పండుగ పూట విషాదం.. వ్యవసాయ కళాశాలలో విద్యార్థిని సూసైడ్!
వరంగల్ నగరంలో మహా శివరాత్రి పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. ములుగు రోడ్డులోని పైడిపల్లి వద్ద ఉన్న వ్యవసాయ కళాశాలలో అగ్రికల్చరల్ బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్న రేష్మిత (20) ఆత్మహత్య చేసుకుంది. రేష్మిత ఈరోజు ఉదయం నుంచి రూములో నుండి బయటకు రాకపోవడంతో కాలేజి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చింది. రేష్మిత ఉంటున్న గది వెంటిలేటర్ నుండి పరిశీలించిన పోలీసులు.. ఆమె ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. నల్లగొండ జిల్లాలో ఉంటున్న రేష్మిత కుటుంబ సభ్యులకు పోలీసులు, కాలేజీ సిబ్బంది సమాచారం ఇచ్చారు. తాము వచ్చే వరకు గది తలుపులు తెరవద్దని పోలీసులను కుటుంబ సభ్యులు కోరారు. కుటుంబ సభ్యుల సూచన సూచన మేరకు పోలీసులు గది తలుపులు తెరవలేదు. ఏనుమాముల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని ఆత్మహత్యకు వ్యక్తిగత కారణమని తెలుస్తుంది. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి అనుబంధంగా ఈ వ్యవసాయ కళాశాల నిర్వహిస్తున్నారు.
యాగంటికి భక్తుల తాకిడి.. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రత్యేక పూజలు..
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి అమ్మ వార్లకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.. ఇందిరమ్మ దంపతులు దర్శించుకున్నారు.. యాగంటి ఆలయ క్షేత్రానికి చేరుకున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి – ఇందిరమ్మ దంపతులకు ఆలయం మర్యాదలతో అర్చకులు స్వాగతం పలికారు, ఆలయ సంప్రదాయబద్ధంగా తలపాగా ధరించిన మంత్రి స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను భక్తిశ్రద్ధలతో తలపై ఉంచుకొని ఉమా మహేశ్వర స్వామి వారి సన్నిధికి చేరుకున్నారు.. ఏకశిలపై కొలువున్న ఉమామహేశ్వరులకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతులు విశేష అభిషేక ప్రత్యేక పూజలను నిర్వహించారు, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా, ఉదయం 5 గంటల నుండి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, కుంకుమార్చన, సహస్రనామావళి, వంటి విశేష పూజలను, వేద పండితుల మంత్రోచ్ఛారణాలతో ఆలయ అర్చకులు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు, నేటి అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భావ కాల ప్రత్యేక పూజలను నిర్వహించనున్నారు.
రాజన్న మోస్ట్ పవర్ ఫుల్.. దేశ ప్రజలు వేములవాడకి వెళ్లాలనుకుంటున్నారు: బండి సంజయ్
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కోడె మొక్కులు సమర్పించుకుని.. రాజన్న దర్శనం చేసుకుంటున్నారు. శివరాత్రి సందర్భంగా రాజన్న ఆలయాన్ని కేంద్ర హోంశాఖ సహయ మంత్రి బండి సంజయ్ సందర్శించారు. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి దర్శనం చేసుకున్నారు.
రాజన్న దర్శనం అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ… ‘మహా శివరాత్రి సందర్భంగా రాజన్నను దర్శనం చేసుకున్నా. దక్షిణ కాశీగా పిలువబడే రాజన్న ఆలయానికి వివిధ రాష్ట్రాలు, దేశాల నుండి కూడా భక్తులు వస్తున్నారు. రాజన్న ఆలయం మోస్ట్ పవర్ ఫుల్. దేశ ప్రధాని వేములవాడ రాజన్నను దర్శనం చేసుకున్నారు. అప్పటి నుండి దేశ వ్యాప్తంగా ఒక చర్చ కొనసాగుతుంది. ప్రధాని దర్శనం నుండి దేశ ప్రజలు కూడా వేములవాడకి వెళ్లానుకుంటున్నారు. మహా శివరాత్రి ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఈఓ, సిబ్బంది, సేవ సంస్థలను అభినందిస్తున్నాను. ఇదే స్పూర్తితో చివరివరకు భక్తులకు సౌకర్యాలు కొనసాగించాలి’ అని సూచించారు.
