Telangana Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఈరోజు (శుక్రవారం, నవంబర్ 3, 2023)న విడుదల కానుంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కావాల్సిన అన్ని ఏర్పాటు చేసింది. దీంతో నేటి నుంచి ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. కావున బి ఫారాలు పొందిన అభ్యర్థులు నేటి నుంచి నామినేషన్లు వేయవచ్చు. ఎన్నికల రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. కాబట్టి.. నామినేషన్ వేసేందుకు వచ్చే వారు తొందరపడకుండా కొద్ది మందితో కార్యాలయానికి రావాలని.. మద్దతుదారులు, కార్యకర్తలను కార్యాలయం బయటే ఉండాలని ఎన్నికల సంఘం పేర్కొంది.
Read Also:Gold Price Today : పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ షాకిస్తున్న ధరలు.. ఈరోజు ఎంతంటే?
ఈ నామినేషన్లను ముందుగానే చేయడం మంచిది. ఆదివారం నామినేషన్లు స్వీకరించరు. అందుకే నామినేషన్ వేయడానికి ఇంకా 7 రోజులు మాత్రమే సమయం ఉంది. ఆఖరి నిమిషంలో హడావుడి చేసే బదులు ముందుగా ప్లాన్ చేసుకోవడం మంచిది. నవంబర్ 13న నామినేషన్ల పరిశీలన.. ఎవరైనా నామినేషన్ పత్రాన్ని సక్రమంగా పూరించకుంటే అధికారులు తిరస్కరిస్తారు. కాబట్టి అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలి. ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి. అన్ని పత్రాలు ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి. అవసరమైతే, న్యాయవాదుల మద్దతుతో దాఖలు చేయడం మంచిది. నామినేషన్ వేసి, ఆ తర్వాత ఇతర కారణాలతో ఉపసంహరించుకోవాలనుకునే వారు నవంబర్ 15లోపు విత్ డ్రా చేసుకోవచ్చని.. ఆ తర్వాత అధికారుల పని మొదలవుతుంది. నవంబర్ 30న ఎన్నికల ఓటింగ్ జరగనుంది. అన్నీ ఒకే విడతలో. డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు.. ఆ రోజు ప్రజా తీర్పు తేలనుంది.
Read Also:CPI : పార్టీ ఏ నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి నిబద్దతతో పనిచేస్తాం
జనరల్, బీసీ అభ్యర్థుల డిపాజిట్ 10 వేలు, ఎస్సి, ఎస్టీ అభ్యర్థులు 5 వేల డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఆర్వో కార్యాలయ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. నామినేషన్ వేసే వ్యక్తి తోపాటు మరో ఐదుగురికి మాత్రమే లోపలికి అనుమతి ఇస్తారు. ఆర్వో కార్యాలయం పరిసర ప్రాంతాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. ర్యాలీలు, సభలు నిషేధించారు. ఆర్వో కార్యాలయానికి 100 మీటర్ల వరకు అభ్యర్థి సంబంధించిన 3 వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. అభ్యర్థి నామినేషన్ వేసే ఒక్క రోజు ముందు రాష్ట్రంలోని ఏదైనా బ్యాంక్ లో ఎన్నికల కోసం ప్రత్యేక బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన బ్యాంక్ ఖాతాను నామినేషన్ తోపాటు ఆర్వో కార్యాలయంలో సబ్మిట్ చేయాలి. ఎన్నికల కోసం ప్రతి ఖర్చు ఈ ఖాతా నుండే చేయాలి. ఇవాళ్టి నుండే అభ్యర్థి ఖర్చును వ్యయ పరిశీలిలకులు లెక్కగట్టుతారు.