్యవసర పరిస్థితి నెలకొందని అన్నారు. తెలంగాణలోని చిత్తడి నేలల పరిరక్షణ, చిత్తడి నేలలను గుర్తింపు తదితర అంశాలకు సంబంధించి బుధవారం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో స్టేట్ వెట్ ల్యాండ్స్ అథారిటీ ఛైర్మన్ కొండా సురేఖ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. అటవీ, పర్యావరణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీ ప్రసాద్, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, పిసిసిఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్, అటవీ, పర్యావరణ శాఖ అడిషనల్ సెక్రటరీ, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మెడికల్ ప్లాంట్ బోర్డ్ సోని బాల దేవి తదితర ఉన్నతాధికారులతో పాటు అటవీ, పర్యావరణం, నీటిపారుదల, పంచాయతీ రాజ్, రెవెన్యూ, ఫిషరీస్, టూరిజం శాఖలకు చెందిన పలువురు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

చిత్తడి నేలలను పరిరక్షించుకోకపోతే భవిష్యత్ తరాలకు ప్రమాదం

జీవ వైవిధ్యానికి ఆలవాలంగా నిలిచే చిత్తడి నేలలను పరిరక్షించుకోకపోతే భవిష్యత్ తరాలు ప్రమాదంలో పడతాయని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. చిత్తడి నేలల పరిరక్షణకు సమర్థవంతమైన కార్యాచరణను అమలుచేయాల్సిన అత్యవసర పరిస్థితి నెలకొందని అన్నారు. తెలంగాణలోని చిత్తడి నేలల పరిరక్షణ, చిత్తడి నేలలను గుర్తింపు తదితర అంశాలకు సంబంధించి బుధవారం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో స్టేట్ వెట్ ల్యాండ్స్ అథారిటీ ఛైర్మన్ కొండా సురేఖ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. అటవీ, పర్యావరణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీ ప్రసాద్, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, పిసిసిఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్, అటవీ, పర్యావరణ శాఖ అడిషనల్ సెక్రటరీ, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మెడికల్ ప్లాంట్ బోర్డ్ సోని బాల దేవి తదితర ఉన్నతాధికారులతో పాటు అటవీ, పర్యావరణం, నీటిపారుదల, పంచాయతీ రాజ్, రెవెన్యూ, ఫిషరీస్, టూరిజం శాఖలకు చెందిన పలువురు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

మొరాయిస్తున్న సర్వర్లు.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ సేవలు

ఏపీలో రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సాంకేతిక సమస్యలు నెలకొనడంతో రిజిస్ట్రేషన్‌ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. సర్వర్లు రెండు రోజులుగా మొరాయిస్తుండడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. కాసేపు రిజిస్ట్రేషన్లు జరిగితే కాసేపు నిలిచి పోతున్నాయి. అప్లికేషన్ ఓపెన్ అవకపోవటంతో ప్రక్రియ ముందుకు కదలడం లేదు. తాజాగా ఇవాళ సర్వర్లు పూర్తిగా షట్‌డౌన్‌ అయ్యాయి. సర్వర్లు షట్‌డౌన్‌ కావడంతో రిజిస్ట్రేషన్‌ సేవలకు అంతరాయం కలిగింది. రిజిస్ట్రేషన్లు ఆగిపోవడంతో వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు.