నేను ఓడిపోతానా..? ఎగ్జిట్ పోల్స్ పై రోజా ఫస్ట్ రియాక్షన్
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్ అంచనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్‌పై స్పందించారు మంత్రి రోజా. ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్‌పై ఎవరికి కావాల్సిన కథలు వాళ్లు వండుతున్నారని దుయ్యబట్టారు. ఎవరెన్ని చెప్పినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండోసారి సీఎం కావడం తథ్యమని రోజా స్పష్టం చేశారు. సంక్షేమానికి, అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారని.. అందుకే మహిళలు, వృద్ధులు సైతం రాత్రి 9 గంటలైనా ఓపిగ్గా క్యూలైన్లలో వేచియుండి ఓటేశారని రోజా స్పష్టం చేశారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సంక్షేమం, అభివృద్ధిని పెద్ద ఎత్తున అందించిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని రోజా ప్రశంసించారు. మరిన్ని వివరాల కొరకు కింది వీడియో చూడండి.
ఈ సారి రికార్డు స్థాయిలో ఓటింగ్.. ఓటర్లకు స్టాండింగ్ అవేషన్ ఇచ్చిన ఈసీ
రేపు దేశవ్యాప్తంగా కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఏడు విడుతలుగా పోలింగ్ విజయవంతంగా జరిగిందన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ముందు ఎన్నికల సంఘం విలేకరుల సమావేశంలో కౌంటింగ్‌కు సంబంధించి సీఈసీ రాజీవ్ కుమార్ కీలక విషయాలను వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ముందు ఎన్నికల సంఘం ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించింది. ఈ ఎన్నికల్లో ఓటర్లు ఎన్నో రికార్డులు సృష్టించారని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు. ఈసారి మహిళలు కూడా అధిక సంఖ్యలో ఓటు వేసినట్లు సీఈసీ తెలిపింది. ఈ సారి ఎన్నికల్లో రికార్డుస్థాయిలో 64.2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో 31 కోట్ల 20 లక్షల మంది మహిళలు సహా 64 కోట్ల 20 లక్షల మంది ఓటర్లు పాల్గొని భారత్ ప్రపంచ రికార్డు సృష్టించిందని సీఈసీ పేర్కొంది. ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం స్టాండింగ్ అవేషన్ ఇచ్చింది. మనదేశం ఓటేసిన వారి సంఖ్య.. జీ7 దేశాల జనాభాకు ఒకటిన్నర రెట్లు అని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. 27 రాష్ట్రాల్లో రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదన్నారు. రూ.10 వేల కోట్ల నగదును సీజ్ చేశామన్నారు.
కౌంటింగ్ విషయంలో జాగ్రత్త.. సీఎం రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్..
నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ అభ్యర్థులు, ఇన్చార్జ్ మంత్రులు, ఏఐసీసీ సెక్రెటరీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. జూమ్ సమావేశంలో ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఏఐసీసీ సెక్రటరీలు, ఎంపీ అభ్యర్థులు పాల్గొన్నారు. ఎంపీ అభ్యర్థులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కౌంటింగ్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏజెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తల పై కీలక సూచనలు జారీ చేశారు.
బీఆర్ఎస్ పార్టీకి ఒక్క పార్లమెంట్ స్థానం కూడా రాదు..
బీఆర్ఎస్ పార్టీకి ఒక్క పార్లమెంట్ స్థానం కూడా రాదని దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేలకొండపల్లి మండలం కొత్త కొత్తూరులో శ్రీనన్న కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో పాలేరు నుంచి అత్యధిక మెజారిటీ రాబోతోందన్నారు. గడిచిన పది సంవత్సరాల్లో పేదవారికి ఒక్క ఇళ్లు కూడా ఇవ్వలేదన్నారు. అర్హులైన వారికి ఆసరా పెన్షన్ కూడా ఇవ్వలేదు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. ఇరవై రెండున్నర వేల కోట్లు ఖర్చు పెట్టి ఇందిరమ్మ ఇళ్ళు కట్టిస్తామన్నారు. ప్రధాన ప్రతి పక్షం కల్లబొల్లి మాటలు మాట్లాడుతుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు సీట్లు వచ్చే పరిస్థితి లేదన్నారు.
హైదరాబాద్ మూసారాంబాగ్ లో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్ మూసారాంబాగ్ లో ఉన్న ఒక రెడ్ రోజ్ బేకరీలో సోమవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగిసిపడటంతో
స్థానికులు భయం తో పరుగు తీశారు. మంటలను ఆర్పేందుకు ఐదు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని విజయవంతంగా మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తూ ఎటువంటి గాయాలు కాలేదు. అయితే, భారీగా ఆస్తి నష్టం జరిగింది అని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఆ స్థానాల్లో నిర్లక్ష్యం వహించవద్దు..
నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ అభ్యర్థులు, ఇన్చార్జ్ మంత్రులు, ఏఐసీసీ సెక్రెటరీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. జూమ్ సమావేశంలో ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఏఐసీసీ సెక్రటరీలు, ఎంపీ అభ్యర్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రేపు లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో వారికి పలు సూచనలు చేశారు. పోటాపోటీ ఉన్న నియోజకవర్గాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం ఉండవద్దన్నారు.
క్రికెట్ బ్యాటింగ్ చేస్తూ గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి..
ఈ మధ్యకాలంలో గుండెపోటు ప్రమాదాలు ఎక్కువైపోతున్నాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా కూలిపోతున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా.. ప్రతి ఒక్కరు గుండెపోటుతో మరణిస్తున్నారు. ఇటీవల కాలంలో గుండెపోటు మరణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. జిమ్ చేస్తుండగా, వాకింగ్ చేస్తుండగా, ఆడుతుండగా ఇలా చాలా సందర్భాల్లో నేలరాలిపోతున్నారు. తాజాగా ముంబైలో ఇలాంటి ఘటనే జరిగింది.
మళ్లీ తీహార్ జైలు కి కేజ్రీవాల్
సీఎం కేజ్రీవాల్ ఈరోజు మళ్లీ తీహార్ జైల్లో లొంగిపోయారు. ఇటీవల లోక్ సభ ఎన్నికలకు ప్రచారం చేసుకునేందుకు సుప్రీం కోర్టు కేజ్రీవాల్ కు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ను మంజూరు చేశారు. ఈరోజు తో మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో తిరిగి జైలుకు వెళ్లారు. మరొకవైపు అనారోగ్యం కారణంగా తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ను వారం రోజుల పాటు పొడిగించాలని సుప్రీం కోర్టులో సీఎం కేజ్రీవాల్ పిటిషన్ వేశారు . ఆ పిటిషన్ సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. కావునా మళ్లీ జైలు లో లొంగిపోయారు. ఇంటినుంచి బయలు దేరిన తరువాత మార్గం మధ్యలో రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీనికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత కన్నాట్ ప్లేస్ లోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించి హనుమంతుడి ఆశీస్సులు పొందారు. లొంగిపోయే ముందు ఆయన పార్టీ కార్యాలయాన్ని సందర్శించి కార్యకర్తలు, పార్టీ నేతలతో చర్చించి జైలులో లొంగిపోయారు.
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులతో మంత్రి తుమ్మల భేటీ
గడిచిన రెండు మూడు రోజులుగా కురిసిన వర్షాలు, వచ్చే 3-4 రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా అనేక జిల్లాలలో ఒక మోస్తరు నుండి భారీ వర్ష సూచన ఉన్నదని వాతావరణశాఖ అంచనాలతో, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, ఈ రోజు సంబంధిత అధికారులతో మాట్లాడి అన్ని జిల్లాల కలెక్టర్లను వ్యవసాయ అధికారులను అప్రమత్తంగా ఉండి, ఇప్పటికే అన్ని జిల్లాలకు సరఫరా చేసిన పచ్చరొట్ట, ప్రత్తి విత్తనాల ప్యాకెట్లను రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అందే విధంగా చూడాలని ఆదేశాలు ఇవ్వవల్సిందిగా కోరారు. రాష్ట్రవ్యాప్తంగా తేదీ 03.06.2024 నాటికి ప్రత్తి విత్తనాలు, నిన్న సరఫరా ఐన 10,43,474 ప్యాకెట్లతో కల్పి 84,43,474 సరఫరా కావడం జరిగిందని, ఇప్పటికే రైతులు 25,10,430 పత్తిప్యాకెట్లు రైతులు కొనుగోలు చేయడం జరిగిందని అధికారులు మంత్రి తెలియజేసారు.
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కాపాడడమే మా ప్రభుత్వ లక్ష్యం
ఇదిలా ఉంటే.. హనుమకొండలోని డీ కన్వెన్షన్ హాలులో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, గండ్ర సత్యనారాయణ, నాగరాజు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎంపీలు మధు యాష్కీ గౌడ్, సిరిసిల్ల రాజయ్య, సీతారాం నాయక్, పలువురు ఉద్యమకారులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ.. ఉద్యమకారుల ఆకాంక్షలు అమలుచేయడమే సిఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆనాడు 12 మంది ఎంపీ లు పార్లమెంట్ ను ఫుట్ ఆడుకోకపోతే తెలంగాణ వచ్చేది కాదని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కాపడడమే మా ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు.