తెలంగాణ కెప్టెన్‌గా ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్!
వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ మరోసారి బ్యాట్ పట్టేందుకు సిద్దమయ్యాడు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ (ఐవీపీఎల్)లో గేల్ ఆడనున్నాడు. ఐవీపీఎల్ మొదటి ఎడిషన్‌లో తెలంగాణ టైగర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని గేల్ స్వయంగా చెప్పాడు. వెటరన్ ప్రీమియర్ లీగ్‌తో మీ ముందుకు రాబోతున్నా, ఐవీపీఎల్ కోసం అందరూ సిద్దంగా ఉండండి అని యూనివర్సల్ బాస్ పేర్కొన్నాడు.
‘నాపై నాకున్న నమ్మకం, ప్రేక్షకుల శబ్దాలు నన్ను క్రికెట్ ఆడేలా చేస్తున్నాయి. వెటరన్ ప్రీమియర్ లీగ్ ద్వారా మీ యూనివర్సల్ బాస్ మైదానంలోకి అడుగుపెడుతున్నాడు. ఓల్డ్ ఈజ్ గోల్డ్.. ఐవీపీఎల్ కోసం సిద్ధంగా ఉండండి’ అని క్రిస్ గేల్ పేర్కొన్నాడు. బోర్డ్ ఫర్ వెటరెన్ క్రికెట్ ఇన్ ఇండియా (బీవీసీఐ) ఆధ్వర్యంలో ఐవీపీఎల్ టోర్నీ ఫిబ్రవరి 23 నుంచి మార్చి 3 వరకు జరగనుంది. డెహ్రాడూన్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఐవీపీఎల్ ఆరంభ ఎడిషన్ జరగనుంది.
మండుతున్న ఎండలు.. గ్రేటర్‌లో నగరవాసుల ఉక్కిరిబిక్కిరి
తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. మార్చి రాకముందే రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరి ప్రారంభం నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. గురువారం నాటికి ఉష్ణోగ్రత దాదాపు 40 డిగ్రీలకు చేరుకుంది. మరో నాలుగు రోజుల పాటు తీవ్ర వేడి వాతావరణం ఉంటుందని, ఆ తర్వాత 5 నుంచి 6 రోజుల పాటు వాతావరణం చల్లబడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉదయం, రాత్రి వేళల్లో చలి వాతావరణం ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 10, 11 తేదీల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్ తదితర ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ నెల 16 తర్వాత ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని వెల్లడించారు.
బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు దృష్టి పెట్టాం
బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు దృష్టి పెట్టామన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అందులో అంతర్భాగంగా గావ్ ఛలో అభియాన్ పేరుతో దేశంలో ఉన్న ఏడున్నర లక్షల పల్లెల్లో పర్యటిస్తామని ఆమె వెల్లడించారు. త్వరలో వచ్చే ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేస్తున్నామని ఆమె తెలిపారు. ఏపీలోని ప్రతి పల్లెను బీజేపీ కార్యకర్తలు సందర్శిస్తారన్నారు. పల్లెకు పోదాంలో భాగంగా ఏపీలో ఉన్న 21 వేల గ్రామాల్లో పర్యటనలు ఉంటాయని ఆమె అన్నారు. పల్లెకు పోదాంలో భాగంగా ఏపీలో ఉన్న 21 వేల గ్రామాల్లో 24 గంటల పాటు అక్కడ బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉంటారని పురందేశ్వరి తెలిపారు.
శివ బాలకృష్ణ కేసులో కీలక మలుపు.. ఐఏఎస్ అధికారి పేరు..!
