Tollywood Upcoming Movies: సినిమా మీద హైప్ క్రియేట్ చేయాలంటే అంత ఆషామాషి విషయం కాదు. ప్రమోషన్ కంటెంట్ పాత ఫార్ములా. టీజర్లు, పోస్టర్లు, పాటలు, ఇంటర్వ్యూలు… ఇలా ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌ని ఎంగేజ్ చేస్తేనే బజ్ పెరుగుతుందని అందరూ నమ్మేవారు. కానీ, ఇప్పుడు ఆ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఈ జనరేషన్‌లోని స్టార్ హీరోలు, టాప్ డైరెక్టర్లు మాత్రం “నో అప్‌డేట్ – మోర్ హైప్” అనే కొత్త ఫార్ములాతో వెళ్తున్నారు.
ఈ విషయంలో ప్రభాస్ విషయానికి వస్తే.. పరిస్థితి వేరే లెవెల్‌లో ఉంది. కల్కి 2898 AD విడుదల తర్వాత ఆయన తర్వాతి సినిమాలు రాజా సాహెబ్, ది స్పిరిట్, ఫౌజీల గురించి అధికారిక సమాచారం లేకపోయినా.. ప్రతిరోజు ఈ సినిమాలు ట్రెండింగ్ లిస్ట్‌లో ఉంటున్నాయి. ఒక్క చిన్న రూమర్ వచ్చినా సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ మొదలవుతోంది. ఇక ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ లాంటి గ్లోబల్ హిట్స్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి మహేష్ బాబుతో చేస్తున్న సినిమా ప్రపంచవ్యాప్తంగా హైప్ సృష్టిస్తోంది. షూటింగ్ మొదలై నెలలు గడిచినా ఇప్పటివరకు ఒక్క పోస్టర్, ఒక్క అప్‌డేట్ కూడా రాలేదు. కానీ ఆ మిస్టరీనే ఫ్యాన్స్‌లో అంచనాలను మరింత పెంచుతోంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు #SSMB29 ట్యాగ్ ట్రెండ్ అవుతూనే ఉంది.
Triangle Horror: ఎవడ్రా నువ్వు.. ఇంత వైలెంట్ గా ఉన్నావ్.. గర్భిణీపై దాడి చేసిన ప్రియుడు
ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. తమిళ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అనౌన్స్మెంట్ వీడియో విడుదలైన తర్వాత ఎలాంటి కొత్త అప్‌డేట్ రాకపోయినా సినిమా బజ్ మాత్రం తగ్గలేదు. ఫ్యాన్స్ రకరకాల ఫ్యాన్‌మెడ్ పోస్టర్లు, కాన్సెప్ట్ డిజైన్స్‌తో సినిమాను సోషల్ మీడియాలో ట్రెండ్‌లో ఉంచుతున్నారు. మొత్తంగా ఇప్పుడు ప్రమోషన్ కంటే, ఫ్యాన్స్ ఉత్సాహమే సినిమాలకు బజ్ తీసుకువస్తోంది. స్టార్ హీరో పేరే సరిపోతుంది.. ఒక్క అప్‌డేట్ లేకున్నా ట్రెండింగ్ టాపిక్‌గా మారిపోతుంది.