20 ఏళ్లుగా దర్శించుకుంటున్నా.. ఈ దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తాం!
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలో మహా శివరాత్రి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ శ్రీ స్వయంభూ రాజేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించి.. ప్రత్యేక పూజలు చేశారు. తెలుగు ప్రజలు అందరూ క్షేమంగా ఉండాలని శివపార్వతులను కోరుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వరత్వరగా క్యూ లైన్‌లలో దర్శనానికి పంపించాలని అధికారులకు సూచించారు. మంత్రి పొన్నం ఆలయంలోని భక్తులతో ముచ్చటించి.. అక్కడే ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్‌లో హెల్త్ చెకప్ చెపించుకున్నారు.
బంగారం కోసం వృద్ధురాలి హత్య.. ఇంట్లోనే ఉన్న బావిలో పడేసిన నిందితులు
డబ్బు, బంగారం కోసం దుండగులు ఎంతటి దానికైనా తెగిస్తున్నారు. వృద్ధులు, పెద్దలు, చిన్న పిల్లలు అని తేడా లేకుండా చంపేస్తున్నారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. తాజాగా.. బంగారం కోసం ఓ వృద్ధురాలిని హత్య చేసిన ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండలం కోట్ మర్పల్లి గ్రామంలో మూడు రోజుల క్రితం ఓ వృద్ధురాలిని అదే గ్రామానికి చెందిన కొందరు దుండగులు హత మార్చారు. అర్ధరాత్రి సమయంలో వినోద అనే వృద్ధురాలిని చంపేసి.. ఆమె ఇంట్లోనే ఉన్న బావిలో పడేశారు. అదే గ్రామానికి చెందిన రాజు, నర్సింలు, షఫీయుద్దీన్ ఈ ముగ్గురు కలిసి అర్ధరాత్రి ఇంట్లో చొరబడి బీరువాలో ఉన్న బంగారం.. 21,000 నగదు ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో వృద్ధురాలు నిద్రలో నుంచి లేచి ఆ ముగ్గురిని చూసి అరిచింది. తాము చోరీ చేసిన విషయాలు బయటకు చెప్తుందని భావించి ముగ్గురు కలిసి వృద్ధురాలిని చంపేసి ఇంట్లోనే ఉన్న బావిలో గుర్తు పట్టకుండా పడేశారు. అంతేకాకుండా.. వారి ఆనవాళ్లు తెలియకూడదని ఇంట్లో ఉన్న బీరువాను తగలబెట్టేశారు.
తమిళనాడు ఒక్క పార్లమెంట్ సీటు కూడా కోల్పోదు.. స్టాలిన్‌కి అమిత్ షా కౌంటర్..
పార్లమెంట్ ఎంపీ నియోజకవర్గాల పునర్విభజనపై తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం, సీఎం ఎంకే స్టాలిన్, కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారు. డీలిమిటేషన్‌పై చర్చించడానికి మార్చి 5న అఖిలపక్ష సమావేశానికి కూడా ఆయన పిలుపునిచ్చారు. జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తమిళనాడు 8 లోక్‌సభ స్థానాలను కోల్పోతుందని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే, స్టాలిన్ వ్యాఖ్యల్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తోసిపుచ్చారు. తమిళనాడు ఒక్క పార్లమెంటరీ స్థానాన్ని కూడా కోల్పోదని షా అన్నారు. ‘‘పునర్విభజన తర్వాత కూడా దక్షిణాదిలోని ఏ రాష్ట్రానికీ సీట్లు తగ్గవని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్‌సభలో స్పష్టం చేశారు’’ అని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది జరిగే డీలిమిటేషన్ ప్రక్రియలో జనాభా ఆధారంగా పార్లమెంటరీ నియోజకవర్గాలను తిరిగి రూపొందించడం జరుగుతుందని, దక్షిణాది రాష్ట్రాల నుంచి లోక్‌సభ స్థానాలు తగ్గవచ్చని స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం కేంద్ర రాష్ట్రాల మధ్య ఘర్షణకు కారణమైంది.
