Subbaraju Marriage: లేటు వయసులో పెళ్లి చేసుకున్న నటుడు సుబ్బరాజు.. వధువు ఎవరంటే?
- వివాహ బంధంలోకి సుబ్బరాజు
- ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి ఫొటోస్ షేర్ చేసిన సుబ్బరాజు
- అనుకోకుండా ఇండస్ట్రీలోకి సుబ్బరాజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ప్రముఖ నటుడు సుబ్బరాజు సంతోష్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా ఆయనే వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసి.. పెళ్లి ఫోటోను షేర్ చేశారు. సుబ్బరాజు తన పెళ్లి గురించి ఎలాంటి హడావుడి చేయకుండా.. సైలెంట్‌గా కానిచ్చేరు.పెళ్లి ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడంతో అందరూ షాక్ అయ్యారు. అదే సమయంలో శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం సుబ్బరాజు పెళ్లి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఎన్నో సార్లు ఇంటర్వ్యూల్లో పెళ్లి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఆసక్తి లేదు అని సుబ్బరాజు చెప్పిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు 47 ఏళ్ల వయసులో పెళ్లి పీటలు ఎక్కారు. ప్రముఖ కమెడియన్ వెన్నెల కిషోర్‌తో పాటు పలువురు ప్రముఖులు నూతన జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. సుబ్బరాజు సతీమణి గురించి డీటెయిల్స్ ఇంకా తెలియరాలేదు. భీమవరంలో పుట్టి పెరిగిన సుబ్బరాజు అనుకోకుండా ఇండస్ట్రీలోకి వచ్చారు. డైరెక్టర్ కృష్ణవంశీ కంప్యూటర్ బాగు చేసేందుకు వచ్చిన సుబ్బరాజు.. అనుకోకుండా సినీ అవకాశం దక్కించుకున్నారు. ఖడ్గం సినిమాలో ఒక చిన్న పాత్రతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.
Also Read
- Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
- Umar Khalid Documentary: IIIT-హైదరాబాద్‌లో ఉమర్ ఖాలిద్ డాక్యుమెంటరీ ప్రదర్శన.. CBFC హెచ్చరికతో కీలక మలుపు
- Soft Roti Tips: ప్రతి రొట్టె బెలూన్లా పొంగాలి.. మెత్తగా ఉండాలా..? అయితే, ఈ చిట్కాలు పాటించండి
- Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం వెనుక ఆ ఇద్దరే.. సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన కాటేరమ్మకొడుకు
అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలో నటించిన సుబ్బరాజుకు మంచి గుర్తింపు దక్కింది. పూరి జగన్నాధ్ సినిమాలలో వరుసగా నటిస్తూ.. పాపులర్ అయ్యారు. తక్కువ సమయంలోనే మంచి పాత్రల్లో నటించి స్టార్ అయ్యారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా, కమెడియన్‌గా.. అన్ని పాత్రల్లో అలరించారు. తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ సుబ్బరాజు సినిమాలు చేశారు. అన్ని భాషల్లో కలిపి వందకు పైగా సినిమాల్లో నటించారు. ఆర్య, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి, పోకిరి, ఖలేజా, బిజినెస్ మ్యాన్, బాహుబలి 2, దూకుడు, గీతా గోవిందం, ఎఫ్ 2, సర్కారు వారి పాట లాంటి హిట్ సినిమాల్లో సుబ్బరాజు నటించారు.
తాజావార్తలు
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
-
Ibrahim Zadran: మేము బాగా ఆడాం.. ఐయామ్ ఫుల్ హ్యాపీ.. అఫ్గాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Umar Khalid Documentary: IIIT-హైదరాబాద్‌లో ఉమర్ ఖాలిద్ డాక్యుమెంటరీ ప్రదర్శన.. CBFC హెచ్చరికతో కీలక మలుపు
-
Quick Style: హైదరాబాద్‌కు వరల్డ్ ఫేమస్ డ్యాన్స్ ట్రూప్.. నవంబర్ 1న అదిరిపోయే డ్యాన్స్ షో!
-
Soft Roti Tips: ప్రతి రొట్టె బెలూన్లా పొంగాలి.. మెత్తగా ఉండాలా..? అయితే, ఈ చిట్కాలు పాటించండి
ట్రెండింగ్
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!