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈకేసులో కస్టడి కన్ఫేషన్ స్టేట్మెంట్ కీలకంగా మారింది. కస్టడి కన్ఫేషన్ లో ఒక ఐఏఎస్ అధికారి పేరు ప్రస్తావన రావడంతో ఈ కేసుపై దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. పలువురి ఒత్తిడి మేరకే అక్రమాలు, ఆస్థులు అంటూ శివబాకృష్ణ స్టేట్మెంట్ ఇవ్వడం అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇప్పటికే శివ బాలకృష్ణ వద్ద డాక్యుమెంట్ లెక్కల ప్రకారం 1000 కోట్ల విలువైన ఆస్తులు ఏసీబి గుర్తించింది. 214 ఎకరాలు భూములు గుర్తించింది. బాలకృష్ణను 8 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించింది. శివ బాలకృష్ణ తోళపాటు ఇతర అధికారుల పాత్ర పై ఆరా తీస్తున్నారు. శివ బాలకృష్ణ బినామీలపై ఏసీబి దర్యాప్తు కొనసాగుతుంది. శివబాలకృష్ణ కేసులో ఈడీ, ఐటీ ఫోకస్ పెట్టింది. కేసు వివరాల సేకరణలో కేంద్ర దర్యాప్తు సంస్థలు కొనసాగుతున్నాయి. సోదరుడు నవీన్ అదుపులో తీసుకున్న అధికారులు మరో ఇద్దరి అరెస్ట్ కు రంగం సిద్ధం చేశారు. బెయిల్ పిటిషన్ ఫై నేడు విచారణ కొనసాగనుంది.
పాకిస్తాన్ ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్
పాకిస్థాన్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ప్రారంభ పోకడలు నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని PML-N… ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని PTI మద్దతు ఉన్న స్వతంత్ర అభ్యర్థుల మధ్య గట్టి పోటీని చూపుతున్నాయి. రెండు పార్టీలు ఇప్పటి వరకు 4-4 సీట్లు కైవసం చేసుకున్నాయి. యువనేత బిలావల్ భుట్టో జర్దారీ పార్టీ పీపీపీ 2 స్థానాల్లో విజయం సాధించింది. పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ దాదాపు 4 ఏళ్ల తర్వాత సార్వత్రిక ఎన్నికల కోసం పాకిస్థాన్‌కు తిరిగి వచ్చారు. కానీ అతను మన్సెహ్రా స్థానం నుండి ఓడిపోయాడు. ఈ సీటులో స్వతంత్ర అభ్యర్థి షహజాదా గస్తాసప్ ఘన విజయం సాధించాడు. షాజాదా గస్టాసాప్‌కు 74,713 ఓట్లు రాగా, నవాజ్‌కు 63,054 ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇది మాత్రమే కాదు, ప్రారంభ పోకడలలో తన పార్టీ ఓటమి తరువాత, లాహోర్‌లోని మోడల్ టౌన్‌లో నిర్మించిన విజయ ప్రసంగ వేదికను కూడా తొలగించినట్లు చెబుతున్నారు. షరీఫ్ కూడా మోడల్ టౌన్ నుంచి వెళ్లిపోయారు. ఒకవేళ ఆయన పార్టీ ఓడిపోతే మళ్లీ లండన్ వెళ్లే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి.
చంద్రబాబు రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేశారు
చిత్తూరు జిల్లా పుంగనూరు లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు పై హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు రుణమాఫీ చేస్తానని చెప్పి, మోసం చేశారని ఆరోపించారు. చంద్రబాబు అధికారంలో కి వచ్చినప్పుడు 14200 కోట్లు డ్వాక్రా రుణాలు ఉన్నాయి. నేడు వాటికి వడ్డీలకు వడ్డీలు అయ్యి 25 వేల కోట్లకు చేరిందని, సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో చంద్రబాబు ఇచ్చిన హామీలపై స్పందించారని ఆయన అన్నారు. అంతేకాకుండా.. చంద్రబాబు ఇచ్చిన హామీలు చూస్తే, ఏడాదికి రెండు లక్షల కోట్లు కావాలని, అసలు ఇది సాధ్యమేనా అని ప్రజలు ఆలోచన చేయాలన్నారు. మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు సిద్దం అయ్యారని, చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలు దొచుకున్నాయన్నారు.
