కేంద్ర ఉద్యోగులకు మోడీ దీపావళి కానుక.. డీఏ 4శాతం పెంపు
పండుగకు ముందే ప్రభుత్వోద్యోగులకు, పెన్షనర్లకు మోడీ ప్రభుత్వం పెద్ద కానుకను అందించింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల కరువు భత్యం పెంపునకు ఆమోదం తెలిపింది. డియర్‌నెస్ అలవెన్స్‌లో 4 శాతం పెంపుతో 42 శాతం నుంచి 46 శాతానికి పెంచారు. అక్టోబరు 18 నాడు మంత్రివర్గ సమావేశం జరిగింది. దీనిలో డియర్‌నెస్ అలవెన్స్ పెంపునకు ఆమోదం లభించింది. కరువు భత్యం పెంపుతో పాటు కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు అక్టోబర్ నెల జీతం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. జూలై నుండి సెప్టెంబర్ వరకు ఉన్న బకాయిలను కూడా అక్టోబర్ నెల జీతంతో పాటు కేంద్ర ఉద్యోగులు.. పెన్షనర్లకు ఇవ్వవచ్చు.
ప్రవళిక ఆత్మహత్య..13 మంది రాజకీయ నాయకులపై కేసులు
ప్రవళిక ఆత్మహత్య ఘటనలో పలువురు రాజకీయ నాయకులు, విద్యార్థి నేతలపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇటీవల పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ప్రవళిక అశోక్ నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని తన హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ప్రవళిక ఆత్మహత్య చేసుకుందన్న విషయం తెలుసుకున్న విద్యార్థులు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. అయితే విద్యార్థులకు మద్దతుగా అక్కడికి చేరుకున్న రాజకీయ నేతలు, విద్యార్థి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రవళిక చనిపోవడానికి కారణం గ్రూప్ టు పోస్ట్పోన్డ్ కారణమంటూ రాజకీయ నాయకులు ఆందోళన చేసిన మొత్తం 13 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వారిపై ఐపిసి సెక్షన్స్ 143, 148, 341, 332 R/W 149 కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, అనిల్ కుమార్ యాదవ్, ఫిరోజ్ ఖాన్, కార్పొరేటర్ విజయ రెడ్డి, ఓయూ నేత సురేష్ యాదవ్, భాను ప్రకాష్, నీలిమ, జీవన్ లపై కేసులు నమోదు చేసిన్లు తెలిపారు. పోలీసులపై రాళ్లు రువ్వారని అభియోగాలపైన కేసులు నమోదైనట్లు తెలిపారు.
దళితులు గౌరవంగా బతికేలా సీఎం జగన్ చూస్తున్నారు: మంత్రి నాగార్జున
సమాజంలో దళితులు గౌరవంగా బతికేలా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చూస్తున్నారు అని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. రాష్ట్రంలో దళిత, గిరిజనుల సంక్షేమానికి ముఖ్యమంత్రి జగన్ అధిక ప్రాధాన్యమిస్తున్నారన్నారు. ప్రజల కోసం కష్టపడే సీఎం జగన్‌ను వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దళితుల కోసం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించేందుకే సామాజిక న్యాయ చైతన్య యాత్రని నిర్వహిస్తున్నామని మంత్రి నాగార్జున తెలిపారు.
నెల్లూరు జిల్లాలో మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ… ‘రాష్ట్రంలో దళిత, గిరిజనుల సంక్షేమానికి ముఖ్యమంత్రి జగన్ అధిక ప్రాధాన్యమిస్తున్నారు. దళితుల కోసం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించేందుకే సామాజిక న్యాయ చైతన్య యాత్రని నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ పథకాలలో అవినీతి లేకుండా దళితులకు అందిస్తున్నారు. దళితులు గౌరవంగా బతికేలా చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ జగన్‌ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు.
ఏపీలో అప్పులు తప్ప.. అభివృద్ధి లేదు: భానుప్రకాష్ రెడ్డి
ఏపీలో అప్పులు తప్ప అభివృద్ధి లేదని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. 10 లక్షల కోట్ల అప్పుల ఊబిలో ఏపీ ప్రజలు కూరుకుపోయారన్నారు. టీటీడీ సొమ్మును తిరుపతి కార్పోరేషన్‌కు బదలాయించడం సమంజసం కాదన్నారు. ఏపీలో అరాచకం రాజ్యం ఏలుతుందని భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తీరు సరికాదన్నారు. బాబు ఆరోగ్యం పట్ల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారని, అధికారులపై నమ్మకం సన్నగిల్లిందని భానుప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు.
భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ… ’10 లక్షల కోట్ల అప్పుల ఊబిలో ఏపీ ప్రజలు కూరుకుపోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పులు తప్ప అభివృద్ధి లేదు. టీటీడీ సొమ్మును తిరుపతి కార్పోరేషన్‌కు బదలాయించడం సమంజసం కాదు. రూ. 4,600 కోట్ల వార్షిక బడ్జెట్లో 1 శాతం నిధులను పరిశుభ్రత పేరుతో, మరో రూ. 50 కోట్ల నిధులను తిరుపతి అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నారు. రూ.100 కోట్లను అభివృద్ధి పేరుతో తిరుపతి కార్పోరేషన్‌కు తరలించి కమీషన్ల పేరుతో జేబులు నింపుకుంటున్నారు. టీటీడీ ఛైర్మన్ తన రాజకీయ లబ్ది కోసం టీటీడీ నిధులను ఖర్చు పెడుతున్నారు’ అని అన్నారు.
నామీద పోటీచేసే దమ్ముందా..? అసదుద్దీన్ ఓవైసీ కి రాజాసింగ్ సవాల్..!
దమ్ముంటే నా మీద నువ్వు పోటీ చెయ్యి ఓవైసీ ? అంటూ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సవాల్ విసిరారు. గోషామహల్ లో అభ్యర్థులను నిలబెట్టాలని ఎంఐఎం నేతలకు రేవంత్ రెడ్డి అడుగుతున్నాడని కీలక వ్యాఖ్యలు చేశారు. గోషామహల్ లోనే దారుసలెం, ఎంఐఎం ఆఫీస్ లు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోషామహల్ లో అభ్యర్థులను ఎందుకు నిలబెట్టరు అని రేవంత్ రెడ్డి అడుగుతున్నడని తెలిపారు. రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పే ధైర్యం ఒవైసీలకు లేదని అన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వ కాళ్ళు పట్టుకొని, ఇల్లీగల్ దందాలు చేసే చరిత్ర ఒవైసీ లది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అభ్యర్థులను నిలబెట్టి బ్లాక్ మెయిల్ దందాలు మొదలు పెట్టిండ్రని అన్నారు. ఒవైసీ కుటుంబమే అభివృద్ధి చెందుతోంది తప్ప ముస్లిం వర్గాలు కాదని కీలక వ్యాఖ్యలు చేశారు. ముస్లింలను ఓట్లు అడగను, వాళ్ళు నాకు ఒట్లేయరు, వాళ్ళ ఓట్లు నాకు అవసరం లేదని అన్నారు.
‘‘దాడికి పాల్పడిన వారిదే బాధ్యత’’..గాజా ఆస్పత్రి దాడిపై స్పందించిన పీఎం మోదీ..
ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం రోజు రోజుకు దారుణంగా తయారవుతోంది. ఈ యుద్ధం వల్ల ఇరువైపు సామాన్య ప్రజలు బలవుతున్నారు. ఇజ్రాయిల్ పై హమాస్ దాడులు చేయడంతో 1400 మంది చనిపోయారు. మరోవైపు ఇజ్రాయిల్, గాజాస్ట్రిప్ పై జరిపిన వైమానికదాడుల్లో 3000 మంది మరణించారు. మంగళవారం గాజాలోని అల్ అహ్లీ హస్పిటర్ పై దాడి జరిగింది. ఈ దాడిలో 500 మంది మరణించారు. అయితే ఈ దాడికి ఇరు పక్షాలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు.
గాజా ఆసుపత్రి దాడిపై ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. ‘‘గాజాలోని అల్ అహ్లీ హాస్పిటల్‌లో జరిగిన విషాదకరమైన ప్రాణనష్టం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు మా హృదయపూర్వక సానుభూతి మరియు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు’’ అని ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. కొనసాగుతున్న సంఘర్షణ పౌర ప్రాణనష్టం తీవ్రమైన, నిరంతర ఆందోళనకర విషయం, ఇందులో పాల్గొన్న వారు బాధ్యత వహించాలి అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు.
ములుగులో పోస్టర్ల కలకలం
ఎన్నికల ప్రచారంలో వినూత్న వాల్ పోస్టర్లు తెలిసాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీతక్క దనబలం అంటూ బిఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి ప్రజాబలం అంటూ వెలిసిన పోస్టర్ల జిల్లాలో కలకలం రేపుతున్నాయి. ములుగు జిల్లా కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే సీతక్కకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు వెలుస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీతక్కది ధనబలం అంటూ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బడే నాగజ్యోతి ప్రజాబలం అంటూ రూపొందించిన పోస్టల్ సోషల్ మీడియాలో జిల్లా కేంద్రంలో వైరల్ గా మారాయి.
