నెల రోజులు సీరియస్ గా కష్ట పడాలి.. మేనిఫెస్టోను డోర్ టు డోర్ అతికించాలి
నెల రోజులు సీరియస్ గా కష్ట పడాలని.. మేనిఫెస్టోను డోర్ టు డోర్ అతికించాలని మంత్రి హరీష్ రావ్ పార్టీ శ్రేణులకు సూచించారు. జలవిహార్ లో బీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జి లతో, వార్ రూమ్ సభ్యుల సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ గోబెల్ ప్రచారం చేస్తున్నారు, వాటిని తిప్పి కొట్టాలని అన్నారు. మూడోవ సారీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి రాబోతున్నారని సర్వేలు చెప్తున్నాయన్నారు. మనం సీరియస్ గా నెల రోజులు కష్ట పడాలని సూచించారు. అవసరం అయితే రాత్రి ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ పడుకోవాలని అన్నారు. మేనిఫెస్టో బలంగా తీసుకొని పోవడంలో కొంత వెనుక పడుతున్నాం.. మేనిఫెస్టోను ప్రతి ఇంటికి స్టిక్కర్ అతికించాలని, డోర్ టు డోర్ జరగాలని పార్టీ శ్రేణులకు తెలిపారు. సీఎం సభ జరిగి ప్రదేశాల్లో మేనిఫెస్టో అంశాలు ఫ్లెక్సీ లు ఏర్పాటు చెయ్యాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మీదా మైండ్ గేమ్ ఆడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిప్పి కొట్టి బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రజలకూ తెలియపరచాలని మంత్రి అన్నారు.
బీజేపీ ఫస్ట్ లిస్ట్‌లో నేతలకు షాక్.. కనిపించని కిషన్ రెడ్డి పేరు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ ప్రకటించింది. కీలక నేతల పేర్లు ఖరారయ్యాయి. కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్‌ను కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్థిగా ఖరారు చేశారు. మరోవైపు కోరుట్ల అభ్యర్థిగా నిజామాబాద్ ఎంపీగా ఉన్న ధర్మపురి అరవింద్, బోథ్ నియోజకవర్గం అభ్యర్థిగా ఆదిలాబాద్ ఎంపీ సోయంబాపురావును ప్రకటించారు. మరోవైపు తొలి జాబితాలో కిషన్ రెడ్డి పేరు కనిపించలేదు. ఈటల రాజేందర్, గజ్వేల్ హుజూరాబాద్ నుంచి పోటీ చేయనున్నారు. తొలి జాబితాలో 12 మంది మహిళలు, 20 మంది బీసీలు, 18 మంది ఓసీలు, 8 మంది ఎస్సీ, ఆరుగురు ఎస్టీ అభ్యర్థులకు బీజేపీ స్థానం కల్పించింది. తొలి జాబితాలో 12 మంది మహిళలు, 20 మంది బీసీలు, 18 మంది ఓసీలు, 8 మంది ఎస్సీ, ఆరుగురు ఎస్టీ అభ్యర్థులకు బీజేపీ స్థానం కల్పించింది.
బీజేపీ తొలి జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చోటు.. బరిలోకి ముగ్గురు ఎంపీలు..!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ ఆదివారం విడుదల చేసింది. ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు, ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి నాలుగు పార్లమెంటు స్థానాలను బీజేపీ గెలుచుకుంది. అయితే ఈరోజు బీజేపీ విడుదల చేసిన జాబితాలో బీజేపీ నుంచి ముగ్గురు ఎంపీలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ ముగ్గురికి బీజేపీ మరోసారి టిక్కెట్లు కేటాయించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన రాజా సింగ్ ఒక్కరే విజయం సాధించారు. దుబ్బాక అసెంబ్లీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన రఘునందన్ రావు విజయం సాధించారు. హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఈటల రాజేందర్ విజయం సాధించారు. 2022లో మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై విధించిన సస్పెన్షన్‌ను బీజేపీ ఈరోజు ఎత్తివేసింది.
