తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఇవాళ్టితో ( ఆదివారం ) ముగియనున్నాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాలు కేసీఆర్ సర్కార్ కు చివరివి. మరో మూడు నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇక, చివరి రోజైన ఈ రోజు సీఎం కేసీఆర్ ప్రసంగం చేయనున్నారు. ఎన్నికలు రానున్నందున కేసీఆర్ సభలో ఏం మాట్లాడతారనే దానిపై ఉత్కంఠ నెలకొనింది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల చూపు ఈ ప్రసంగంపైనే ఉంది. ఐఆర్, పీఆర్సీ లాంటి వాటిపై కేసీఆర్ కీలక ప్రకటన చేస్తారని వారు ఎదురు చూస్తున్నారు. అంతేకాక, ఎన్నికలు ఉన్నందున సంక్షేమ పథకాల విషయంలోనూ కేసీఆర్ మరిన్ని ప్రకటనలు చేస్తారనే సమాచారం.
Read Also: What Today: ఈరోజు ఏమున్నాయంటే..?
ఇవాళ ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. శాసన సభలో మొదట జీరో అవర్ జరుగనుంది. తర్వాత మంత్రి హరీశ్ రావు కాగ్ రిపోర్టును సభలో ప్రవేశ పెట్టనున్నారు. ఈరోజే మరో 5 ప్రభుత్వ బిల్లులు కూడా అసెంబ్లీలో సర్కార్ ప్రవేశ పెట్టనున్నారు. అనంతరం 9 ఏళ్ల తెలంగాణలో అభివృద్ధి పై స్వల్పకాలిక చర్చ జరుగనుంది. ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీకి సీఎం కేసీఆర్ చేరుకుంటారు. తెలంగాణలో అభివృద్ధిపై జరిగిన స్వల్ప కాలిక చర్చలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. దాదాపు 2 గంటల పాటు సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారని తెలుస్తోంది. అయితే, ఈ రోజు సభలో ప్రభుత్వం ఐదు ప్రభుత్వ బిల్లులు ( కౌన్సిల్ లో) ప్రవేశపెట్టనుంది. ఇక ఇవాళ్టి సభలో ఆర్టీసీ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టడం లేదు.
Read Also: Railway Track: రైల్వే ట్రాక్‌పై రాళ్లను ఎందుకు ఉంచుతారు.. దాని వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో తెలుసా?
