Site icon NTV Telugu

Maharashtra: నేడు మహారాష్ట్రలో సీట్ల పంపకాలపై చర్చ.. మహావికాస్ అఘాడీ నేతల కీలక భేటీ

Maharastra

Maharastra

Maha Vikas Aghadi: లోక్‌సభ ఎన్నికల్లో భారత కూటమి నుంచి మహారాష్ట్రలో ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారు? అనే విషయం నేడు కాంగ్రెస్, శివసేన (యుబీటీ), ఎన్‌సీపీ సమావేశంలో దీనిపై ప్రధానంగా చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు. అయితే, మహారాష్ట్రకు సంబంధించి భారత (I.N.D.I.A.) కూటమి సమావేశం జరగనుంది. ఇందులో కాంగ్రెస్, శివసేనతో పాటు ఎస్పీ నాయకులు పాల్గొంటారు. లోక్‌సభ ఎన్నికల సీట్ల పంపకంపై భారత కూటమిలోని పార్టీలు చర్చించనున్నారు. మహారాష్ట్రలో పొత్తుకు సంబంధించి మధ్యాహ్నం 1 గంట నుంచి ఈ సమావేశం ప్రారంభం కానుంది. త్వరలో ఢిల్లీలో మహావికాస్ అఘాడీ నేతల భారీ సమావేశం జరగనుంది.. అలాగే, అందులో సీట్ల పంపకంపై కూడా చర్చ జరుగుతుందని ఇండియా కూటమి నుంచి సమాచారం. జనవరి 14-15 మధ్య ఢిల్లీలో మహావికాస్ అఘాడీ సమావేశం జరగబోతుంది. దీనికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటు శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే హాజరవుతారు. ఇందులో సీట్ల పంపకంపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

Read Also: Komaram Bheem: కుమ్రం భీంజిల్లాలో రెండు పులులు మృతి.. పులి కళేబరాన్ని గుర్తించిన అటవీ శాఖ

ఇక, ఆదివారం బీహార్‌లో సీట్ల పంపకానికి సంబంధించి కాంగ్రెస్ తో పాటు ఆర్‌జెడీ నాయకులు వర్చువల్ సమావేశం అయ్యారు. ఆ తర్వాత ఢిల్లీ, పంజాబ్‌లలో సీట్ల పంపకాలపై ఆమ్‌ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌ల మధ్య నిన్న (సోమవారం) చర్చ జరిగింది. ఈ సమావేశంలో లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకాలపై లోతైన కొనసాగింది. అయితే, సిట్ల పంపకాలపై మాత్రం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.. రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అంగీకరించాయి. ఢిల్లీలో ఆప్ 4 సీట్లు, కాంగ్రెస్ మూడు సీట్లు గెలుచుకోవచ్చని పలు వర్గాలు తెలిపాయి. అయితే, పంజాబ్ తో పాటు చండీగఢ్‌లలో ఆప్ 50-50 ఫార్ములాపై అంగీకరించే అవకాశం ఉంది. అయితే దీంతో పాటు గుజరాత్‌లో ఒక సీటు, హర్యానాలో మూడు, గోవాలో ఒక సీటును ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇక, జనవరి 11 లేదా 12వ తేదీల్లో సమావేశమై తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.

Read Also: YSRCP: ఒంగోలు ఎంపీ సీటుపై తొలగిన అనిశ్చితి..! ఆయనకు లైన్‌ క్లియర్‌..!

అలాగే, బీహార్‌లో లోక్‌సభ ఎన్నికల కోసం భారత కూటమి మధ్య సీట్ల పంపకానికి సంబంధించి గతంలోనే ఒప్పందం కుదిరింది. ఈ సమావేశానికి కాంగ్రెస్‌ తరఫున అశోక్‌ గెహ్లాట్‌, ముకుల్‌ వాస్నిక్‌, భూపేష్‌ బాఘెల్‌, సల్మాన్‌ ఖుర్షీద్‌, బీహార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అఖిలేష్‌ సింగ్‌లు హాజరయ్యారు. బీహార్‌లోని 40 స్థానాల్లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలకు ఇవ్వాల్సిన సీట్లపై తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో 17-17- 4+1-2 ఫార్ములాను ఆమోదించే ఛాన్స్ ఉంది. ఇక, జేడీయూ, ఆర్జేడీలకు 17 సీట్లు, కాంగ్రెస్‌కు ఒక రాజ్యసభ సీటుతో పాటు 4 లోక్‌సభ సీట్లు దక్కనున్నాయి. లెఫ్ట్ పార్టీలకు 2 సీట్లు ఇవ్వొచ్చు అని తెలుస్తుంది.

Exit mobile version