నానికి విలన్ గా మహా నటుడు…
అంటే సుందరానికి… ఈ మధ్య కాలంలో నాని నటించిన లైట్ వెయిట్ సినిమా. జెర్సీ, శ్యామ్ సింగ రాయ్, దసరా లాంటి హెవీ రోల్స్ చేసిన నాని… అంటే సుందరానికి సినిమాలో తనకి టైలర్ మేడ్ లాంటి పక్కింటి కుర్రాడిలా కనిపిస్తాడు. వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేసిన ఈ మూవీ కొంతమందికి విపరీతంగా నచ్చింది, మరికొంతమందికి అసలు నచ్చలేదు. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా… అంటే సుందరానికి సినిమాలో నాని కామెడీ టైమింగ్ మాత్రం సూపర్ ఉంటుంది. అందుకే ఈ కాంబినేషన్ మరోసారి సెట్ అయ్యింది. డిసెంబర్ 7న ‘హాయ్ నాన్న’ అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్న నాని, నెక్స్ట్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. ‘అంటే సుందరానికి’ కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ… వివేక్ ఆత్రేయతో నాని సినిమాని అనౌన్స్ చేసాడు. చాలా రోజులుగా వినిపిస్తున్న ఈ కాంబినేషన్ అఫీషియల్ గా ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసింది.
ఆసక్తికరంగా బీజేపీ ఫస్ట్ లిస్ట్.. 2 స్థానాల నుంచి ఈటల పోటీ ..
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ ప్రకటించింది. కీలక నేతల పేర్లు ఖరారయ్యాయి. కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్‌ను కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించారు. మరోవైపు కోరుట్ల అభ్యర్థిగా నిజామాబాద్ ఎంపీగా ఉన్న ధర్మపురి అరవింద్, బోథ్ నియోజకవర్గ అభ్యర్థిగా ఆదిలాబాద్ ఎంపీ సోయంబాపురావును ఖరారు చేశారు. మరోవైపు తొలి జాబితాలో కిషన్ రెడ్డి పేరు కనిపించలేదు. ఈటల రాజేందర్, గజ్వేల్.. హుజూరాబాద్ నుంచి పోటీ చేయనున్నారు. సిరిసిల్ల అభ్యర్థిగా రాణి రుద్రమారెడ్డి పేరును బీజేపీ ప్రకటించింది. ఖానాపూర్ నుంచి మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, చొప్పదండి నుంచి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, ఖైరతాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పోటీ చేయనున్నారు.
కల్వకుర్తి నుంచి మరోసారి ఆచారికే అవకాశం లభించింది. బీఆర్ఎస్ నుంచి చేరిన బోగ శ్రావణికి జగిత్యాల టికెట్ దక్కింది. ఇటీవలే పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌కు మానకొండూరు సీటును బీజేపీ ప్రకటించింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం సీటును ఆశించిన మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌కు అవకాశం రాకపోవడంతో… నోముల దయానంద్‌గౌడ్‌కు ఈ సీటు ఖరారు చేశారు. ఈ జాబితాలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. గతేడాది జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కొండా సురేఖ, విజయశాంతి, డీకే అరుణ, వివేక్ వెంకట్ స్వామి, లక్ష్మణ్ పేర్లు ఈ జాబితాలో కనిపించకపోవడంతో చర్చకు దారితీసింది.
పవన్.. నా వద్దకు వస్తే ట్యూషన్ చెబుతా: బొత్స
నూతన విద్యా విధానంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలియకుండా మాట్లాడుతున్నారని, కుంభకోణాలు అని అంటున్న పవన్‌కు తెలియకపోతే తన వద్దకు వస్తే ట్యూషన్ చెబుతాను అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వైసీపీ పాలనలో జరిగిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించేందుకు సామాజిక న్యాయ బస్సు యాత్ర చేపట్టామన్నారు. విశాఖ గ్రాండ్‌వేలో వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి బొత్స పాల్గొన్నారు. మొదటి దశలో 12 రోజుల పాటు సామాజిక న్యాయ బస్సు యాత్ర కొనసాగుతుందని ఆయన తెలిపారు.
