రీల్ చేస్తూ 300 అడుగుల లోయలో పడి మహిళ మృతి
23 ఏళ్ల మహిళ కారు డ్రైవింగ్ చేస్తూ 300 అడుగుల లోయలో పడి మరణించిన ఘటన మహారాష్ట్రలోని శంభాజీనగర్‌లో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైంది. మృతురాలు ఛత్రపతి శంభాజీ నగర్‌లోని హనుమాన్‌నగర్‌కు చెందిన 23 ఏళ్ల శ్వేతా దీపక్ సుర్వసేగా గుర్తించారు. శ్వేత సులి భంజన్ ప్రాంతంలోని దత్ధామ్ ఆలయానికి వెళ్లినట్లు సమాచారం. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, ఆమె రీల్ చేయడానికి ప్రయత్నించింది. ఆమె స్నేహితుడు, శివరాజ్ సంజయ్ ములే ఆమెను చిత్రీకరిస్తున్నాడు. డ్రైవింగ్ చేసే క్రమంలో, ఆమె ప్రమాదవశాత్తూ రివర్స్ గేర్‌ను వేసి యాక్సిలరేటర్‌ను తొక్కింది, దీంతో కారు వేగంగా వెనుకకు వెళ్లి లోతైన లోయలో పడింది, కారు పూర్తిగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో శ్వేత వెంటనే మృతి చెందింది.
రేపు పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన…
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల పర్యటన ఖరారైంది. రేపటి నుంచి రెండ్రోజులపాటు సొంత నియోజకవర్గంలో ఆయన పర్యటించనున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక తొలిసారి ఆయన పులివెందులకు వెళ్తున్నారు. రేపు మధ్యాహ్నాం తాడేపల్లి నుంచి బయల్దేరి సాయంత్రం కల్లా అక్కడికి చేరుకుంటారు. ఈ పర్యటనలో రాయలసీమ జిల్లాల నేతలు, కార్యకర్తలతో భేటీ అయ్యి.. ఆయన భరోసా ఇవ్వనున్నట్లు సమాచారం. శుక్రవారం మధ్యాహ్నాం కల్లా పులివెందుల పర్యటనను ముగించుకుని తిరిగి తాడేపల్లికి చేరుకుంటారాయన.
పోలవరం పూర్తి అయితే.. భద్రాద్రి పవర్ ప్లాంట్ మునుగుతుంది..!
పోలవరం పూర్తి అయితే భద్రాద్రి పవర్ ప్లాంట్ మునుగుతుందని ప్రొఫెసర్ కోదండరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ చీకట్లు అంటూ కేసీఆర్ వందల కోట్ల రూపాయలను నష్టం చేశారన్నారు. అభివృద్ధి పేరుతో నిబంధనలను ఉల్లంఘించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం చెప్తున్నా కేసీఆర్ తొందర పాటు నిర్ణయం వల్ల ఛత్తీస్ గడ్ ఒప్పందాలు చేసుకున్నారని తెలిపారు. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా పవర్ భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్స్ ఏర్పాటు చేశారని మండి పడ్డారు. పోలవరం పూర్తి అయితే భద్రాద్రి పవర్ ప్లాంట్ మునుగుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం అప్పటి ప్రభుత్వం చెయ్యలేదన్నారు.
పోలీసు జాగిలం పదవీ విరమణ.. ఎమోషనల్ అయిన అధికారులు
నేరం జరిగిన ప్రదేశంలో ఆధారాలు వెతకడం, పోలీసులకు క్లూస్ అందించడం.. ఇదీ జాగిలం తార పని. కానీ, ఈ పనులు చేయడానికి వాటికి చాలా శిక్షణ ఇవ్వాలి. హత్య, దొంగతనం, పేలుడు పదార్థాలు, డ్రగ్స్‌ను గుర్తించడం వంటి నేరాలను ఛేదించేందుకు పోలీసులకు ఉన్న ఆయుధం ఈ జాగీలే. అయితే నేడు పోలీసు జాగిలం తార పదవి విరమణ సందర్భంగా.. పోలీసు అధికారులు ఎమోషనల్ అయిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. నిర్విరామంగా శాంతి భద్రతలను పరిరక్షించే క్రమంలో పోలీసు జాగిలాలు ఉన్నతమైన సేవలను అందిస్తాయని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ తెలిపారు. ఆదిలాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు పోలీసు జాగిలం తార పదవీ విరమణ కార్యక్రమంలో జాగిలం సేవలను కొనియాడారు. శాలువా పూలమాలలతో సత్కరించారు. పోలీసు జాగిలం తార 2013-01-22లో పుట్టి, 2013 సంవత్సరంలో ఐఐటిఎ మొయినాబాద్ నందు ఎల్ సోమన్న హండ్లర్ కు అందజేసి సంవత్సరం పాటు పేలుడు పదార్థాలను కనుగొనడంలో శిక్షణను తీసుకుని ఆదిలాబాద్ జిల్లాకు విచ్చేయడం జరిగిందన్నారు.