అసెంబ్లీకి ఆటోలో వచ్చిన బీఆర్ఎస్ నేతలు.. మండలిలో నిరసన..!
ఆటో డ్రైవర్లపై ప్రభుత్వ తీరుకు నిరసనగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆటోల్లో అసెంబ్లీకి చేరుకున్నారు. ఎమ్మెల్యేలు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సుధీర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మల్లార్ రెడ్డి, వివేకానంద, మాధవరం కృష్ణారావు, పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్… హైదరాబాద్ హైదర్ గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఆటోల్లో అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డున పడ్డాయన్నారు. రెండు నెలల్లో 21 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే ఆటో కార్మికులను కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. డిమాండ్ లేకపోవడంతో 6.5 లక్షల మంది ఆటో కార్మికులు ఈఎంఐ చెల్లించలేక పస్తులుంటున్నారని వెల్లడించారు. చనిపోయిన డ్రైవర్ల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మికులకు నెలకు రూ.10 జీవనభృతి కల్పించే విధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ లో పొందుపర్చాలి.
షర్మిల ఇప్పుడు ఏ పార్టీలో ఉందో ఒక సారి గమనించాలి
షర్మిల పై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మంత్రి రోజా విశాఖలో మాట్లాడుతూ.. షర్మిల ఇప్పుడు ఏ పార్టీలో ఉందో ఒక సారి గమనించాలని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని జైలు పాలు చేసిన పార్టీతో చేతులు కల్పి అన్యాయం చేశారన్నారు. షర్మిల గారికి సలహా ఇస్తున్నానని, ఇప్పుడు తెలంగాణాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి నుండి మనకి రావాల్సిన 6 వేల కోట్లు అని, ఉమ్మడి ఆంధ్ర హయాంలో ఏపీకి రావాల్సిన లక్ష 80 కోట్ల ఆస్తులు రాబాట్టాలన్నారు. టూర్ లు పెట్టి ప్రచారం చేస్తున్నారని, తెలంగాణలో పోరాటం చేస్తా అని చెప్పి కాంగ్రెస్ లో విలీనం ఎందుకు చేసిందో షర్మిల చెప్పాలన్నారు మంత్రి రోజా.
మైండ్ సెట్ మార్చుకోండి.. పల్లా రాజేశ్వర్ రెడ్డికి పొన్నం కౌంటర్
ఇంకా వాళ్లు అధికారంలో ఉన్నాం అనుకుంటున్నారు.. మైండ్ సెట్ మార్చుకోండి అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికు రవాణా, బీసీ సంక్షేమశాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ఆర్టీసి ఉద్యోగులు ధర్నా చేస్తా బీఆర్ఎస్ సర్కార్ అప్పుడు పట్టించుకోలేదని గుర్తు చేశారు. 21 మంది అటో డ్రైవర్ లు ఆత్మ హత్యలు చేసుకున్నారు అని సభను తప్పు దారి పట్టిస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ ఉచిత బస్సు ప్రయాణం వ్యతిరేకిస్తున్నారా? అని ప్రశ్నించారు. ఫూడల్స్ ఇవాళ ఆటోలలో వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటో కార్మికులను అవమానిస్తున్నారని తెలిపారు. ఇంకా వాళ్లు అధికారంలో ఉన్నాం అనుకుంటున్నారని, మైండ్ సెట్ మార్చుకోవాలని సూచించారు.
తెలంగాణ కోసం ప్రాణం ఇచ్చిన వాళ్ళను పట్టించుకోలేదు వాళ్ళు అని మండిపడ్డారు. ఆటో వాళ్ళ గురించి మట్లాడుతున్నారు… చాలన్ పేరుతో ఆటో వాళ్ళను వేధించింది మీరు అని గుర్తు చేశారు. బస్సు దగ్గరికి ఆటో లోనే వచ్చేదని, మహిళలకు ఉచిత బస్సు వద్దా చెప్పండి? అని ప్రశ్నించారు. బెంజ్ కార్లో తిరిగే మీరు ఇప్పుడు ఆటో ఎక్కారూ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యూడల్స్ మీరు.. ఇప్పుడు ఆటో ఎక్కారు అంటూ మండిపడ్డారు. ఆటో కార్మికులను రెచ్చగొట్టొద్దు.. ఆత్మహత్యలకు ప్రోత్సహించెట్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ సొమ్ము అంతా వరంగల్ లో ఒకరు.. కరీంనగర్ లో ఒకరు.. ఆర్ముర్ లో ఒకరు అనుభవిస్తున్నారని, ఇప్పుడు మట్లాడుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారని తెలిపారు.