‘శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి అక్టోబర్ 26న సామాజిక న్యాయ బస్సు యాత్రను ప్రారంభిస్తాం. ప్రతి నియోజకవర్గంలో బహిరంగ సభలు నిర్వహిస్తాం. మొదటి దశలో 12 రోజుల పాటు సామాజిక న్యాయ బస్సు యాత్ర కొనసాగుతుంది. వైసీపీ పాలనలో జరిగిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించేందుకు సామాజిక న్యాయ బస్సు యాత్ర చేపట్టాం’ అని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
రాహుల్ గాంధీ పై కేటీఆర్ వ్యాఖ్యలు.. జానారెడ్డి కౌంటర్
రాహుల్ గాంధీ పై కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత కుందూరు జానారెడ్డి కౌంటర్ ఇచ్చారు. జానారెడ్డితో.. జగదీశ్వర్ రావు, జూపల్లి భేటీ అయ్యారు. అనంతరం జానారెడ్డి మాట్లాడుతూ.. కేటీఆర్ కి సంస్కారం లేదన్నారు. రాహుల్ గాంధీపై సంస్కారం లేకుండా మాట్లాడారని మండిపడ్డారు. సంస్కారం లేని వాల్ల గురించి మాట్లాడనన్నారు. నువ్వు చేస్తానన్నవి అమలు చేశావా ? అని ప్రశ్నించారు. మూడెకరాల ఇచ్చావా దళితులకు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లోకి జగదీశ్వర్ రావు తిరిగి చేరడం శుభసూచకమన్నారు. పార్టీ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఇంకా జాబితా కొలిక్కి రాలేదన్నారు. క్లారిటీ వచ్చాకా అన్ని విషయాలపై మాట్లాడతా అన్నారు. కొంత మందితో మాట్లాడుతున్నాం .. అన్ని అయ్యాకా మాట్లాడతామని తెలిపారు. Upa దిగిపోయే నాటికి కరెంట్ ఇచ్చింది ఎవరు? 60 ఏండ్లు ఏ పదవి లేకుండా స్వాతంత్య్రం కోసం కొట్లాడింది కాంగ్రెస్ కదా? విశాల దృక్పధం తో పని చేసింది కాంగ్రెస్ కదా? సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వలేదా..? ఇప్పటి వరకు సాధించిన ప్రగతి ఎవరు సాధించారు మీరా ? ఉపాధి హామీ ఇచ్చింది..ఆహార భద్రత ..అటవీ హక్కులు ఇచ్చింది కాంగ్రెస్ కాదా..? అటవీ హక్కులు ఇవ్వకపోతే పోడు భూములు వచ్చేవా..? 2004 లోనే ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ అన్నారు.
చంద్రబాబు రాజకీయ పల్లకి మోయడానికి పవన్ ఉన్నాడు..
శాసన సభలో సవాల్ విసిరి బయటకు వెళ్లి ఏడ్చిన వ్యక్తి చంద్రబాబు అని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఇప్పుడు లోకేశ్ కూడా ఏడుస్తున్నాడు.. చంద్రబాబు ఏడుపు నాటకం, లోకేశ్ ఏడుపు ఆవేదన అనిపిస్తుంది.. తన లాంటి చేత గాని పప్పుకు కూడా మూడు శాఖలు ఇచ్చిన తన తండ్రి చంద్రబాబును జైల్లో వేశారని లోకేశ్ ఆవేదన చెందుతున్న పరిస్థితి అని ఆయన అన్నారు. రాజకీయాలను కాస్ట్లీ చేసిన వ్యక్తి, రాజకీయాలను వ్యాపారం చేసిన వ్యక్తి చంద్రబాబు.. స్కిల్ డెవలప్మెంట్ అవినీతి కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యి 44 రోజులు అయ్యిందని అంబటి రాంబాబు అన్నారు.
