Today Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్‌కి ఈ వారం శుభారంభం లభించలేదు. ఇవాళ సోమవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన రెండు కీలక సూచీలు.. సాయంత్రం కూడా నష్టాలతోనే ముగిశాయి. బెంచ్ మార్క్ విలువల కన్నా కింద క్లోజ్ అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుతుండటం వల్ల ఇంట్రాడేలో నష్టాలు మరింత పెరిగాయి. ఐటీ.. మెటల్.. మరియు కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిణ్ని ఎదుర్కొన్నాయి.
అదానీ గ్రూప్‌లో పెట్టుబడులపై ఆందోళనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఎల్‌ఐసి షేర్ విలువ ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరుకుంది. చివరికి.. సెన్సెక్స్.. 175 పాయింట్లు కోల్పోయి 59 వేల 288 పాయింట్ల వద్ద ఎండ్ అయింది. నిఫ్టీ.. 73 పాయింట్లు తగ్గి 17 వేల 392 పాయింట్ల వద్ద ముగిసింది.
Vostro Accounts: విదేశాలతో రూపాయల్లో వాణిజ్యానికి వోస్ట్రో అకౌంట్లు ఎలా పనిచేస్తాయి?
సెన్సెక్స్‌లో ఆర్థిక సంస్థలు కోలుకున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ రెండు శాతం వరకు లాభపడ్డాయి. Broader Marketలో బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ మరియు స్మాల్‌క్యాప్ 1 పాయింట్ 2 శాతానికి పైగా డౌన్ అయ్యాయి. వ్యక్తిగత స్టాక్స్ విషయానికొస్తే.. పేటీఎం సంస్థ షేర్లు 5 శాతం లాభపడ్డాయి. ఇందులో వాటాను సొంతం చేసుకునేందుకు టెలికం దిగ్గజం సునిల్ మిత్తల్ ప్రయత్నాలు చేస్తుండటం కలిసొచ్చింది.
స్పైస్‌జెట్ షేర్లు 6 శాతం పెరిగాయి. రంగాల వారీగా చూస్తే.. నిఫ్టీ బ్యాంక్, రియాల్టీ ఇండెక్స్‌లు రాణించాయి. మీడియా ఇండెక్స్ 4 శాతం మునిగింది. 10 గ్రాముల బంగారం ధర 97 రూపాయలు తగ్గింది. గరిష్టంగా 55 వేల 335 రూపాయల వద్ద ట్రేడ్ అయింది.
కేజీ వెండి రేటు 233 రూపాయలు కోల్పోయింది. అత్యధికంగా 63 వేల 200 రూపాయలు పలికింది. క్రూడాయిల్ ధర స్వల్పంగా 28 రూపాయలు పెరిగింది. ఒక బ్యారెల్ ముడిచమురు 6 వేల 370 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 10 పైసలు బలహీనపడింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 82 రూపాయల 87 పైసల వద్ద స్థిరపడింది.