భట్టిని పరామర్శించిన పొంగులేటి
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కొనసాగుతోంది. అయితే.. నిన్న భట్టి విక్రమార్క అస్వస్థతకు గురికావడం పాదయాత్రకు తాత్కాలిక విరామాన్ని ప్రకటించారు. అయితే.. ఇటీవల మాజీ బీఆర్‌ఎస్ నేత, ఖమ్మం మాజీ పార్లమెంటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారంటూ వార్తలు వస్తున్న వేళ.. అస్వస్థతకు గురైన భట్టి విక్రమార్కను నకిరేకల్ నియోజకవర్గం కేతేపల్లిలో పాదయాత్ర శిబిరంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు.
అయితే.. వడదెబ్బ కారణంగా రెండు రోజులుగా అస్వస్థతకు గురైన భట్టి విక్రమార్క ను పరామర్శించారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. భట్టి విక్రమార్క ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. అస్వస్థత నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్ లో జరుగుతున్న రాజకీయ సమీకరణలపై ఇద్దరి మధ్య ఏకాంతంగా చర్చలు సాగాయి. ఖమ్మంలో జరగబోయే పాదయాత్ర ముగింపు సభ, పార్టీలో చేరికల అంశంపై వారి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. నిన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెళ్లి.. పార్టీలోకి చేరాలని అప్పీల్ చేశారు. ఈ క్రమంలో ఇవాళ భట్టి తో పొంగులేటి భేటీతో ప్రాధాన్యత సంతరించుకుంది.
గృహలక్ష్మి పథకం.. మార్గదర్శకాలను విడుదల చేసిన ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. జియో ఎంఎస్25ని లాంచ్ చేసింది.. దీంతో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. సొంత భూమి ఉన్న పేదలకు మూడు దశల్లో రూ.3 లక్షలు పూర్తి సబ్సిడీతో మంజూరు చేస్తారు. గృహలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.12 వేల కోట్లు కేటాయించింది. సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని వారి కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో కనీసం 3 వేల ఇళ్ల చొప్పున ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4 లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మార్గదర్శకాల ప్రకారం.. లబ్ధిదారుడు ఎంపిక చేసుకున్న డిజైన్‌లో ఇంటిని నిర్మించుకోవచ్చు. అయితే, కనీసం 2 గదులు, ఒక టాయిలెట్ ఖచ్చితంగా ఉండాలి. జిల్లా స్థాయిలో కలెక్టర్, జీహెచ్‌ఎంసీలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఈ పథకాన్ని అమలు చేస్తారు. ఇందుకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
జైలులో నరమేధం.. గ్యాంగ్ వార్‌లో 46 మంది మహిళా ఖైదీల దారుణహత్య
సెంట్రల్ అమెరికా దేశం హోండూరస్ లో దారుణం చోటు చేసుకుంది. మహిళా ఖైదీలు ఉండే ఓ జైలులో ముఠా ఘర్షణలు జరిగాయి. ఇరు వర్గాలు దాడులకు తెగబడ్డాయి. తుపాకీ, కొడవళ్లు, మండే కెమికల్స్ ఉపయోగించి దాడికి తెగబడ్డారు. దీంతో 46 మంది ఖైదీలను ముఠా సభ్యులు హతమర్చారు. ముందుగా తుపాకీతో కాల్చేసి, కొడవళ్లతో దాడి చేసి, ఆ తరువాత మండే ద్రవం పోసి కాల్చి చంపారు. మంగళవారం ఈ సంఘటన జరిగింది. హోండురాస్ రాజధానికి వాయువ్యంగా 30 మైళ్ల (50 కిలోమీటర్లు) దూరంలో ఉన్న తమరా పట్టణంలోని జైలు ఈ ఘటన జరిగింది.