రెండో రోజు ముగిసిన వంశీ విచారణ.. 3 గంటలకు పైగా ప్రశ్నలు
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రెండో రోజు విచారణ ముగిసింది. ఈరోజు కూడా వంశీని 20 ప్రశ్నలు పైగా సంధించారు పోలీసులు. నిన్నటి లాగే పోలీసులు అడిగిన కొన్ని ప్రశ్నలకు నాకు తెలియదు, సంబంధం లేదు అంటూ వంశీ సమాధానం చెప్పారు. గన్నవరం నియోజకవర్గంలో మైనింగ్ అక్రమా తవ్వకాలు జరిపారా అని వంశీని పోలీసులు ప్రశ్నించినట్టు సమాచారం. మైనింగ్‌కి తనకు ఎలాంటి సంబంధం లేదని.. కావాలనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సమాధానం ఇచ్చినట్టు సమాచారం. నిన్న పోలీసులు అడిగిన ప్రశ్నలకు వంశీ సరైన సమాధానం చెప్పలేదు. దీంతో.. ఈ రోజు టెక్నికల్ ఎవిడెన్సులు చూపించి ప్రశ్నలు అడిగి సమాధానం రాబట్టే ప్రయత్నం చేశారు అధికారులు. సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపులు వెనుక ఎవరెవరూ ఉన్నారు అనే కోణంలో పోలీసులు ప్రశ్నాస్తాలు సంధించారు. సత్యవర్ధన్‌ను హైదరాబాద్ నుంచి విశాఖకు తీసుకుని వెళ్ళినప్పుడు ఎవరెవరు ఉన్నారని పోలీసులు ప్రశ్నించారు. అనంతరం.. వైద్య పరీక్షలు నిమిత్తం కృష్ణలంక పోలీసు స్టేషన్ నుంచి జీజీహెచ్‌కు తరలించారు పోలీసులు.. వైద్య పరీక్షల అనంతరం మళ్ళీ తిరిగి జైలుకు తరలించనున్నారు.
కిషన్‌రెడ్డి ఆదేశంతో అంబర్‌పేట్ ఫ్లైఓవర్‌పై రాకపోకలు షురూ..
స్థానిక పార్లమెంట్ సభ్యుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆదేశంతో అంబర్‌పేట్ ఫ్లైఓవర్ పై రాకపోకలు ప్రారంభమయ్యాయి. అంబర్‌పేట్ ఫ్లై ఓవర్ పై నేటి నుంచి రాకపోకలు ప్రారంభమయ్యాయి స్థానిక పార్లమెంట్ సభ్యులు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆదేశంతో అంబర్‌పేట్ ఫ్లైఓవర్‌పై రాకపోకలు కొనసాగుతున్నాయి. దాదాపుగా ఫ్లైఓవర్ పనులు పూర్తయ్యాయి. అయితే కింద భాగాన రోడ్డు నిర్మాణం, గ్రీనరీ, బ్యూటిఫికేషన్ కార్యక్రమాలను పూర్తి చేసి అధికారికంగా మరికొన్ని రోజుల్లో ఫ్లైఓవర్ ప్రారంభించనున్నారు. అంతవరకు సౌకర్యార్థం శివరాత్రి నుంచి ఈ బ్రిడ్జ్ పై రాకపోకలను అనుమతించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన నిన్న ఫ్లై ఓవర్ పనులను పర్యవేక్షించారు. కేంద్రమంత్రి ఆదేశాలతో ఇవాళ్టి నుంచి బ్రిడ్జి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అంబర్‌పేట్ ఫ్లై ఓవర్ దశాబ్దాల కల. దీనికోసం చాన్నాళ్లుగా స్థానికులు, ఈ మార్గంలో రోజూ ప్రయాణించే వారు ఎదురుచూస్తున్నారు. అయితే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారి చొరవతో ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తవడం, శివరాత్రి సందర్భంగా అందుబాటులోకి రావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కిషన్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేస్తున్నారు.
