యూనివర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలపై సీఎం జగన్ సమీక్ష
యూనివర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలపై సీఎం జగన్ సమీక్ష చేయనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం కానున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఆర్జీయూకేటీ ఆధ్వర్యంలో నడుస్తున్న నాలుగు ట్రిపుల్ ఐటీల్లో ఖాళీల భర్తీకి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు సంబంధించి 650 ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ కేసీరెడ్డి తెలిపారు. మొత్తం ఖాళీల్లో 400 అసిస్టెంట్ ప్రొఫెసర్, 250 లెక్చరర్ పోస్టులను నవంబరులోగా పూర్తిచేస్తామని ఆయన వెల్లడించారు.
చిక్కుల్లో పన్నీరు సెల్వం కొడుకు.. మహిళ దెబ్బకు ప్రమాదంలో ఎంపీ పోస్టు
తమిళనాడు మాజీ సీఎం పన్నీరు సెల్వం కొడుకు రవీంద్రనాథ్ తాజాగా కొత్తు చిక్కుల్లో చిక్కుకున్నారు. ఆయన ఎంపీ పోస్టు ఊడిపోయే పరిస్థితి వచ్చింది. ఓ సామాన్య మహిళ ఆయనపై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలే అందుకు కారణం. తాను అన్నగా భావించిన వ్యక్తి తనపై ఆశపడ్డాడని, సహకరించకపోతే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ ఆ మహిళ కుండబద్దలు కొట్టింది. అతనిపై డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు సైతం చేసింది. ఆ మహిళ పేరు గాయత్రి దేవి. తానిచ్చిన ఫిర్యాదులో ఆమె ఏం పేర్కొన్నదంటే..
2014లో ఒక పెళ్లి సమయంలో తన కుటుంబానికి, పన్నీరు సెల్వం ఫ్యామిలీతో పరిచయం ఏర్పడినట్టు ఆమె తెలిపింది. క్రమంగా తమ రెండు కుటుంబాల మధ్య సాన్నిహిత్యం పెరిగిందని, దాంతో అందరం ఒకే కుటుంబం తరహాలో మెలిగే వాళ్లమని చెప్పింది. పన్నీరు సెల్వం తనయుడు అయిన రవీంద్రనాథ్‌ను తాను సొంత అన్నయ్యలాగా భావించానని, ఆ విధంగా అతనితో మెలిగానని పేర్కొంది. అయితే.. గతేడాది చివరి నుంచి రవీంద్రనాథ్ తనని వేధించడం మొదలుపెట్టాడని ఆరోపించింది. ఆయన మిత్రుడు ఒకరు తనకు ఫోన్ చేసి.. ‘నువ్వంటే రవీంద్రనాథ్‌కి ఎంతో ఇష్టం, నువ్వు సహకరిస్తే రాణిలా ఉంటావ్, లేకపోతే చంపేస్తాం’ అని బెదిరించాడని వెల్లడించింది.
అడ్వాన్స్ బుకింగ్స్ లో మరోసారి ట్రెండ్ సృష్టిస్తున్న మహేష్ సినిమా..
తెలుగులో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతుంది.గత ఏడాది మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఆయన కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ‘పోకిరి’ సినిమాని 4K రిజల్యూషన్ లో ఎంతో గ్రాండ్ గా విడుదల చేసారు.ఆ సినిమా ఏకంగా కోటి 75 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి ఆల్ టైం రికార్డు నెలకొల్పింది.. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ‘జల్సా’ సినిమాను రీ రిలీజ్ చేయగా ఆ సినిమా పోకిరి కలెక్షన్స్ ని అధిగమించింది.ఆ తర్వాత చాలా సినిమాలు విడుదల అయ్యాయి కానీ ఒక్కటి కూడా ఈ రెండు సినిమాల అంత ఇంప్యాక్ట్ ను క్రియేట్ చేయలేకపోయాయి.ఆ తరువాత పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఖుషి సినిమాని రీ రిలీజ్ చేసారు.ఈ చిత్రం రీ రిలీజ్ లో కూడా ప్రభంజనం సృష్టించింది.ఏ సినిమా అందుకోలేని అరుదైన రికార్డుని నెలకొల్పింది. మొదటి రోజు నాలుగు కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది.అలాగే ఫుల్ రన్ లో 8 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది.
టెస్లా మొదటి కార్యాలయం.. ఇండియాలో ఎక్కడో.. దాని అద్దెంతో తెలుసా?
ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్ కు చెందిన టెస్లా ఇండియా మోటార్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ పూణేలోని విమాన్ నగర్‌లోని పంచశీల్ బిజినెస్ పార్క్‌లో కార్యాలయ స్థలాన్ని అద్దెకు తీసుకుంది. గత వారంలో టెస్లా ఎగ్జిక్యూటివ్‌ల ప్రతినిధి బృందం భారతదేశంలో తన ఎలక్ట్రిక్ కార్లను విక్రయించడానికి ప్రోత్సాహకాలు, ప్రయోజనాల గురించి చర్చించడానికి వాణిజ్య, పరిశ్రమల మంత్రిని కలిసింది. టెస్లా ఇప్పుడు భారత్‌లో తన తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు స్పష్టమైంది. టెస్లా ప్రభుత్వంతో ఏకీభవిస్తున్నట్లు తెలుస్తోంది.
టెస్లా భారతీయ అనుబంధ సంస్థ పంచశీల్ బిజినెస్ పార్క్‌లోని B వింగ్ మొదటి అంతస్తులో 5,580 చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ కోసం టేబుల్‌స్పేస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఐదేళ్ల లీజు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆఫీస్ స్పేస్ కోసం అద్దె అక్టోబర్ 1, 2023 నుండి ప్రారంభమవుతుంది. రెండు కంపెనీలు సంవత్సరానికి 5 శాతం ఎస్కలేషన్ నిబంధనతో 36 నెలల లాక్-ఇన్ పీరియడ్‌ను అంగీకరించాయి. EV తయారీదారు ఈ లీజును మరో 5 సంవత్సరాలకు పొడిగించే అవకాశం ఉంది.
బర్త్‌డే కోసం ప్రియురాలి ఇంటికెళ్లాడు.. తీరా కిచెన్ రూంలో చూస్తే ఊహించని షాక్
ప్రియురాలి పుట్టినరోజుని ఘనంగా జరుపుకోవడం కోసం ఆమె ఇంటికెళ్లిన ఓ యువకుడు.. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది చూసి ఖంగుతిన్న అతని ప్రియురాలు కూడా సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించింది. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ప్రదీప్ (26), కావ్య (26) ఇద్దరూ స్కూల్ ఫ్రెండ్స్. నీలగిరి జిల్లా మసినగుడి మేయర్ ప్రాంతంలో నివాసముంటున్నాడు. చిన్నప్పుడు కలిసి చదువుకున్న వీళ్లిద్దరు.. గత ఆరు నెలల నుంచి ప్రేమించుకుంటున్నారు. ప్రదీప్ మైసూరులోని ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుండగా.. కావ్య బీలమెట్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది.
అందం కోసం బ్యూటీ పార్లల్ వెళితే.. బట్టతల చేసారు..!
అందానికి అద్దంగా మారడం ఒక అమ్మాయికే సొంతం. ముఖానికి పసుపు రాసుకుని జుట్టుకు కుంకుడుకాయ రసంతో స్నానం చేస్తే ఆమెరుపే వేరు. అలాంటి అందాన్ని వదిలేసి ఇప్పటి యువతులు బ్యూటీ పార్లర్లపై పడ్డారు. ముఖానికి, జుట్టుకు రకారకాల కాస్మిటిక్ లు వాడుతూ తమ అందాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. బతకడానికి కాకుండా అందం కోసం బ్యూటీ పార్లర్లను నమ్ముకుని దానికి ఎడిక్ట్ అవుతున్నారు. అయితే కాస్మిటిక్ వాడి చాలా మంది అందవికారంగా మారిన దాఖలాలు కూడా వున్నాయి. కొందరు అందం కోసం రకారకాల క్రీములు బ్యూటీ పార్లర్లలో ఉపయోగించడం వల్ల అందాన్ని పోగొట్టుకుని లబోదిబో మంటున్నా మనం మాత్రం బ్యూటీ కోసం పార్లర్లలనే నమ్మకుంటున్నారు. ఒక అమ్మాయి తన అందాన్ని రెట్టింపు చేసుకునేందుకు తన జుట్టును అందంగా ఒక షేప్ లో కత్తిరించాలని అనుకుంది. దానికోసం బ్యూటీ పార్లర్ల్ వెల్లింది. అయితే అక్కడ వెల్లిన అమ్మాయికి కథ అడ్డం తిరిగింది. ఎందుకంటే బ్యూటీ పార్లర్ లో ఆమె జుట్టుకు ఒక ఆయిల్ రాయడంతో జుట్టు ఊడిపోయింది. దీంతో ఆ యువతి, తన భర్త లబోదిబో మంటూ పోలీసులకు ఆశ్రయించిన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
ఉద్యోగ సంఘాల నేతలతో సీఎస్ సమావేశం
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతలతో మరోసారి సమావేశం నిర్వహించనుంది. సమావేశంలో ఉద్యోగుల ఆరోగ్య పథకం, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, హెల్త్ కార్డులు, 11వ పీఆర్సీ పెండింగ్ వంటి తదితర అంశాల గురించి చర్చలు జరుపనున్నారు. సీఎస్ కె.ఎస్ జవహర్ రెడ్డి అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశానికి.. ఆర్ధిక శాఖ, సాధారణ పరిపాలన, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఉద్యోగ సంఘాల నుంచి నేతలు బొప్పరాజు, బండి, సూర్యనారాయణ, వెంకట్రామిరెడ్డి తదితరులు హాజరై మరోమారు తమ డిమాండ్ల గురించి ప్రస్తావించనున్నారు. అయితే.. ఉద్యోగుల హెల్త్ స్కీం పై సమావేశం కానున్న స్టీరింగ్ కమిటీ.. సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయంలోని ఫస్ట్ బ్లాక్ లో సమావేశం జరుగనుంది.