ఇటీవల జరిగిన సంఘటల్లో అత్యంత దారుణమైన సంఘటనగా దీన్ని అక్కడి ప్రభుత్వం పేర్కొంది. దేశ అధ్యక్షురాలు జయోమారా కాస్ట్రా ఈ ఘటనను భయకరమైన ఘటనగా అభివర్ణించారు. బారియో 18 సభ్యులు తమవారిని బెదిరించారని చనిపోయిన ఖైదీలకు చెందిన బంధువలు ఆరోపించారు. ఈ ఘటనతో జైలులో భీతావహ పరిస్థితి ఏర్పడింది. ఆయుధాలతో వ్యక్తులు ప్రత్యర్థి ముఠా సెల్ బ్లాక్ వద్దకు వెళ్లి తలుపులు మూసేసి వారిపై కాల్పులు జరిపారని అక్కడి పోలీస్ అధికారులు వెల్లడించారు. ప్రణాళిక ప్రకారం దాడికి తెగబడినట్లు వారు తెలిపారు. మహిళా గార్డులు ఉన్నా కూడా వారి ఏం చేయలేక నిస్సాయకులుగా మిగిలారు.
హైదరాబాద్‌లో జోరందుకోనున్న ఇళ్ల అమ్మకాలు.. మరో 5 నగరాల్లో ఇదే పరిస్థితి
హైదరాబాద్ తో పాటు పలు నగరాల్లో ఈ ఏడాది నివాస గృహాల విక్రయాల్లో 8-10 శాతం వృద్ధి నమోదు అవుతుందని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పటికీ, డిమాండ్ మెరుగ్గా ఉండటంతో దేశంలోని ఆరు నగరాల్లో ఈ ఏడాది ఇళ్ల విక్రయాలు పెరుగుతాయని తెలిపింది. వసూల్లు బాగుండటంతో పాటు రుణభారం తక్కువగా ఉండటంతో డెవలపర్ల క్రిడెట్ ప్రొఫైల్ కూడా బలోపేతం అవుతాయని నివేదిక తెలిపింది.
మిడ్, ప్రీమియం, లగ్జరీ విభాగాల్లో బలమైన అమ్మకాలు చోటు చేసుకోనున్నాయని, ఇది డెవలపర్ల క్రెడిట్ ప్రొఫైల్ మెరుగుపడేందుకు దోహదపడుతుందని వెల్లడించారు. మధ్యకాలికంగా కూడా ఈ థోరణి నిలదొక్కుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఇళ్ల అమ్మకాల్లో 35 శాతం వాటా ఉన్న 11 పెద్ద, 76 చిన్న/మధ్యతరహా డెవలపర్లతో సర్వే అనంతరం ఈ నివేదిక రూపొందించింది. హైదరాబాద్ తో పాటు ముంబై, ఢిల్లీ, పూణే, కలకతా, బెంగళూర్ నగరాలను ఇందుకు పరిగణలోకి తీసుకున్నారు.
2300 మంది పోలీసులతో భారీ బందోబస్తు.. అక్కడకు వెళ్లాలంటే కష్టమే..
నేడు తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. ఈనేపథ్యంలో అమర వీరుల స్మారక కేంద్రం ప్రారంభోత్సవానికి 2300 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇద్దరు ఎస్పీ స్థాయి అధికారులతో భద్రత నిర్వహిస్తున్నారు. లా అండ్ ఆర్డ్ తో పాటు 41 ప్లటూన్ల ఏఆర్, 10 ప్లటూన్ల టిఎస్‌ఎస్పీ, మరో 10 ప్లటూన్ల క్విక్ రెస్పన్స్ టీమ్ లు ఏర్పాటు చేశారు. విధుల్లో 800 మంది ట్రాఫిక్ సిబ్బంది ఉంటారు. ఎన్టీఆర్ మార్గ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ అంక్షలు విధించారు. మద్యాహ్నం 3గం నుంచి రాత్రి 10గం వరకూ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. నేడు ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, లుంబిని పార్క్, నక్లెస్ రోడ్ మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజల ఇబ్బందులు కలగకుండా ప్రత్యామార్గాలు ఏర్పాటుచేశారు.
కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి ఉద్యమాన్ని ఆపలేరు
రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతల అరెస్ట్‌లపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకుల అరెస్టులు అప్రజాస్వామికమన్నారు. కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి ఉద్యమాన్ని ఆపలేరు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ దశాబ్ది ఉత్సవాల పేరుతో పార్టీ ప్రచారం చేసుకుంటూ ప్రజాధనాన్ని దుర్వినియాగం చేస్తున్న విషయం వాస్తవం కాదా? అని, ఇది ఖచ్చితంగా దశాబ్ది దగా నే అంటూ వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఒక హామీ అయినా పూర్తిగా అమలు చేసారా? అని నిలదీశారు. సీఎం కేసీఆర్ ఇచ్చి అమలు చేయకుండా మోసం చేసిన హామీలనే తాము ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. ఇక ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలపై పోరాడే హక్కు ఉందన్నారు. కాంగ్రెస్ నాయకులను ముందస్తు అరెస్టులు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇలా కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి ఉద్యమాన్ని ఆపలేరన్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
కాంగ్రెస్ మునిగిపోయే నావా
కాంగ్రెస్ మునిగిపోయే నావ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో బీజేపీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో భాగంగా ఇవాల ఉదయం జిల్లాలోని 57వ డివిజన్ లో బండి సంజయ్ పర్యటించారు. మోడీ 9 ఏళ్ల పాలనను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏ మేరకు నెరవేర్చారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ జిమ్మిక్కులు చేస్తున్నారు. మీరు కట్టుకున్న ఇళ్లు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే బీఆర్‌ఎస్‌కు వేసినట్లే అన్నారు. ‘‘నేను బీఆర్‌ఎస్ మద్దతుతో గెలిస్తే.. రేవంత్‌రెడ్డి, ఉత్తమ్ ఎలా గెలిచారు? అతను అడిగాడు. పొన్నం ప్రభాకర్‌కు అసలు డిపాజిట్ వచ్చిందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ మునిగిపోతున్న నావ అని బండి సంజయ్ అన్నారు.
అప్రజాస్వామికంగా ప్రవర్తిస్తే తగిన గుణపాఠం చెపుతాం
అప్రజాస్వామికంగా ప్రవర్తిస్తే తగిన గుణపాఠం చెపుతామని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ నిరసనలు వ్యక్తం చేసే హక్కు ఉంటుందని అన్నారు. ప్రజల హక్కులను కాలరాసే విధంగా కేసీఆర్ ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులను అరెస్టులు చేయడం దుర్మార్గం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్రజాస్వామికంగా ప్రవర్తిస్తే తగిన గుణపాఠం చెపుతామని హెచ్చరించారు. అరెస్టులు చేసిన నాయకులను, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతల అరెస్ట్‌లపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకుల అరెస్టులు అప్రజాస్వామికమన్నారు. కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి ఉద్యమాన్ని ఆపలేరు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ దశాబ్ది ఉత్సవాల పేరుతో పార్టీ ప్రచారం చేసుకుంటూ ప్రజాధనాన్ని దుర్వినియాగం చేస్తున్న విషయం వాస్తవం కాదా? అని, ఇది ఖచ్చితంగా దశాబ్ది దగా నే అంటూ వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఒక హామీ అయినా పూర్తిగా అమలు చేసారా? అని నిలదీశారు. సీఎం కేసీఆర్ ఇచ్చి అమలు చేయకుండా మోసం చేసిన హామీలనే తాము ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. ఇక ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలపై పోరాడే హక్కు ఉందన్నారు. కాంగ్రెస్ నాయకులను ముందస్తు అరెస్టులు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇలా కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి ఉద్యమాన్ని ఆపలేరన్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.