Site icon NTV Telugu

2027 Sankranthi : మళ్లీ బరిలోకి చిరు vs ప్రభాస్..మధ్యలో బాలయ్య?

2027 Sankranthi

2027 Sankranthi

2027 Sankranthi : టాలీవుడ్‌లో సంక్రాంతి అంటే కేవలం పండగ మాత్రమే కాదు, బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాల జాతర, 2026 సంక్రాంతి సందడి మొదలవ్వకముందే, అప్పుడే 2027 సంక్రాంతి బరిలో నిలబడబోయే సినిమాలపై సోషల్ మీడియాలో భారీ చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, వచ్చే ఏడాది పొంగల్ రేసులో టాలీవుడ్ అగ్ర హీరోలు పోటీ పడటం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న స్పిరిట్ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ‘యానిమల్’ వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత వంగా తీస్తున్న సినిమా కావడంతో, ఇది పక్కాగా 2027 సంక్రాంతికి వస్తుందని టాక్. ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాయడం ఖాయం.

READ ALSO: Priya Kapoor: రూ.30 వేల కోట్ల ఆస్తి వివాదం.. సుప్రీంకోర్టు మెట్లేక్కిన వ్యాపారవేత్త రెండో భార్య!

అలాగే మెగాస్టార్ చిరంజీవి – బాబీ కొల్లి కాంబినేషన్‌లో ఇప్పటికే ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది, ఇప్పుడు వీరిద్దరూ మళ్ళీ జతకడుతుండటంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ కూడా సంక్రాంతి సీజన్‌ను టార్గెట్ చేస్తూ పట్టాలెక్కనుంది. సంక్రాంతి అంటే విక్టరీ వెంకటేష్, కామెడీ అంటే అనిల్ రావిపూడి, వీరిద్దరి కాంబోలో వచ్చే సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఫేవరెట్. ఇప్పటికే మూడు హిట్లు అందుకున్న వీరిద్దరూ, నాలుగో సినిమాతో 2027 సంక్రాంతికి వినోదాల విందు అందించేందుకు సిద్ధమవుతోంది. మరోపక్క నేచురల్ స్టార్ నాని, యంగ్ డైరెక్టర్ సుజీత్ కాంబోలో ఒక విభిన్నమైన యాక్షన్ ఎంటర్‌టైనర్ రాబోతోంది. సుజీత్ మేకింగ్ స్టైల్ నానికి ఎలా సెట్ అవుతుందో చూడాలని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు, ఈ సినిమా కూడా సంక్రాంతి రేసులో ఉండే బలమైన ప్రాబబుల్స్ జాబితాలో ఉంది.

నందమూరి బాలకృష్ణ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ సినిమా షూటింగ్ వేగంగా పూర్తయితే సంక్రాంతికి లేదా అంతకన్నా ముందే అంటే 2026 డిసెంబర్‌లోనే వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఒకవేళ ఏవైనా కారణాల వల్ల ఆలస్యమైతే మాత్రం సంక్రాంతి బరిలోకి దిగడం పక్కా. ఈ లెక్కన ఈ ఐదు సినిమాల్లో కనీసం మూడు సినిమాలు ఖచ్చితంగా 2027 సంక్రాంతి బరిలో నిలుస్తాయని ట్రేడ్ వర్గాల అంచనా. ఒకవేళ ఇదే జరిగితే, బాక్సాఫీస్ వద్ద మళ్ళీ ఓ భారీ పోరును మనం చూడబోతున్నాం.

READ ALSO: Dhurandhar 2: రికార్డులు తిరగరాయడానికి వస్తున్న ‘ధురంధర్ 2’.. రిలీజ్ అప్‌డేట్‌తో బాంబ్ పేల్చిన డైరెక్టర్!

Exit mobile version