NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

పోలవరంపై చంద్రబాబుకు మాత్రమే అవగాహన ఉంది..

చంద్రబాబు నాయుడుకు మాత్రమే పోలవరం ప్రాజెక్టు గురించి మొత్తం తెలుసని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ అన్నారు. ప్రాజెక్ట్ ఎక్కడ దెబ్బతిందో తెలిస్తే ఒక అవగాహన వస్తుందని పేర్కొన్నారు. డిసెంబర్ నుంచి పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభం అవుతున్నాయని తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తిచేసి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు ప్రాజెక్ట్ ఉపయోగపడుతుందన్నారు. వైయస్సార్సీపి ప్రభుత్వంలో ప్రాజెక్టు పూర్తిగా వైఫల్యం జరిగిందని ఆరోపించారు. ఇప్పుడు తప్పుడు కథనాలతో కొన్ని చానల్స్ అసత్యాలు ప్రచారం చేస్తున్నాయన్నారు.

నిరుద్యోగుల సమస్యలపై అసెంబ్లీని స్తంభింపజేస్తాం..

తాజాగా బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్నికి చీమ కుట్టినట్టు లేదని., బిఆర్ఎస్ పక్షాన దీక్ష విరమణ చేయమని మోతిలాల్ ని కోరడం జరిగిందని ఆయన అన్నారు. ఇది నా ఒక్కడి సమస్య కాదు. రాష్ట్రంలోని నిరుద్యోగులు సమస్య ఇది అన్నారు. మీ తల్లితండ్రులు బాధపడుతున్నారు, ప్రాణం ముఖ్యం అన్నాము. అయినా కూడా దీక్ష విరమణ చేయటం లేదు. ప్రభుత్వం మొద్దునిద్ర పోతుంది. కాంగ్రెస్ ఎన్నికలు ముందు హామీలు ఇచ్చి తప్పించుకుంది. ఇప్పుడు నిరుద్యోగులు గుండెలు మీద తంతున్నారు. రాహుల్ గాంధీని అశోక్ నగర్ పిలిపించి హామీ ఇప్పించారు. రాహుల్ గాంధీ మాట ఇచ్చారు. రెండు లక్షలు ఉద్యోగాలు నింపుతాము అన్నారు. ఎపి లో 1:100 సాధ్యమైనప్పుడు ఇక్కడ ఎందుకు సాధ్యం కాదని ఆయన అన్నారు.

‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రసంగం..లోక్ సభ ఎన్నికల ప్రస్తావన

‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమం ప్రారంభంలో ఆయన ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలను ప్రస్తావించారు. మన రాజ్యాంగం, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలపై తమకున్న అచంచల విశ్వాసాన్ని పునరుద్ఘాటించినందుకు ఈరోజు దేశప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాని.. 2024 ఎన్నికలు ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలు.. ఇంత పెద్ద ఎన్నికలు ఏ దేశంలోనూ జరగలేదన్నారు.

