Sandeep Raj Engagement: నటితో టాలీవుడ్ డైరెక్టర్ ఎంగేజ్మెంట్.. పిక్స్ వైరల్!
- ఓ ఇంటివాడు కాబోతున్న టాలీవుడ్ డైరెక్టర్
- నటి చాందినీ రావుతో ఎంగేజ్మెంట్
- డిసెంబర్ మొదటి వారంలో పెళ్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రాజ్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. నటి చాందినీ రావుతో సందీప్ ఎంగేజ్మెంట్ సోమవారం గ్రాండ్‌గా జరిగింది. నిశ్చితార్థంకు సంబంధించిన ఫోటోలను సందీప్ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సందీప్-చాందిని ఎంగేజ్మెంట్ విశాఖపట్నంలో జరిగినట్టు సమాచారం. డిసెంబర్ మొదటి వారంలో ఈ జంట పెళ్లి జరగనున్నట్లు తెలిసింది.
సందీప్ రాజ్ షార్ట్ ఫిల్మ్స్‌తో నటుడు, దర్శకుడిగా కెరీర్ ఆరంభించారు. ఎన్నో మంచి షార్ట్ ఫిల్మ్స్ చేసిన ఆయన ‘కలర్ ఫొటో’తో సూపర్ సక్సెస్ అందుకున్నారు. సుహాస్ హీరోగా రూపొందిన కలర్ ఫొటో ఉత్తమ తెలుగు చిత్రం విభాగంలో జాతీయ పురస్కారం అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రాజీవ్ కనకాల తనయుడు రోషన్ హీరోగా ‘మోగ్లీ’ సినిమాను సందీప్ తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా విడుదల కానునట్లు తెలుస్తోంది.
Also Read
- Pakistan: పాకిస్తాన్లో టెన్షన్ టెన్షన్.. ఇస్లామాబాద్ చుట్టూ కంటైనర్ గోడలు, ఆస్పత్రుల్లో హైఅలర్ట్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై ఫోకస్.. కేబినెట్ భేటీ తర్వాత మంత్రులకు సీఎం దిశానిర్దేశం
- Electric Scooter: ఒక్కసారి చార్జ్ చేస్తే 400 కి.మీ వెళ్లొచ్చు.. ఆఫీస్‌కు వెళ్లేవారికి బెస్ట్ ఇ-స్కూటర్ ఇదే..
- Saikrishna Lockup Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సుప్రీంకోర్టులో కీలక పరిణామం..
Also Read: Extramarital Affair: సొంత సోదరుడితో భార్య ఎఫైర్.. ఆత్మహత్య చేసుకున్న భర్త!
సందీప్ రాజ్ డైరెక్టర్ చేసిన కలర్ ఫొటో సినిమా, హెడ్స్ అండ్ టేల్స్ వెబ్ సిరీస్‌లో చాందిని రావు నటించారు. కలర్ ఫొటో చిత్రీకరణ సమయంలోనే సందీప్, చాందినిలు ప్రేమలో పడ్డారట. ఇప్పుడు పెద్దల అంగీకారంతో ఒక్కటి కాబోతున్నారు. డిసెంబర్ 7న తిరుపతిలో ఈ జంట పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన నెటిజన్లు, చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సందీప్-చాందినికి శుభాకాంక్షలు తెలియజేశారు.
తాజావార్తలు
-
Cab Driver Rajasekhar : క్యాబ్ కోసం పక్కా స్కెచ్.. డ్రైవర్ రాజశేఖర్ హత్య కేసులో ముగ్గురు అరెస్ట్.!
-
Pakistan: పాకిస్తాన్లో టెన్షన్ టెన్షన్.. ఇస్లామాబాద్ చుట్టూ కంటైనర్ గోడలు, ఆస్పత్రుల్లో హైఅలర్ట్..
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై ఫోకస్.. కేబినెట్ భేటీ తర్వాత మంత్రులకు సీఎం దిశానిర్దేశం
-
Zodiac Signs : దసరా వేళ ఈ 5 రాశులకు జాక్‌పాట్.!
-
Cine Dancers Association : డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలతకు ఘోర పరాభవం, ప్యానెల్ రద్దు!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!