మాజీ మంత్రి పేర్ని నాని క్వాష్ పిటిషన్పై నేడు ఏపీ హైకోర్టు విచారణ.. రప్పా రప్పా వ్యాఖ్యలపై నమోదైన కేసు క్వాష్ చేయాలని పేర్ని పిటిషన్
ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్ల మీద నేడు ఏసీబీ కోర్టు విచారణ.. జైల్లో కొన్ని వసతులు కల్పించాలని, ఇంటి భోజనానికి అనుమతి ఇవ్వాలని, వారంలో ఆరు ములాఖాత్లు ఇవ్వాలని, టీవీ ఏర్పాటు చేయాలని పిటిషన్.. నేడు విచారణ జరపనున్న న్యాయస్థానం
నేటితో ముగియనున్న లిక్కర్ స్కాం కేసులో నిందితుల రిమాండ్.. 11 మంది నిందితులను నేడు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్న పోలీసులు.. గత 2 పర్యాయాలు నిందితులను వర్చువల్ విధానంలో హాజరుపరిచిన పోలీసులు
నేడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పు.. కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు నిందితుడు.. అనంతబాబుకు శిక్ష పడనుందా అనే దానిపై ఉత్కంఠ
ఇవాళ టీటీడీ పాలకమండలి సమావేశం.. 45 అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్న పాలకమండలి.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 3 నిర్మాణం ప్రతిపాదనలపై చర్చించనున్న పాలకమండలి
నేటి నుండి రాజమండ్రి ఏపీ పేపర్ మిల్లు కార్మికుల సమస్యలపై రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆమరణ నిరాహార దీక్ష
అద్దంకి మండలం వెంపరాలలో సుపరిపాలన-తొలి అడుగు-ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్.. అనంతరం సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెంలో పార్టీ నేతలతో సమీక్ష సమావేశంలో పాల్గొననున్న మంత్రి గొట్టిపాటి
ఈరోజు ఉదయం 11 గంటలకు టీజీ టెట్ ఫలితాలు విడుదల
ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర కేబినెట్ సమావేశం
నేడు న్యూజిలాండ్ vs దక్షిణాఫ్రికా మధ్య ఐదవ టీ20 మ్యాచ్, ఇంగ్లాండ్ vs భారత మహిళల మధ్య 3వ వన్డే మ్యాచ్