విద్యార్థుల సంఖ్య‌కు అనుగుణంగా ఉపాధ్యాయుల బ‌దిలీలు…

పాఠశాల విద్యా బోధ‌న‌లో నాణ్య‌తా ప్ర‌మాణాలు పెంచేలా ఉపాధ్యాయ బ‌దిలీల ప్ర‌క్రియ‌కు రూప‌క‌ల్ప‌న‌ చేస్తోంది. ఇందులో భాగంగా 0 – 19 వ‌ర‌కు విద్యార్థులున్న పాఠ‌శాల‌కు ఒక‌రు, 20 నుంచి 60 మంది విద్యార్థులున్న పాఠ‌శాల‌కు ఇద్ద‌రు, 61 నుంచి 90 వ‌ర‌కు విద్యార్థులున్న పాఠ‌శాల‌కు ముగ్గురు ఉపాధ్యాయులు ఉండేలా గ‌త ప్ర‌భుత్వం 2015, జూన్‌, 27న జీవో నెం: 17, 2021, ఆగ‌స్టు 21న జీవో నెం: 25 జారీ చేసింది. విద్యార్థుల సంఖ్య‌, వారికి మెరుగైన విద్యా బోధ‌నను దృష్టిలో ఉంచుకొని తాజాగా ఆయా పాఠ‌శాల‌ల‌కు పోస్టుల‌కు కేటాయింపు చెయాయనున్నారు. 1-10 మంది విద్యార్థులున్న పాఠశాల‌కు ఒక‌టి, 11 నుంచి 40 వ‌ర‌కు విద్యార్థులున్న పాఠ‌శాల‌కు రెండు, 41 నుంచి 60 మంది విద్యార్థులున్న పాఠ‌శాల‌కు మూడు, 61పైన విద్యార్థులున్న పాఠశాల‌కు ఆ పాఠ‌శాల‌కు మంజూరైన అన్ని పోస్టులు భ‌ర్తీ చేసేలా వెబ్ ఆప్ష‌న్ల కేటాయింపు ఇవ్వనట్లు సమాచారం.

ఏపీలోని అల్లూరి సీతా రామరాజు జిల్లాలో పండించే అరకు కాఫీకి ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్..

భారత్‌లో తయారైన ఉత్పత్తుల గురించి ప్రధాని మోడీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రస్తావించారు. భారతదేశానికి చెందిన అనేక ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. భారత్‌కు చెందిన ఏదైనా స్థానిక ఉత్పత్తి ప్రపంచవ్యాప్తం మంచి ఆదరణ పొందినప్పుడు గర్వంగా అనిపిస్తుంది. అటువంటి ఉత్పత్తుల్లో అరకు కాఫీ, ఇది ఆంధ్ర ప్రదేశ్‌లోని అల్లూరి సీతా రామరాజు జిల్లాలో అధిక పరిమాణంలో ఉత్పత్తి చేయబడుతుంది. ఇది గొప్ప రుచి, సువాసనకు ప్రసిద్ధి చెందింది. స్థానిక ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తం చేయడంలో జమ్మూ కాశ్మీర్ ప్రజలు కూడా ముందున్నారు. జమ్మూ కాశ్మీర్‌లో గత నెలలో చేసిన పనులు దేశ వ్యాప్తంగా ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. పుల్వామా నుంచి తొలి స్నో పీస్‌ను లండన్‌కు పంపారు. గత దశాబ్దంలో భారతదేశంలో అపూర్వమైన అటవీ విస్తీర్ణం పెరిగింది. అమృత్ మహోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఏడు వేలకు పైగా అమృత్ సరోవర్లను కూడా నిర్మించారు. అమ్మ పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి.” అని మోడీ వ్యాఖ్యానించారు.

“విద్యుత్‌ను ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారు.” మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

విద్యుత్ బిల్లుల వసూలు ప్రైవేట్ కంపెనీకి అప్పగిస్తున్నామని సీఎం రేవంత్ అన్నట్టుగా తెలుస్తుందని..ప్రభుత్వం అధికారికంగా ఈ అంశంపై స్పందించలేద మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. విద్యుత్ బిల్లుల వసూలు ఆదానికి అప్పగింతకు రేవంత్ సర్కార్ సిద్ధం అయినట్టు కనిపిస్తుందన్నారు. విద్యుత్ బిల్లుల వసూలు ఓల్డ్ సిటీ తో ఆగదు..రాష్ట్రం అంతా ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్ళడం ఖాయమని ఆరోపించారు. ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు డబ్బుల వసూలుకు ఏం చేస్తున్నారో అందరికీ తెలుసన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. “తెలంగాణ లో విద్యుత్ రంగం ను ప్రైవేట్ కి అప్పగించడం లో ఇది మొదటి మెట్టు. ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళితే పేదవారికి, రైతులకు విద్యుత్ సబ్సిడీ ఉండవు. ఉచిత విద్యుత్ ఉండదు. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని ఒత్తిడులు వచ్చాయి.. కానీ కేసీఆర్ నో అన్నారు. ఎంత పెద్దవాళ్ళ నుంచి ఒత్తిడి వచ్చిన రాజీ పడలేదు.” అని వ్యాఖ్యానించారు.