శ్రీ సీతారాముల ఆలయంలో స్వామివారి విగ్రహాలు ధ్వంసం..
హైదరాబాద్ నగరంలోని శ్రీ సీతారాముల ఆలయంలో జూన్ 17వ తేదీ సోమవారం గుర్తుతెలియని దుండగులు హిందూ దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం (damaged ) చేశారు. ఈ విషయం కాస్త ఆలస్యంగా బయటికి వచ్చింది. ఈ ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుబిల్‌పురా గ్రామంలో చోటుచేసుకుంది. శ్రీ సీతారాముల ఆలయంలోని సీతారామ లక్ష్మణ విగ్రహాలను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని స్థానికులు ఆరోపించారు. దుండగులు రాత్రి సమయంలో ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు అక్కడి స్థానికులు తెలుపుతున్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత ఆలయ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి, విగ్రహాలు ధ్వంసమైనట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ విషయంపై ఆగ్రహించిన స్థానికులు విగ్రహాలు నాశనం చేసిన అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
రేవంత్ రెడ్డి నాయకత్వంలో పాలన పడకేసింది అనుకున్నాం.. కానీ అటక్కేకింది
రేవంత్ రెడ్డి నాయకత్వంలో పాలన పడకేసింది అనుకున్నాం…కానీ అటకెక్కిందన్నారు బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వానికి పిఆర్ స్టంట్ మీద ఉన్న సోయి…ప్రజా సమస్యలు పరిష్కరించడంలో లేదని, ఆశా వర్కర్లు, అంగన్ వాడీలు, గురుకుల టీచర్లు, ఆందోళన చేస్తుంటే పట్టింపు లేదు. రాష్ట్రంలో హత్యలు, హత్యాచారాలు జరుగుతుంటే పట్టించుకోవడం లేదన్నారు రాకేష్ రెడ్డి. జీవో 46 బాధితులను పట్టించుకోవడం లేదని, 60 మార్కులు వచ్చిన వారికి ఉద్యోగం వస్తె… 90 మార్కులు వచ్చిన వారికి ఉద్యోగం రాలేదని ఆయన విమర్శించారు. వారికి న్యాయం చేస్తామని మాటిచ్చారు. కాంగ్రెస్ కోసం పనిచేయాలని అన్నారని, ఇప్పుడు ఎన్నికలు ఐపోగానే మొహం చాటేశారని రాకేష్ రెడ్డి మండిపడ్డారు.
హరీష్ పొర్లు దండాలు పెట్టిన మీ మామ నిన్న పార్టీ అధ్యక్షుడు నీ చేయరు
బీఆర్‌ఎస్ నాయకులు చేసిన పాపాలని కడుక్కుంటూ.. ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హరీష్ రావు గతములోనే తెలంగాణా ప్రజలను మోసం చేసినట్లు మళ్ళీ చేస్తా అంటే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. నువ్వు పొర్లు దండాలు పెట్టిన మీ మామ నిన్న పార్టీ అధ్యక్షుడు నీ చేయరని, సలహాలు,సూచనలు చేయండి కాంగ్రెస్ ప్రభుత్వం స్వీకరిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో మీ పార్టీ నీ బీజేపీ లో మెర్జ్ చేయడం తప్ప, బీఆర్‌ఎస్ బతికే పరిస్థితి లేదన్నారు బీర్ల ఐలయ్య. ఆగష్టు 15 లోపు,ఋణ మాఫీ చేయడానికి అధికారులు సిద్ధం చేస్తున్నారని, తెలంగాణా రాష్ట్రం లో ప్రజా పాలనా కోరుకొని కాంగ్రెస్ కి పట్టం కట్టారని ఆయన మండిపడ్డారు.
