Site icon NTV Telugu

Cine Roundup : టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.. సినీ రౌండప్

Ciniroundup

Ciniroundup

Tollywood : మంచు విష్ణు నటిస్తూ నిర్మించిన చిత్రం కన్నప్ప. శరత్ కుమార్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, రెబల్ స్టార్ ప్రభాస్ వంటి స్టార్స్ నటించిన ఈ సినిమా రేపు థియేటర్స్ లో రిలీజ్ కాబోతుండగా అడ్వాన్స్ బుకింగ్స్ ను ఓపెన్ చేసారు మేకర్స్.  ఇప్పటి వరకు 1st Day అడ్వాన్స్ సేల్స్ చూస్తే ఆల్ ఇండియా – 1,473 షోస్ కు గాను రూ. 1.66కోట్లు , 17.19% ఆక్యుపెన్సీ  కలిగి ఉంది. ఏపీలో రూ. 79 లక్షలు తెలంగాణలో రూ.75 లక్షలు రాబట్టింది. 

Kollywood : థగ్ లైఫ్‌తో భారీ డిజాస్టర్ చూసిన కమల్ హాసన్.. నెక్ట్స్ స్టంట్ మాస్టర్స్ అన్బరివు దర్శకత్వంలో సినిమాను ప్లాన్ చేశాడు. ఎనౌన్స్ మెంట్ జరిగినా.. ఇంకా సెట్స్ పైకి సినిమాను తీసుకెళ్లలేదు. ఆగస్టులో షూటింగ్ స్టార్టయ్యే ఛాన్స్ ఉందని టాక్. మరోవైపు నిర్మాతగా కూడా బిజీగా మారారు కమల్. వీర ధీర శూరన్‌తో విక్రమ్ ఖాతాలో హిట్ వేసిన ఎస్‌యు అరుణ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా నిర్మిస్తున్నాడట కమల్. స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ స్టేజ్‌లో ఉందని టాక్. అన్ని కుదిరితే  ఆయనే హీరోగా నటించే అవకాశాలు కూడా ఉన్నాయని సమాచారం.

Bollywood :  కియారా అద్వానీ ప్రెగ్నెన్సీతో ఉన్నా కూడా ఇప్పటి నుండే నెక్ట్స్ సినిమాలపై ఫోకస్ చేస్తోంది. గేమ్ ఛేంజర్‌తో భారీ డిజాస్టర్ చూసిన కియారా ప్రజెంట్ కన్నడలో టాక్సిక్‌లో నటిస్తోంది. ఇప్పటికే డాన్స్ 3 నుండి తప్పుకున్న కియారా వద్దకు మరో మూవీ ఆఫర్ వచ్చినట్లు సమాచారం. లెజెండరీ యాక్టర్ మీనా కుమారి బయోపిక్ ఆధారంగా ఓ మూవీని తెరకెక్కించాలని ప్లాన్ జరుగుతోంది. కమల్ ఔర్ మీనా పేరుతో ఓ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. సిద్దార్థ్‌ పి మల్హోత్రా దర్శకుడు. ఇందులో మీనా కుమారి పాత్ర కోసం కియారాను అప్రోచ్ అయ్యారట. ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. కానీ ఇదంతా పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత ఆమె సెట్స్‌పై అడుగుపెట్టనుందని సమాచారం.

Exit mobile version