Site icon NTV Telugu

Lok Sabha Election 2024: నేడు కస్గంజ్‌లో అమిత్ షా, బరేలీలో సీఎం యోగి పర్యటన..

Amitsha

Amitsha

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ సీనియర్ నేతలు ఇవాళ (ఆదివారం) కూడా తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాస్గంజ్, మెయిన్‌పురి, ఇటావాలో నిర్వహించే బహిరంగ సభలలో పాల్గొననున్నారు. ఆ తర్వాత సాయంత్రం కాన్పూర్‌లోని తిలక్ నగర్ ప్రాంతంలో బీజేపీ సంస్థాగత సమావేశంలో ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారు.

Read Also: LSG vs RR : లక్నోపై రాజస్థాన్‌ ఘన విజయం

అలాగే, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సైతం ఆమ్లా (బరేలీ), బదౌన్, జలేసర్ (ఎటా)లలో బీజేపీ నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. ఇక, యూపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ చౌదరి కస్గంజ్, మెయిన్‌పురి, ఇటావాలో అమిత్ షా పాల్గొనే బహిరంగ సభలు, కాన్పూర్‌లో ఆయన సమావేశానికి హాజరుకానున్నారు. ఇక, కాన్పూర్‌లో జరిగే కేంద్ర హోంమంత్రి సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధరంపాల్ సింగ్, ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య బండా హాజరుకానున్నారు. ఈ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై పార్టీ నేతలకు అమిత్ షా దిశానిర్థేశం చేయనున్నారు.

Exit mobile version