Tomato Price: టమాటా ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. టమాటా ధరలు ఆకాశాన్నంటడంతో దానిని కొనుగోలు చేయడమే మానేశారు. గత రెండు వారాల్లో దేశంలోని వివిధ నగరాల్లో టమాటా ధర జెట్ స్పీడ్ వేగంతో పెరిగి 100ను దాటింది. దీంతో కొన్ని నగరాల్లో కిలో రూ.120 ధరకు విక్రయించడం ప్రారంభించారు. కానీ ఇప్పుడు టమోటాలు మరింత ఖరీదైనవిగా మారాయి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో టమోటా రిటైల్ ధర కిలో రూ. 160కి చేరుకుంది. అకాల వర్షాలు కూరగాయలపై చెడు ప్రభావం చూపాయి. ఈ కారణంగా దాదాపు అన్ని కూరగాయల ధరలు పెరిగాయి. అందులో ఎక్కువగానైతే టమోటాల ధరలు మండిపోతున్నాయి. తక్కువ దిగుబడి రావడం, వర్షం కారణంగా పంట దెబ్బతినడంతో డిమాండ్ మేరకు సరఫరా చేయడం లేదు. దీంతో టమాట ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. భోపాల్‌లోని విఠల్ మార్కెట్‌లో టమోటా ధర ఇప్పటికే అత్యధికంగా కిలో రూ.140 ఉండగా.. ఆదివారానికి ఆ ధర రూ.160కి చేరుకుంది.
Telugu Movies this week: ఈ వారం సినీ లవర్స్‌కి పండగే ఏకంగా 34 రిలీజులు
మరోవైపు టొమాటోతో పాటు ఉల్లి, బంగాళదుంప, బెండకాయ, అల్లం, పచ్చిమిర్చి-పచ్చికొత్తిమీర కూడా ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. మిర్చి, కొత్తిమీర హోల్ సేల్ మార్కెట్ లో కిలో రూ.125కు విక్రయిస్తున్నారు. అంతేకాకుండా వర్షం, తుపాను ప్రభావంతో కిలో అల్లం ధర రూ.200-250కి చేరింది. ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండిలో బీన్స్ కిలో రూ.110-120, క్యారెట్ రూ.100, క్యాప్సికం కిలో రూ.80కి విక్రయించారు. మొత్తంమీద గత రెండు వారాల్లో చాలా కూరగాయల ధరలు రిటైల్ మరియు హోల్‌సేల్ మార్కెట్‌లో పెరుగుతూనే ఉన్నాయి. పెరుగుతున్న టమాటా ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వం కూడా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. టొమాటో గ్రాండ్ ఛాలెంజ్‌ను వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ప్రపంచంలోనే టొమాటో ఉత్పత్తిలో భారతదేశం రెండవ అతిపెద్ద దేశంగా ఉంది.
Dhanush: రామ్ దేవ్ బాబా లుక్ కు మోక్షం కలిగిందయ్యా..
మరోవైపు గత గురువారం అన్నమయ్య జిల్లా మదనపల్లె వ్యవసాయ మార్కెట్ లో టమాటా ధర రికార్డు ధర పలికింది. కిలో టమాటా రూ.124 లకు పెరిగింది. సాధారణంగా మదనపల్లె మార్కెట్ కు రోజుకు 1500 టన్నుల టమాటా వస్తుంది. పచ్చి మిర్చి అయితే ఏకంగా రూ.160 చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు మార్కెట్లలో పచ్చి మిర్చి ధర రూ.140 నుంచి రూ.160 పలుకుతోంది. జనలు పచ్చి మిర్చి కొనడమే మానేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయితీతో రైతులకు టమాటాలు అందిస్తోంది. 50 రాయితీతో రైతు బజార్ల ద్వారా టమాటాలను అమ్ముతోంది. కడప, కర్నూలు జిల్లాల్లో ఇప్పటికే అమల్లోకి తీసుకువచ్చారు. కాగా త్వరలోనే ఈ పథకాన్ని అన్ని జిల్లాలకు విస్తరించనుంది.