ప్రధానమంత్రితో కులగణపై చర్చ జరగలేదు
ప్రధాని మోడీతో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధానమంత్రి మోడీకి ఐదు అంశాలపై విజ్ఞప్తులు ఇచ్చానని, మెట్రో విస్తరణ, మూపీ సుందరీకరణ, రీజినల్ రింగ్ రోడ్, ఏపీఎస్ కేడర్ల పెంపు అంశాలపై చర్చించినట్లు ఆయన తెలిపారు. ప్రధానికి ఇవ్వాల్సిన విజ్ఞప్తులు ఇచ్చాను, బాధ్యత వహించి వాటిని తీసుకురావాల్సింది కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి , బండి సంజయ్‌లు అని ఆయన అన్నారు. రాష్ట్రం తరఫున ఇచ్చిన విజ్ఞప్తులకు, కేంద్రం నుంచి నిధులు తేవాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి దే అని, కిషన్ రెడ్డి సాధించుకుని వస్తే ఆయనకు బహిరంగ సభ పెట్టి సన్మానం చేస్తామన్నారు. ఇంతకాలం రాష్ట్రానికి నిధులు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకున్నారని, ప్రధానమంత్రి నాకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారన్నారు రేవంత్ రెడ్డి. ఐదు ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్రం తరఫున విడుదల చేయాల్సిన నిధులకు సంబంధించిన రిప్రెజెంటేషన్ ప్రధాని నాకు ఇచ్చారని, 2014 నుంచి 2024 వరకు రాజ్యాంగం మారలేదన్నారు. గత పదివేల నుంచి శాసనం మారలేదని ఆయన మండిపడ్డారు. గత పది ఏళ్లలో పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్లను మంత్రులను చేస్తే ఉప ఎన్నికలు రాలేదని, ఇప్పుడు ఉప ఎన్నికలు ఎలా వస్తాయన్నారు. లెజిస్టేచర్ పార్టీ విలీనం అనేది లేదని, పార్టీ నే సుప్రీమ్ అన్నారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ నేతలు చేసిన అవినీతిపై సీబీఐ విచారణ వేస్తే.. ఆ వంకతో బీజేపీలో కలిసిపోవచ్చు అనుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు.
మేము కూటమిగా కలిసే ఉంటాం.. విడిపోయే ప్రసక్తే లేదు
మేము కూటమిగా కలిసే ఉంటాం.. విడిపోయే ప్రసక్తే లేదు.. ఎందుకు పవన్ ఈ మాట పదే పదే చెబుతున్నారు. దీని వెనక ఉద్దేశం ఏంటి..? కొన్ని అంశాల్లో వచ్చిన విభేదాల వల్ల ఈ మాట చెబుతున్నారా.. లేక వైసీపీ బలపడకూడదు అనే ఉద్దేశం ఉందా..? కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతోంది. కూటమి ఏర్పాటులో పవన్ పాత్ర చాలా కీలకం. అందులో ఎలాంటి డౌట్స్ లేవు కానీ.. ఈ మధ్య పవన్ కొన్ని సందర్భాల్లో కూటమి 15 ఏళ్ళు ఉండాలి.. అసలు విడిపోకూడదు అనే మాట చెబుతున్నారు.. దీనికి ప్రధాన కారణం కూటమి నేతల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కారణంగా కనిపిస్తున్నాయి. అసలు ఈ కూటమి ప్రభుత్వంపై మొదట వ్యతిరేక స్వరం వినిపించింది పవన్ కల్యాణే. లా అండ్ ఆర్డర్ కంట్రోల్‌లో లేదని.. నేనే హోంమంత్రి అయితే వేరే ఉంటుందని.. తర్వాత టీటీడీ తొక్కిసలాట అంశంలో కూడా అధికారుల తీరును పోలీసుల తీరును తప్పు పట్టారు. పాత వాసనలు పోవడం లేదు అన్నారు. తిరుపతిలో పవన్ వైఖరి టీడీపీ నేతల్లో కొంత అసహనం కలిగించింది.. ఇక్కడే అసలు సమస్య స్టార్ట్ అయింది.