నా ఆలోచనల నుంచి వచ్చిందే ఏటీసీ సెంటర్స్..
మల్లేపల్లి ఐటీఐ ప్రాంగణంలో ఐటీఐ స్కిల్ డెవలప్మెంట్ అప్ గ్రేడేషన్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో నిరుద్యోగ సమస్య అత్యంత కీలక పాత్ర పోషించిందన్నారు. నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగఅవకాశాలు కల్పించడమే మా ప్రభుత్వ లక్ష్యమని ఆయన వ్యాఖ్యానించారు. ష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐ లు నిరుపయోగం మారాయని, ఐటీఐ ల్లో నేర్పించే నైపుణ్యాలు విద్యార్థులకు ఉపయోగం లేకుండా పోయాయని, 40, 50 ఏళ్ల కిందటి నైపుణ్యాలను ఐటీఐ ల్లో నేర్పిస్తున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యార్థులు, నిరుద్యోగులను నా కుటుంబ సభ్యులుగా భావిస్తున్నానని, నా ఆలోచనల నుంచి వచ్చిందే ఏటీసీ సెంటర్స్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
మానేర్ రివర్ ఫ్రంట్ పనులు త్వరగతిన పూర్తి చేస్తాం
కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ , కలెక్టర్ పమేలా సత్పతి , అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, వివిధ విభాగాల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ, సీఎంఏ ప్లాన్స్ గ్రాంట్స్, వాటర్ సప్లై, సాలిడ్ వాటర్ మేనేజ్మెంట్ తదితర విషయాల సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కరీంనగర్ మున్సిపాలిటీ అభివృద్ధి పనులపై రివ్యూ జరిగిందన్నారు. ఎనభై పనులలో వర్క్స్ లిస్డ్ లేకుండా పనులు చేసారని, స్మార్ట్ సిటి లో అనేక కాంపోనెంట్ లు ఉన్నాయన్నారు. వైఫై హాట్ స్పాట్ కొందరే వాడుకుంటున్నారని, 98 కొట్ల నిధులపై ప్రగతి లేదన్నారు పొన్నం ప్రభాకర్. భూకబ్జా దారులు ఉంటే చర్యలు ఉంటాయని చెప్పాం.మేము కుడా ఎక్కడ జోక్యం చేసుకోలేదని, గత పదేండ్లలలొ అధికార దుర్వినియోగం చేసి ల్యాండ్ ఖబ్జాలు చేసిన వారి లిస్ట్ సేకరిస్తున్నామన్నారు పొన్నం ప్రభాకర్.
డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి సెక్రటేరియట్ కు పవన్..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు సచివాలయంలో అడుగుపెట్టబోతున్నారు.. ప్రమాణ స్వీకారం అనంతరం డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి ఆయన సెక్రటేరియట్‌కి రాబోతున్నారు.. అయితే, ఏడేళ్ల తర్వాత సచివాలయానికి వస్తున్నారు పవన్.. 2017 జులైలో ఉద్దానం సమస్యల పరిష్కారంపై అప్పటి సీఎం చంద్రబాబుతో సచివాలయంలో భేటీ అయ్యారు.. ఇక, ఏడేళ్ల తర్వాత ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో సెక్రటేరియట్‌కు వస్తున్నారు.. మరోవైపు.. సచివాలయానికి వస్తున్న పవన్‌కు ఘన స్వాగతం పలికేందుకు అమరావతి రైతులు ఏర్పాట్లు చేస్తున్నారు.. గతంలో అమరావతి రైతుల కోసం ముళ్ల కంచెలు దాటుకుని వచ్చి ఆందోళనలో పాల్గొన్నారు జనసేన అధినేత.. ఇప్పుడు ఆయన కొత్త ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంతో పాటు కీలక శాఖలు దక్కించుకుని.. పదవీ బాధ్యతలు స్వీకరించేందుకు వస్తున్న తరుణంలో.. అమరావతి రైతులు, జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం భారీ ఎత్తున పూలను సమీకరించారు..
