Site icon NTV Telugu

Tollywood : టాలీవుడ్‪లో విలన్స్‌గా మారుతోన్న మాలీవుడ్ హీరోస్

Tollywood

Tollywood

మాలీవుడ్ హీరోయిన్స్‌నే కాదు.. హీరోలను టాలీవుడ్ పిలుస్తోంది. ఇక్కడ విలన్స్‌గా ఆఫర్స్ కట్టబెడుతోంది. అక్కడ టాప్ హీరోలుగా కొనసాగుతున్న స్టార్స్ కొందరు.. బిగ్ స్కేల్ చిత్రాల్లో నెగిటివ్ రోల్స్ చేయడానికి వెనకాడటం లేదు. భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేయడంతో పాటు ఇక్కడ మార్కెట్ క్రియేట్ చేసుకునేందుకు.. పాన్ ఇండియా ఐడెంటీటీ కోసం ఇటు వైపుగా చూస్తున్నారు. ఇప్పటికే పుష్పతో బన్వర్ సింగ్ షెకావత్‌గా రిజిస్టర్ అయ్యాడు ఫహాద్ ఫజిల్. పార్టీ లేదా పుష్ప అంటూ ఒక్క డైలాగ్‌తో ఫేమ్ తెచ్చేసుకున్నాడు. నెక్ట్స్ హీరోగా ఇంట్రడ్యూస్ కాబోతున్నాడు

Also Read : NtrNeel OTT Deal : డ్రాగన్ నెట్ ఫ్లిక్స్ ఓటీటీ డీల్.. అదీ ఎన్టీఆర్ రేంజ్

మాలీవుడ్ స్టార్ హీరో పృధ్వీరాజ్ సుకుమారన్ గతంలో తెలుగులో సినిమాలు చేసినా రాని ఐడెంటీటీ.. సలార్‌తో సాధించాడు. ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్‌గా వరద రాజ మన్నార్ పాత్రలో కేక పుట్టించాడు. నెక్ట్స్ గ్లోబల్ స్థాయిలో తెరకెక్కుతోన్న వారణాసిలో నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడు. రణ కుంభగా యాంటోగనిస్టుగా కనిపించబోతున్నాడు. జక్కన్న తన ప్రతి సినిమాలో హీరోతో పాటు విలన్ క్యారెక్టర్స్‌ను హైలెట్ చేస్తుంటారు. వారణాసిలో కూడా పృధ్వీ రోల్ ఎలా ఉండబోతోందో రీసెంట్లీ రిలీజ్ చేసిన రణ కుంభ లిరికల్ వీడియోలోనే చెప్పకనే చెప్పేశాడు జక్కన్న. టాలీవుడ్‌లో ఫ్రూవ్ చేసుకునేందుకు వచ్చేస్తోన్న మరో మల్లూవుడ్ స్టార్ హీరో టొవినో థామస్. ఫోరెన్సిక్, మిన్నల్ మురళి, 2018, ఏఆర్ఎం వంటి ఓటీటీ చిత్రాలతో తెలుగు ప్రేక్షకకులకు చేరువైన టొవినో.. నెక్ట్స్ ప్రశాంత్ నీల్- తారక్ మూవీలోకి ఎంటర్ కాబోతున్నాడు. తారక్‌తో తలపడేందుకు సిద్ధమౌతున్నాడు. జోర్దాన్‌లో యంగ్ టైగర్ అండ్ మిన్నల్ మురళిపై హై ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు నీల్. నెల రోజుల పాటు షూట్ జరగనుందట. దశాబ్దకాలం క్రితం వరకు మాలీవుడ్ అంటే మమ్ముట్టి, మోహన్ లాల్ మాత్రమే టాలీవుడ్‌కు తెలుసు.. అదీ స్టార్ హీరోలుగా. కానీ ఇప్పుడు జస్ట్ ఫర్ ఛేంజ్. విలన్స్‌గా బిగ్ ప్రాజెక్ట్స్‌లో ఆఫర్స్ కొల్లగొడుతున్నారు మల్లూ స్టార్ హీరోస్.

Exit mobile version