చంద్రబాబుపై అనేక కేసులలో ఆరోపణలు ఉన్నాయని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. క్రింది కోర్టులలో ఎక్కడ చంద్రబాబుకు ఊరట లభించలేదు.. సాక్ష్యా దారాలు ఉన్నాయి, కాబట్టే కోర్టులలో చంద్రబాబుకు రిమాండ్ విధించారు.. ఏదో ఓ కారణంతో చనిపోయిన వాళ్లకు రాజకీయ రంగు అద్ది టీడీపీ నాయకులు ఓదార్పు యాత్ర చేస్తున్నారు.. నిజం గెలవాలనే పేరుతో భువనేశ్వరి కూడా యాత్ర చేస్తారంట.. గతంలో అవినీతి కేసులలో అనేక మంది సీఎంలు, మాజీ సీఎంలు అరెస్ట్ అయ్యారు.. వాళ్ళందరి కన్నా చంద్రబాబు అతీతుడు కాదు అని మంత్రి పేర్కొన్నారు.
చంద్రబాబు నిర్ణయం ప్రకారమే పొత్తులు
జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నిర్ణయం ప్రకారమే పొత్తులు ఉంటాయని క్లారిటీ ఇచ్చారు టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్. ఇవాళ ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభ్యర్థులకు చెప్పాము వాళ్ళు నియోజక వర్గాల్లో పని చేసుకుంటున్నారని తెలిపారు. ఎల్లుండి చంద్రబాబు ని కలుస్తాము.. తరువాత అభ్యర్ధులని ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. ఇంటింటికి తెలుగు దేశం కార్యక్రమంతో ప్రజలోకి వెళ్ళామన్నారు కాసాని. 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని, అన్ని నియోజక వర్గాల్లో టీడీపీ బలపడుతుందన్నారు కాసాని జ్ఞానేశ్వర్. ప్రచారంలో బాలకృష్ణతో అగ్రనాయకులు పాల్గొంటారని, చంద్రబాబు జైల్లో అభివృద్ధి గురుంచే మాట్లాడుతున్నారన్నారు కాసాని జ్ఞానేశ్వర్. నేను ఆయనతో మాట్లాడితే పేదవాళ్ళని సంపన్నుల చేయాలనే ఆలోచనలో నే ఉన్నారు చంద్రబాబు అని, మేము ఒంటరిగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నామన్నారు. చంద్రబాబు అరెస్ట్ తరువాత ప్రజల్లో చాలా మార్పు వచ్చింది .. టీడీపీ కి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.
ఎన్ని కేసులు బనాయించిన కడిగిన ముత్యంలా చంద్రబాబు బయటకు వస్తారు
విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారిని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దర్శించుకున్నారు. దేవి శరన్నవరాత్రుల్లో అత్యంత ముఖ్యమైన రోజు దుర్గాష్టమి రోజున అమ్మవారిని దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను.. అమ్మవారిని దర్శించుకుని మనస్పూర్తిగా రెండు విషయాలు అమ్మవారిని కోరుకున్నాను.. తెలుగు జాతి ఆస్తి.. దేశం ప్రపంచం నలుమూలల.. తెలిసే విధంగా మన పిల్లల్ని ఆదర్శంగా తీర్చిదిద్దిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు.. చంద్రబాబు నాయుడు మీద దొంగ కేసులను, సంబంధం లేనటువంటి కేసులను బనాయించి 44 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో బంధించారు అంటూ అచ్చెన్నాయుడు ఆరోపించారు.