నియోజకవర్గంలో మొదటిసారి ఇలాంటి పోస్టర్లు విలువడడం ఇక్కడి ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ పోస్టర్లు వెయ్యడం అభ్యర్థులు ఒకరిపై ఒకరు దూకుడు ప్రచారాలు కొనసాగుతున్నాయి. తెల్లవారే సరికి ఈ పోస్టర్ల్ ఎలా వెలిశాయి, ఎవరు అంటించారు అనేదాని పై పలు అనుమానాలు రేకేతిస్తున్నాయి. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బడే నాగజ్యోతి ఓటమి చెందుతుందనే భయంతో అధికార పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, కాంగ్రెస్ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి సీతక్క పై కావాలనే అధికార పార్టీ నాయకులు పుష్పచారం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నారు.
కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాం..
రాష్ట్రంలోని బీసీ మనసుల్లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుస్థిర స్థానం సంపాదించుకున్నారు అంటూ సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు. రాష్ట్రాలు కుల గణన చేసుకోవచ్చని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.. అందులో భాగంగానే ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాం అని ఆయన పేర్కొన్నారు. దీనిపై కేంద్రం ఇంకా చర్యలు తీసుకోలేదు.. అందుకే రాష్ట్రం కుల గణన చేపడుతోంది అని మంత్రి చెల్లుబోయిన వేణు తెలిపారు.
ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు స్వల్ప ఊరట..
అమరావతి ఇన్నర్ రింగు రోడ్డు అలైన్మెంట్ మార్పు కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి ఏపీ హైకోర్టు ఊరట లభించింది. నవంబరు 7వ తారీఖు వరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దని న్యాయస్థానం ఆదేశించింది. ఆ పిటిషన్ పై విచారణను నవంబరు 7వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. అయితే, ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవాళ్టితో ముగియడంతో హైకోర్టులో వాదనలు జరిగాయి. సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ తీర్పు రిజర్వ్ లో ఉన్న నేపథ్యంలో ఏపీ హైకోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో తీర్పు రింగు రోడ్డు కేసుకు కూడా వర్తిస్తుందని, అందుకే విచారణను నవంబరు 7కు వాయిదా వేయాలని చంద్రబాబు తరఫు లాయర్లు కోరగా దానికి కోర్టు ఓకే చెప్పింది. ఇక, విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు పీటీ వారెంట్ పై స్టేను కూడా నవంబర్ 7వ తేదీ వరకు పొడిగించింది.
ఫ్రాన్స్‌లో దాడుల కలకలం.. 6 ఎయిర్‌పోర్టుల్లో ఎమర్జెన్సీ..
ఫ్రాన్స్‌లో హై అలర్ట్ నెలకొంది. దాడులు జరుగుతాయనే బెదిరింపుల నేపథ్యంలో ప్రభుత్వం అలర్టైంది. పారిస్ సమీపంలోని 6 ఎయిర్ పోర్టులను అధికారులు ఖాళీ చేయించారు. లిల్లే, లియోన్, నాంటెస్, నైస్, టౌలౌస్, బ్యూవైస్ విమానాశ్రయాలను అత్యవసరంగా ఖాళీ చేయించారు. బుధవారం ఈమెయిల్ ద్వారా దాడి జరుగుతుందని బెదిరింపులు వచ్చాయి. ఫ్రాన్స్ డీజీఏసీ ఏవియేషణ్ అథారిటీ ప్రతినిధి మాట్లాడుతూ.. లిల్లే, లియోన్, టౌలౌస్, బ్యూవైస్ ఎయిర్ పోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయని ధృవీకరించారు. బెదిరింపుల నేపథ్యంలో కొన్ని విమానాలను దారి మళ్లించారు.
కరువు మనవైపు కన్నెత్తి కూడా చూడది
తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే.. బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నియోజకవర్గాల వారీగా బహిరంగ సభల్లో పాల్గొంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు జడ్చర్లలో తలపెట్టిన బహిరంగ సభకు హాజరైన ప్రసంగించారు. పాలమూరు ప్రాజెక్టుతో మహబూబ్ నగర్ జిల్లా రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఏమూలకు పోయినా దుఃఖంతో నిండిపోయేదని, మహబూబ్‌నగర్ నీటిగోసపై ఉద్యమ సమయంలో నేను పాట రాశానన్నారు. అప్పట్లో మనుషులే కాదు, అడవులు కూడా బక్కపడ్డాయని, 9 ఏళ్ల పోరాటం తర్వాత అనుమతులు వస్తున్నాయన్నారు సీఎం కేసీఆర్.