సాధారణంగా సంక్రాంతికి ఇద్దరు లేదా ముగ్గురు పెద్ద హీరోలు పోటీ పడటం చూస్తుంటాం. కానీ, టాలీవుడ్ ‘ఫ్యాబ్ ఫోర్’ (Fab Four) అని పిలవబడే చిరు-బాలయ్య-నాగ్-వెంకీలు ఒకేసారి బరిలోకి దిగడం ఒక అరుదైన రికార్డు. 2027 సంక్రాంతికి ఈ నలుగురు దిగ్గజాలు తమ సినిమాలతో థియేటర్లను దద్దరిల్లజేయడానికి సిద్ధమవుతున్నారు.
Also Read : Allu Arjun : అభిమానం అంటే ఇదే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కీలక నిర్ణయాలు
‘సంక్రాంతి స్పెషలిస్ట్’ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ తన తదుపరి చిత్రాన్ని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ సంక్రాంతికి రావడం దాదాపు ఖాయమైంది. ఇక అన్నపూర్ణ స్టూడియోస్ ఇప్పటికే తమ ‘సోగ్గాళ్లు’ సినిమాను జనవరి 15, 2027న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇది ‘బంగార్రాజు’కి సీక్వెల్ అని, ఇందులో అక్కినేని ముగ్గురు హీరోలు (నాగార్జున, చైతన్య, అఖిల్) కనిపించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అలాగే ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత చిరు-బాబీ కాంబో మళ్లీ రిపీట్ కాబోతోంది. ఒక..
పవర్‌ఫుల్ మాస్ ఎంటర్టైనర్‌తో మెగాస్టార్ సంక్రాంతి బరిలో నిలవడానికి సిద్ధమవుతున్నారు. ఇక నందమూరి బాలకృష్ణ – గోపీచంద్ మలినేని ఇప్పుడు NBK111తో మళ్ళీ మ్యాజిక్ చేయాలని చూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా డిసెంబర్ కల్లా పూర్తి చేసి పండగ రేసులో నిలపాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. కాగా ఈ నలుగురు సీనియర్ హీరోలకు అన్ని వర్గాల ప్రేక్షకుల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. కొత్త తరం హీరోల హవా కొనసాగుతున్నా, తమ మ్యాజిక్ ఇంకా తగ్గలేదని నిరూపించడానికి వీరంతా ఒకేసారి పోటీకి దిగడం సినీ ప్రియులకు కనువిందు చేయనుంది.