అమ్మవారు దయ చూపి, సమాజానికి ఉపయోగపడే వ్యక్తిని, తెలుగు జాతి ముందుండాలని పరితపించిన వ్యక్తిని, త్వరగా విడుదల కావాలని అమ్మవారిని కోరుకున్నాను అని ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు వెల్లడించారు. 100 సంవత్సరాల చరిత్రలో భారత దేశంలో ఎప్పుడు ఇటువంటి కరువు పరిస్థితి లేదు.. రైతులు వ్యవసాయమంతా కరువుతో బాధపడుతున్నారు, సరైనటువంటి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు అని ఆయన ఆరోపించారు.
సంస్కారం గురించి కాంగ్రెస్ నేతల దగ్గర నేర్చుకోవాల్సిన కర్మ మాకు లేదు
2014 వరకూ సోషల్ మీడియా పెద్దగా అందుబాటులో లేదని, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నవారు ఇంకా కొత్త రకము ఎన్నికల విధానానికి అలవాటు పడలేదన్నారు మంత్రి కేటీఆర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియా ప్రభావం తెలియని నేతలు ఇంకా ఉన్నారని, నరేంద్ర మోడీని ఆ రోజు రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయికి తీసుకెళ్లింది సోషల్ మీడియానే అన్నారు. ఇదే సమయంలో జానా రెడ్డికి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. సంస్కారం గురించి కాంగ్రెస్ నేతల దగ్గర నేర్చుకోవాల్సిన కర్మ మాకు లేదన్నారు.
జానారెడ్డి సంస్కారాన్ని ముందు వాళ్ల పీసీసీ ప్రెసిడెంట్ కు నేర్పించాలని ఆయన కోరారు. కేసీఆర్ కు పిండం పెట్టాలన్నప్పుడు జానారెడ్డి సంస్కారం ఎక్కడ పోయిందని ఆయన ప్రశ్నించారు. రాళ్లతో కేసీఆర్ ను కొట్టి చంపాలన్నప్పుడు మీ సంస్కారం ఏమైంది? అని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. 50 కోట్లకు పిసిసి పదవి అమ్ముకున్న దగుల్బాజీ పార్టీ కాంగ్రెస్ అని, రేవంత్ రెడ్డి డబ్బులు వసూలు చేస్తున్నాడని సొంత పార్టీ నేతలే ఈడికి ఫిర్యాదు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజల మూడ్ బీ ఆర్ ఎస్ వైపే ఉందని, కేసీఆర్ పైన జనం క్లారిటీ ఉందన్నారు. న్నికలలో పోటీ చేయటానికి కిషన్ రెడ్డి భయపడ్డారని కేటీఆర్ అన్నారు.
టీడీపీకి తొత్తుగా వ్యవహరించే జనసేనకు ఓటేస్తే నష్టం తప్పదు..
విశాఖపట్నంలోని పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ బహిరంగ సభలో వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. వైసీపీ గోపాలపట్నంలో జరిగిన సభకు ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ బహిరంగ సభకు భారీగా కార్యకర్తలు, మహిళలు తరలి వచ్చారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ, జనసేన యాత్రలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని ఆయన సూచించారు. మోసం చేసే హామీలతో ప్రజల ముందుకు వస్తున్నారు.. టీడీపీ, టీడీపీకి తొత్తుగా వ్యవహరించే జనసేనకు ఓటేస్తే నష్టం తప్పదు అని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.
సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొందుతున్న కోట్లాది మందికి నష్టం జరుగుతుంది అని వైవీ వైవీసుబ్బా తెలిపారు. పశ్చిమ నియోజక వర్గం మీద సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు.. సమన్వయకర్త, వైసీపీ అభ్యర్థి ఆనంద్ కుమార్ గెలవబోతున్నారు అంటూ ఆయన పేర్కొన్నారు. అయితే, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైసీపీ రెడీ అయింది. వైసీపీ బస్సు యాత్ర చేపట్టనుంది అని ఆయన అన్నారు. ఇందులో భాగంగా అక్టోబర్ 26 నుంచి నవంబర్ 9వ తేదీ వరకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో సామాజిక న్యాయ బస్సు యాత్ర చేపడుతున్నట్లు వెల్లడించారు.