అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి అన్నట్టుగా మారింది టమోటా రైతుల (Tomato Farmers) పరిస్థితి. మార్కెట్లోకి వెళ్ళి టమోటా కొనే వినియోగదారులు భారీగా ధర చెల్లించాల్సి వస్తోంది. కేజీ 15 నుంచి 20 రూపాయల వరకూ ధర పలుకుతోంది. అదే ఖరీదైన సూపర్ మార్కెట్లయితే చెప్పాల్సిన పనిలేదు. కేజీ 25 రూపాయల పైమాటే. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టమోటా రైతులు గిట్టుబాటు ధర లభించక నానా ఇబ్బందులు పడుతున్నారు. మదనపల్లె మార్కెట్ కు రికార్డు స్ధాయిలో టమోటా పంట చేరింది. ఇటీవల వర్షాలు పడడంతో దిగుబడి కూడా భారీగానే ఉంది.
Read Also: Pushpa 2 : పుష్ప 2 లో గిరిజన యువతి పాత్రలో మెగా డాటర్ నిహారిక ?
585 టన్నుల టమోటాను మార్కెట్ కు తీసుకొని వచ్చిన రైతులు..ధర లేక ఆందోళన చెందుతున్నారు. కేజీ టమోటా ధర ప్రస్తుతం రెండు నుండి మూడు రూపాయలు పలుకుతుంది. వ్యాపారస్తులు సిండికేట్ తో కనీస ధర రావడం లేదని ఆవేదన చెందుతున్నారు టమోటా రైతులు.
కూలీలు, ట్రాన్స్ పోర్ట్ ఛార్జీలు పోను తిరిగి ఇంటికి తీసుకెళ్ళడానికి కూడా డబ్బులు మిగలడం లేదంటున్నారు రైతులు. కూలీలను పెట్టుకోలేక పంటను పొలంలోనే వదిలేస్తున్నారు రైతులు. టమోటా ధర ఎప్పుడు పెరుగుతుందో.. ఎప్పుడు తగ్గుతుందో తెలీడం లేదని మరికొందరు రైతులు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వమే టమోటాలను కొనుగోలు చేసి రైతుబజార్ల ద్వారా సరఫరా చేయాలని రైతులు అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచిస్తున్నారు.
Read Also:Chikoti Praveen: 12వ తేదీ రావాల్సిందే.. చీకోటికి మరోసారి ఈడీ నోటీసులు..