IND vs WI 4th T20I: ఐదు టీ20ల సిరీస్‌లో 2-1తో విండీస్ జట్టు ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్ గెలిచేందుకు ఒక్క విజయం దూరంలో ఉంది. రెండూ మ్యాచ్‌లు ఓడిపోయి మరో ఓటమి ఎదురైతే సిరీస్ చేజారే పరిస్థితిలో పుంజుకున్న టీమిండియా.. మూడో టీ20లో గెలిచి హమ్మయ్య అనుకుంది. కానీ కథ అంతటితో ముగియలేదు. నాలుగో టీ20లో ఓడినా సిరీస్ చేజారిపోతుంది. ఈ నేపథ్యంలో శనివారం జరిగే నాలుగో మ్యాచ్‌లో భారత్, వెస్టిండీస్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. నాలుగో టీ20 మ్యాచ్ అమెరికాలోని ఫ్లోరిడాలో గల లాడర్‌హిల్ సిటీలో జరగనుంది. ఐదో టీ20 కూడా అక్కడే జరగనుంది. మూడో టీ20 విజయంతో ఆశలను సజీవం చేసుకున్న హార్దిక్ సేన.. నాలుగో టీ20లో కూడా విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. మరి చివరి 2 టీ20ల కోసం అమెరికాలో అడుగుపెట్టిన భారత్ ఫలితం రాబడుతుందో వేచి చూడాల్సిందే.
Also Read: Mumbai Airport: ముంబై ఎయిర్‌పోర్ట్‌లో రూ.1.49 కోట్ల వజ్రాలు సీజ్.. ఒకరి అరెస్టు
ఈ టూర్‌లో ఇప్పటి వరకు జరిగిన అన్ని మ్యాచ్‌లతో పోలిస్తే అమెరికాలోని ఈ రీజినల్ పార్క్ స్టేడియం బ్యాటింగ్‌కు బాగా అనుకూలించే మైదానం. అయితే బ్యాటింగ్‌కు బాగా అనుకూలించే లాడర్‌హిల్ పిచ్‌పై విండీస్ విధ్వంసక వీరులను ఆపి సిరీస్ సాధించడం అంత తేలిక కాదు. టీమిండియా బ్యాటింగ్‌ను ఓపెనర్ల సమస్య వెంటాడుతోంది. ఓపెనర్లు అంతగా రాణించకపోవడంతో మిడిలార్డర్‌పై ఒత్తిడి పడుతోంది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఫామ్ కాస్త ఆందోళన కలిగిస్తోంది. భారత బ్యాటర్లలో తిలక్‌వర్మ ఒక్కడే రాణిస్తుండగా.. సూర్యకుమార్ చివరి మ్యాచ్‌లో ఫామ్‌లోకి రావడం టీమిండియాకూ సానుకూలాంశంగా మారింది. భారత బౌలర్లలో స్పిన్నర్లు కుల్దీప్, చాహల్, అక్షర్ ఫర్వాలేదనిపిస్తున్నారు. కుల్‌దీప్, చాహల్, అర్ష్‌దీప్ కీలకం కానున్నారు. పరుగుల పిచ్ మీద విండీస్ బ్యాటర్లను ఆపడం భారత బౌలర్లకు తేలిక కాదు. ముఖ్యంగా పూరన్, రోమన్ పావెల్, హెట్‌మయర్‌లకు అవకాశమిస్తే మ్యాచ్‌ను లాగేసుకుంటారు.
Also Read: Cow Attack: బాలికపై ఆవు దాడి, కాపాడుకోలేక తల్లడిల్లిన తల్లి.. నెట్టింట వీడియో వైరల్
విండీస్ బ్యాటర్లలో ఓపెనర్లు కింగ్, మేయర్స్‌లలో ఒక్కరే ఫామ్ కనబరుస్తున్నారు. మిడిలార్డర్‌లో పూరన్, కెప్టెన్ పావెల్ ఆకట్టుకుంటున్నా.. హెట్‌మేయర్ విఫలమవుతున్నాడు. గాయంతో మూడో మ్యాచ్‌కు దూరమైన ఆల్‌రౌండర్ హోల్డర్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అదే జరిగితే రోస్టన్ చేజ్ పెవిలియన్‌కే పరిమితం కానున్నాడు. అతడితో పాటు రొమారియో షెఫర్డ్, అకీల్ హొసీన్, మెకాయ్, అల్జారి జోసెఫ్‌లతో విండీస్ బౌలింగ్ మెరుగ్గానే కనిపిస్తోంది.
తుది జట్లు (అంచనా).. భారత్: యశస్వి, శుభ్‌మన్, సూర్యకుమార్, తిలక్ వర్మ, సంజు శాంసన్, హార్దిక్ (కెప్టెన్), అక్షర్ పటేల్, కుల్‌దీప్, అర్ష్‌దీప్, ముకేశ్ కుమార్, చాహల్.
వెస్టిండీస్: మేయర్స్, కింగ్, చార్లెస్, పూరన్, రోమన్ పావెల్ (కెప్టెన్), హెట్‌మయర్, హోల్డర్/చేజ్, రొమారియో షెఫర్డ్, అకీల్ హొసీన్, అల్జారి జోసెఫ్, మెకాయ్.