మహిళలకు ఉచిత బస్ హామీ కొంచెం లేటైనా నెరువేర్చుతాం..

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్ హామీ కొంచెం లేటైనా నెరువేర్చుతామని రాష్ట్ర రవాణా, క్రీడల శాఖా మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో క్షుణ్ణంగా పరిశీలించి ఏపీలో అమలు చేస్తామని వెల్లడించారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం విశాఖ నుంచే ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. మేము కక్ష సాధింపులకి పోమని మంత్రి పేర్కొన్నారు. పెద్దిరెడ్డి కుటుంబం మైనింగ్, ఇసుక అన్ని రంగాల్లో అవినీతి చేశారని.. కూలీ కుటుంబం నుండి వచ్చిన పెద్దిరెడ్డి ఇప్పుడు రాయలసీమను శాసించే స్థాయికి ఎదిగేంత అవినీతి చేశారని ఆయన ఆరోపించారు. జగన్ హయాంలో మంత్రులలాగా గంగిరెద్దుల్లా తలవూపుకుంటూ మేము పని చెయ్యమని.. మంత్రులకు చంద్రబాబు పూర్తి స్వేచ్చ ఇచ్చారన్నారు. రాబోయే రోజుల్లో ప్రజా సొమ్ము తిన్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు తూట్లు పొడుస్తోంది

హైదరాబాద్‌ బంజారా లెక్ వ్యూ లో మన్ కీ బాత్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు తూట్లు పొడుస్తోందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోందని, ఇతర పార్టీల నుంచి గెలిచిన వారిని చట్టాలకు పాతర వేసి కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారన్నారు. ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ మోసపూరిత పార్టీలు.. రెండు పార్టీలు దొందూ దొందే అని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే పరిస్థితి లేదు, బీఆర్‌ఎస్‌ బాటలోనే కాంగ్రెస్ నడుస్తుందని ఆయన అన్నారు. ప్రతినెలా చివరి ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ గత పదేళ్లుగా మన్ కీ బాత్ నిర్వహిస్తున్నారని, అనేక సామాజిక సమస్యల మీద మోడీ మాట్లాడుతున్నారని ఆయన తెలిపారు. అమ్మను మించిన దైవం లేదు.. అమ్మ పేరు మీద ఒక మొక్కను పెట్టాలని మోడీ పిలుపునిచ్చారని, ప్రతి ఒక్కరూ ఒక మొక్కను పెట్టి భూమిని కాపాడాలని పిలుపు అని ఆయన అన్నారు.

ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ

రాష్ట్రంలో యువత, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి టీ హరీశ్‌రావు ఆదివారం నాడు రాష్ట్ర శాసనసభ సమావేశాల ప్రక్రియను ప్రారంభించారు. రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్యలపై ఒత్తిడి తేవాలి. నిరుద్యోగ యువత, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారి నిజమైన డిమాండ్ల కోసం గాంధీ ఆస్పత్రిలో నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్‌ను పార్టీ విద్యార్థి నాయకులతో కలిసి ఆయన పరామర్శించారు. నిరాహార దీక్ష చేస్తున్న నాయకుడి ఆరోగ్యం క్షీణించడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నాయక్‌ను ప్రత్యక్షంగా సందర్శించి నిరుద్యోగ యువత సమస్యలపై ఆయనతో చర్చలు జరిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమయం కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేలా నిరుద్యోగుల పక్షాన బీఆర్ ఎస్ పోరాటం చేస్తుందన్నారు. వారం రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న నాయక్‌కు నిరసనను విరమించాలని విజ్ఞప్తి చేస్తూ, నిరుద్యోగుల డిమాండ్ల సాధనకు బీఆర్‌ఎస్ తరపున పోరాటానికి సంఘీభావం తెలిపారు.