కంచెలు తీసి 3వేల మంది పోలీసులను పెట్టారు.. ఇదేనా మార్పంటే..?
మార్పు…మార్పు అంటున్నారు.. వంద ఎకరాల అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములపై విద్యార్థులు ఆందోళన చేస్తే పోలీసులు కొట్టారు…ఇదేనా మార్పు అంటే అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. ప్రగతి భవన్ కంచెలు తీసి …అసెంబ్లీ ముందు మాత్రం మూడు వేల మంది పోలీసులను పెట్టారు….ఇదేనా మార్పు ? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో రైతు ఆత్మ హత్యలు లేకుండే అని అన్నారు. రైతు భరోసా వెస్తం అన్నారు…రెండు లక్షల ఋణ మాఫీ ఓకే సారి చేస్తాం అన్నారు.. ఏమైంది ? అని ప్రశ్నించారు. కౌలు రైతుల గురించి గవర్నర్ ప్రసంగంలో లేనే లేదన్నారు. రైతు భరోసా ఎందుకు ఇస్థలేరు? అని ప్రశ్నించారు. బెదిరిస్తున్నరు.. సీఎం ను ప్రసన్నం చేసుకునేందుకు మంత్రుల తాపత్రయం పడుతున్నారని అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచండి.. అధాని నీ వద్దు అనుకుంటే…సిఎం ఒప్పందాలు చేసుకుని వచ్చారని ఆరోపించారు. రాహుల్ గాంధీ అన్నట్టే అధని పెట్టుబడులు వద్దన్నారు. అదాని వస్తె తెలంగాణ ప్రగతి ఆగిపోతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ను నిలదీయాలి…నిధుల కోసం డిమాండ్ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంతో లోపయికారి ఒప్పందం చేసుకుంటే తెలంగాణ సమాజం సహించదన్నారు. కేసీఅర్ పోరాటం చేసిన తర్వాత తెలంగాణ తెచ్చుకున్నామన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వలేదని స్పష్టం చేశారు. మేము తిట్టడం లేదు.. తెలంగాణ ఎలా వచ్చింది చెబుతున్నామన్నారు.
బీజేపీతో చంద్రబాబు అర్థరాత్రి చర్చల కారణమేంటి..?
ఏపీ రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి. ఆయా పార్టీ అధినేతలు ఢిల్లీ పర్యటనలతో ఏపీ రాజకీయాలు హస్తినకు చేరుకున్నట్లైంది. అయితే.. బీజేపీతో చంద్రబాబు చర్చలపై పేర్ని నాని ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన కృష్ణా జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీతో చంద్రబాబు అర్థరాత్రి చర్చల కారణమేంటి ? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వంతో చర్చలు జరిపితే మంచిదేనని, 2014లో బీజేపీ రాష్ట్రానికి అవసరం అన్నారు చంద్రబాబు అని ఆయన అన్నారు. 2019 వరకు కలిసి ఉండి చివర్లో మోసం చేసిందని బీజేపీని తిట్టారని, మోడీకి భార్యాపిల్లలు కుటుంబం లేని వ్యక్తి నాతో పోటీనా అని చంద్రబాబు విమర్శించారని ఆయన వ్యాఖ్యానించారు. మళ్ళీ కలిసి పోటీ చేయటంపై చర్చలు ఎందుకు ప్రజలకు సమాధానం చెప్పాలని పేర్ని నాని అన్నారు.