Site icon NTV Telugu

AP Election Campaign: ఏపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న బీజేపీ అగ్రనాయకులు..

Bjp

Bjp

విజయవాడ : రాష్ట్రంలో ప్రచారం జోరందుకుంది. ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఎన్నికల ప్రచార సభల్లో బీజేపీ అగ్రనాయకులు, ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాధ్, అమిత్ షా, జేపీ నడ్డాలు రాష్ట్రానికి రానున్నట్లు బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ రాజు వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియలో అగ్రనాయకులు పాల్లొంటారని తెలిపారు. ఈ ఐదు సంవత్సరాలలో రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని.. యువత ఉద్యోగాలు లేక పొరుగు రాష్ట్రాలకి వెళ్లిపోతున్నారన్నారు.

Read Also: KS Jawahar: న్యాయం గెలిచింది.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

వ్యవసాయానికి పెద్దపీట వేస్తానని గద్దె ఎక్కిన అధికార పార్టీ వారిని మోసం చేసిందని ఆరోపించారు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన అన్నదాతలను ఆదుకోలేదని విమర్శించారు. మరొకసారి బస్సు యాత్ర పేరుతో ప్రజలని మోసం చేయటానికి సిద్ధం అయ్యారన్నారు. మోడీ ప్రభుత్వం 100 రకాల పథకాలతో పేదలకీ సంక్షేమ పథకాలు అందిస్తోందన్నారు.

Read Also: Thota Trimurthulu on Shiromundanam Case: నాకు అన్యాయం జరిగింది.. హైకోర్టుకు వెళ్తా..

రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పథకాలను పక్క దారి పట్టిస్తోందన్నారు. ప్రజలు ఎన్‌డీఏ కూటమికి మద్దతు పలికేందుకు సిద్ధంగా ఉన్నారని అభిప్రాయపడ్డారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చిన వెంటనే “వికసిత్ ఆంధ్రా వికసిత్ భారత్” దిశగా అడుగులు వేస్తోందని తెలిపారు. అలాగే రాష్ట్రంలో శాంతియుతంగా పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు చెప్పారు. దివ్యాంగులైన ఉపాధ్యాయులని ఎన్నికల విధులకి దూరంగా ఉంచాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.

Exit mobile version