* వైఎస్ షర్మిల అరెస్ట్ నిరసనగా నేడు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపు నిచ్చిన YSR తెలంగాణ పార్టీ..అన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వ దిష్టి బొమ్మలు దగ్ధం చేయాలని పిలుపు
*నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సంస్థల్లో పని చేసే ఆర్టిజన్స్ నిరవధిక సమ్మె.. ఆర్టిజెన్స్ విధులకు రాకుంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తాని హెచ్చరించిన యాజమాన్యం
*నేడు బీఆర్‌ఎస్ ప్రతినిధుల సభలు.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మంగళవారం బీఆర్‌ఎస్ పార్టీ ప్రతినిధుల సభలు
* షర్మిల బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలనీ పోలీసులకు ఆదేశం..తదుపరి విచారణ ఇవాళ్టికి వాయిదా వేసిన నాంపల్లి కోర్టు
* మాడుగుల మండలం ఓ.కె.శ్రీరాంపురం, గొట్టివాడ గ్రామంలో నిర్వహిస్తున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు
*నేడు వరంగల్ శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కల్యాణోత్సవం.. రాత్రి 7 గంటలకు దేవాలయం ఆరుబయట అంగరంగ వైభవంగా నిర్వహచించేందకు ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ పూజారులు, అధికారులు
*హన్మకొండ జిల్లా లో 3 వ రోజు కోనసాగనున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర…పుపుల్స్ మార్చ్ లో భాగంగా నేడు కేయు విద్యార్థులతో భేటి కానున్న భట్టి విక్రమార్క
* నేడు ఆళ్లగడ్డ మండలం ఎగువ అహోబిలంలో శ్రీ లక్ష్మి నరసింహస్వామి జయంతి ఉత్సవాలలో భాగంగా ఉదయం ధ్వజారోహణం, మధ్యాహ్నం అభిషేకం, సాయంత్రం బేరి పూజ, రాత్రి సింహ వాహనం
* కర్నూలులో నేడు ప్రభుత్వ, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మహా ధర్నా
* నేడు శ్రీశైలంలో వైశాఖ శుద్ధ పంచమి సందర్భంగా ఆదిశంకరుల జయంతోత్సవం.. పాలధార పంచధారల వద్ద గల శంకర మందిరంలో అదిశంకరాచార్యులకు దేవస్థానం అర్చకులు ప్రత్యేక పూజలు
* నేటి నుండి శ్రీశైలంలో తెల్లరేషన్ కార్డు దారులకు ఉచిత సామూహిక సేవలు ప్రారంభం.. నేడు ఉచిత సామూహిక సేవలో భాగంగా చంద్రవతి కళ్యాణమండపంలో 250 మంది తెల్లరేషన్ కార్డు భక్తులకు శ్రీస్వామివారి అభిషేకం
* అమరావతిలో ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ చారిత్రక, అసెంబ్లీ ప్రసంగాలు పుస్తక విడుదల
* విజయవాడలో ఉపాధ్యాయుల సస్పెన్షన్లను నిరసిస్తూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో నేడు ఆందోళనలు….నేడు, రేపు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపనున్న ఉపాధ్యాయులు
* అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియం వేదికగా గుజరాత్ వర్సెస్ ముంబై మ్యాచ్.. రాత్రి 7.30 గంటలకు ప్రారంభం
*కేరళలో తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభం.. తిరువనంతపురం నుంచి కాసరఘోట్ వరకూ రైలు సర్వీస్.. నేడు ప్రారంభించనున్న ప్రధాని మోడీ