తెలంగాణలో బీఆర్‌ఎస్ సంబరాలు
తెలంగాణ రైతు రుణ మాఫీ పథకం అమలు నేటి నుంచి ప్రారంభం కానుంది. సెప్టెంబర్ రెండో వారంలోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. అయితే.. దక్షిణాది రాష్ట్రంలో సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధిస్తారని, మెట్రో విస్తరణ పనులకు శ్రీకారం చుట్టడం తమ గెలుపు మనస్తత్వానికి నిదర్శనమని మంత్రి కేటీఆర్ జోస్యం చెప్పారు. అయితే.. సీఎం కేసీఆర్ రైతు రుణమాఫీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున సంబరాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇప్పటికే గత తొమ్మిది సంవత్సరాలకుపైగా రాష్ట్ర ప్రభుత్వం రైతన్నల సంక్షేమం, వారి అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను చేపట్టిందని కేటీఆర్ అన్నారు.
ఇండియన్ 2 సినిమా షూటింగ్ పై అసహనం వ్యక్తం చేస్తున్న అభిమానులు..
విశ్వనటుడు..కమల్ హాసన్ తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం లో 26 సంవత్సరాల క్రితం వచ్చిన భారతీయుడు భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.అప్పట్లో ఈ సినిమా ఇండియా వైడ్ గా ఎంతో సంచలనం సృష్టించింది.. తమిళం లో రూపొందిన ఈ సినిమా హిందీ మరియు తెలుగు లో రికార్డు స్థాయి కలెక్షన్స్ నమోదు చేయడం జరిగింది. అందుకే గత కొన్నేళ్లుగా అభిమానులు ఇండియన్ 2 సినిమా కోసం ఎంతగానో ఎదురు చూసారు. నాలుగు సంవత్సరాల క్రితం ఈ సినిమా షూటింగ్ ను దర్శకుడు శంకర్ ప్రారంభించాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఆగి పోయింది. దీనితో శంకర్ రామ్ చరణ్ తో ఒక సినిమా ను మొదలు పెట్టాడు. ఇంతలోనే కోర్టు ఆదేశాలు అలాగే ఇతర విషయాల కారణంగా ఇండియన్ 2 సినిమా ను శంకర్ మళ్లీ మొదలు పెట్టాడు.
లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ.. ఈనెల 15 నుంచి ప్రారంభం
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాల అమలులో స్పీడ్ పెంచింది. ప్రజలకు మేలు చేకూర్చేలా వివిధ పథకాలతో ప్రజలకు చేరువ కావడం హ్యాట్రిక్ విజయమన్నారు. గత రెండు నెలల్లోనే రెండో విడత గొర్రెల పంపిణీ, పోడు పట్టాల పంపిణీ, దళిత బంధు, బీసీ రూ. లక్ష ఆర్థిక సహాయం, రైతు బంధువులు, మైనార్టీలకు రూ. లక్ష సాయం ప్రకటించారు. నేటి నుంచి రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. తాజాగా మంత్రి కేటీఆర్ గ్రేటర్ హైదరాబాద్‌లోని పేదలకు శుభవార్త అందించారు. గ్రేటర్ పరిధిలో నిర్మించిన లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. నియోజకవర్గానికి 4 వేల చొప్పున గ్రేటర్ పరిధిలోని పేదలకు రెండు పడక గదుల ఇళ్లను పంపిణీ చేస్తామన్నారు.